twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: టిక్కెట్ టూ ఫినాలే కోసం బిగ్ బాస్ చిచ్చు.. ఎదురుతిరుగుతున్న కంటెస్టెంట్స్

    |

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఈసారి ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ చాలా ఆసక్తికరంగా మారుతోంది. కంటెస్టెంట్స్ చాలా వరకు ప్రతీ గేమ్ లో కూడా చాలా సీరియస్ గా ఆడుతూ ఫైనల్ కు వెళ్ళాలని టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన ఒక ట్విస్ట్ కు ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ కూడా రివర్స్ అవుతున్నారు. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లోని హైలెట్స్ లోకి వెళితే..

    బిగ్ బాస్ ఛాలెంజ్

    బిగ్ బాస్ ఛాలెంజ్

    ముందుగా ఒక ఆరుగురికి బిగ్ బాస్ ఛాలెంజ్ ఇచ్చారు. ఈ ఛాలెంజ్ లో ఎవరైతే టాప్ పొజిషన్ కు వెళతారో వారే సేఫ్ గా ఉంటారు. మిగతా ఇంటి సభ్యులు టికెట్ టూ ఫినాలే రేస్ నుంచి తప్పుకునే ప్రమాదంలో ఉంటారని శ్రీహన్ బిగ్ ఇచ్చిన నోటీస్ గురించి చెప్పాడు. ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా గార్డెన్ ఏరియాలో ఛాలెంజ్ ను స్టార్ట్ చేశారు.

    గెలిచిన ఆదిరెడ్డి

    గెలిచిన ఆదిరెడ్డి

    కాలికి బాల్ ను కట్టుకొని ఆటలో ఛాలెంజ్ లను ఫినిష్ చేస్తూ ఉండాలి. ఇక మధ్యలో శ్రీహన్ బాల్ తెగిపోయింది. అలాగే కీర్తి ఆటలో కూడా లోపాలు ఉన్నట్లు శ్రీ సత్య గుర్తిస్తారు. ఇక చివరగా ఒక ఛాలెంజ్ లో ఆదిరెడ్డి బాల్ బాస్కెట్ నెట్ లో వేయడంతో గెలుస్తాడు. ఈ గేమ్ లో రేవంత్ కూడా గట్టిగానే పోటీ పడ్డట్లు తెలుస్తోంది.

    ఏకాభిప్రాయంతో నిర్ణయం

    ఏకాభిప్రాయంతో నిర్ణయం

    ఇక టిక్కెట్ టు ఫినాలే లో ఆరుగురు పోటీ దారుల నుంచి తదుపరి ఛాలెంజ్ లో పోటీ పడే 4 సభ్యులు ఎవరో పోటీ దారులు మాత్రమే ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకొని వారి పేర్లు బిగ్ బాస్ కు చెప్పాల్సి ఉంటుందని మరో నోటీస్ వచ్చింది. అయితే ఈ విషయంలో అందరూ కూడా ఒక్కసారిగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

    కంటెస్టెంట్స్ రివర్స్

    కంటెస్టెంట్స్ రివర్స్

    టిక్కెట్ టూ ఫినాలే లో ఏకాభిప్రాయం ఏమిటి బిగ్ బాస్ అని రేవంత్ తో పాటు ఆదిరెడ్డి శ్రీహన్ అందరూ కూడా కొంత వ్యతిరేకించారు. ఈ సమయంలో ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని మళ్ళీ అదే సోది రీజన్ చెబుతారని రేవంత్ సైతం అప్సెట్ అయ్యాడు. గేమ్ ఆడి ఓడిపోవడం అంటే ఓకే బిగ్ బాస్. కానీ ఏకాభిప్రాయం తో వెళ్లిపోతే కరెక్ట్ కాదని రోహిత్ కూడా కామెంట్ చేశాడు. గతంలో ఆ నిర్ణయం వల్లనే తనకు చాలా సార్లు ఇబ్బంది కలిగిందని రేవంత్ మరో కామెంట్ చేశాడు.

    ఎవరిని గెలవనివ్వను..

    ఎవరిని గెలవనివ్వను..

    ఇక శ్రీహన్ అయితే టిక్కెట్ టూ ఫైనల్ తనకు చాలా అవసరం అంటూ చాలా సీరియస్ గా తన నిర్ణయాన్ని చెప్పాడు. నేను తప్పకుండా ఈ గేమ్ ఆడాలని అనుకుంటున్నాను. ఇక ఏకాభిప్రాయంతో నన్ను తీసేస్తే ఒక్కరిని కూడా ఇక్కడ గెలవనివ్వను అని శ్రీహన్ కోపంగా చెప్పాడు. మరి ఈ తరహాలో రివర్స్ అవుతున్న కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

    English summary
    Bigg boss telugu 6 day 87 shocking twist in ticket to finale task
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X