For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: హౌజ్ లో నిరాహారదీక్ష చేసిన ఆ కంటెస్టెంటే ఎలిమినేట్? ఐదో స్థానంలో ఉన్నకూడా

  |

  బిగ్ బాస్.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు అన్న మాటకు జస్టిఫికేషన్ ఇచ్చినట్లు అనూహ్య పరిణామాలు ఏర్పడుతున్నాయి బిగ్ బాస్ తెలుగు 6 వ సీజన్లో. బిగ్ బాస్ చరిత్రలో కంటెస్టెంట్లను నేరుగా బిగ్ బాస్ (హోస్ట్ నాగార్జున ద్వారా) నామినేట్ చేసింది లేదు. అలాంటింది తక్కువ పర్ఫామెన్స్ ఇచ్చిన కారణంగా అర్జున్ కల్యాణ్, కీర్తి భట్ లను నేరుగా నామినేట్ చేశారు. అలాగే సీజన్ లో మళ్లీ కెప్టెన్ కాకుండా ఓటింగ్స ద్వారా నిషేధం ప్రకటించి షాక్ ఇచ్చారు. మెరీనా-రోహిత్ జంటగా ఒక్కరిగా ఆడతారని చెప్పి ఇటీవల ఐదో వారం నామినేషన్లలో సింగిల్ గా ఆడాలని సూచించి మరో షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.

  టాప్ 5 స్థానంలో ఉన్న

  టాప్ 5 స్థానంలో ఉన్న

  ఇదే కాకుండా సింగర్ రేవంత్ భార్య అన్విత సీమంతం వేడుకలను బిగ్ బాస్ హౌజ్ లో టెలీకాస్ట్ చేయించి ఇంటి సభ్యులందరని ఆశ్చర్యపర్చడమే కాదు సంతోషించేలా చేశాడు బిగ్ బాస్. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత ఎమోషనల్ సీన్ గా ఈ వేడుక అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా ఐదో వారం అనూహ్యంగా టాప్ 5 స్థానంలో ఉన్న కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. మరి ఆ కంటెస్టెంట్ పస్తులున్నందుకే కారణమా.. మరి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయో తెలియాలంటే దీనిపై ఓ లుక్కేయాల్సిందే.

  4 వారాల్లో నలుగురు బయటకు..

  4 వారాల్లో నలుగురు బయటకు..

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్‌లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్లుగా కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో 4 వారాల్లో షానీ, అభినయ, నేహా, ఆరోహిలు వెళ్లిపోయారు.

   నామినేషన్లలో 8 మంది..

  నామినేషన్లలో 8 మంది..

  ఇక, ఈ వారంలో ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌లు నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ ఆరో సీజన్‌లో నాలుగు వారాల్లో నలుగురు బయటకు వెళ్లిపోయారు. బిగ్ బాస్ ఆరో సీజన్ ఐదో వారంలో రేవంత్, గీతూ వంటి టాప్ ప్లేయర్స్ నామినేషన్స్‌లోకి రాలేదు. దీంతో ఉన్న వారిలోనే మంచిగా ఆడే కంటెస్టెంట్లకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.

  జబర్ధస్త్ ఫైమా, ఇనాయా మధ్య గట్టి పోటి..

  జబర్ధస్త్ ఫైమా, ఇనాయా మధ్య గట్టి పోటి..

  అందులో జబర్ధస్త్ ఫైమా, ఇనాయా సుల్తానా మధ్య పోటాపోటీగా ఓటింగ్ జరిగిందట. అయితే, పోలింగ్ ముగిసే సమయానికి ఫైమా టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఆమెకు కొన్ని ఓట్ల దూరంలోనే ఇనాయా ఉంది. ఓటింగ్ ముగిసే సమయానికి అర్జున్ కల్యాణ్ మూడో స్థానంలో, వాసంతి నాలుగో స్థానంలో, నిన్నటి వరకూ చివర్లో ఉన్న చలాకీ చంటి ఐదో స్థానానికి వచ్చాడని బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది.

  ఎనిమిదో స్థానంలో మెరీనా..

  ఎనిమిదో స్థానంలో మెరీనా..

  ఆరో సీజన్ ఐదో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో బాలాదిత్య ఆరో స్థానానికి చేరుకున్నాడట. దీంతో ఊహించని విధంగా ఆది రెడ్డి ఏడో స్థానానికి పడిపోయాడని తెలిసింది. ఇక, ఇందులో మెరీనా అబ్రహం ఎనిమిదో స్థానంలో ఉందట. కానీ అనూహ్యంగా ఐదో స్థానంలో ఉన్న చంటి ఎలిమినేట్ అయ్యాడని తాజా టాక్. రెండు మూడు రోజుల నుంచి హౌస్‌లో ఏమీ తినడం లేదట. ఈ విషయాన్ని కొందరు కంటెస్టెంట్లు మాట్లాడుకోవడంతో ఇది బయటకు వచ్చింది. ఆ తర్వాత కొందరు బ్రతిమాలినా అతడు తినలేదు.

  రెమ్యునరేషన్ కు తగినట్లుగా కంటెంట్..

  రెమ్యునరేషన్ కు తగినట్లుగా కంటెంట్..

  ఇలా తినకుండా డల్ పర్ఫామెన్స్ ఇవ్వడం, రెమ్యునరేషన్ కు తగినట్లుగా కంటెంట్ ఇవ్వకపోవడంతో చంటిని పంపించివేస్తేనే బెటర్ అని నిర్వాహకులు అభిప్రాయపడ్డారట. మరి ఇందులో ఎంత నిజముందో శనివారం నాగార్జున వచ్చి చెప్పేదాకా తెలియదు. బిగ్ బాస్ హౌజ్ కి గ్లామర్ షో తీసుకొస్తున్నందుకు వాసంతికి, శ్రీ సత్యతో లవ్ ట్రాక్ చేసి ఇబ్బందులు పడుతున్న అర్జున్ కల్యాణ్ కు సింపథి ఓట్లతో సేఫ్ అయినట్లు సమాచారం.

  English summary
  Jabardasth Fame Chalaki Chanti Eliminated In Bigg Boss Telugu 6th Season Fifth Week Elimination Because Of Hunger Strike.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X