Don't Miss!
- Sports
INDvsNZ : ఇదేం బౌలింగ్రా.. నువ్వే వాళ్లను గెలిపిస్తున్నావ్.. టీమిండియా పేసర్‌పై ట్రోల్స్!
- News
Breaking : మధ్యప్రదేశ్ లో కూలిన రెండు ఎయిర్ ఫోర్స్ జెట్స్-ట్రైనింగ్ లో అపశృతి..
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- Finance
Wheat Price: సామాన్యులకు శుభవార్త.. తగ్గనున్న గోధుమ పిండి ధర..
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
Bigg Boss Telugu 6: కొత్త ఛాలెంజ్ లతో చెమటలు పట్టిస్తున్న బిగ్ బాస్.. ఈసారి శ్రీహన్ vs శ్రీసత్య
బిగ్ బాస్ 6వ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. మధ్య మధ్యలో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ మళ్లీ వెంటనే బిగ్ బాస్ ఆసక్తి కలిగించే టాస్కులతో కంటెస్టెంట్స్ ను ఇరకాటంలో పడేస్తున్నాడు. పోయిన ప్రైజ్ మనీ దక్కించుకునేందుకు బిగ్ బాస్ అందరికీ అవకాశాలు ఇస్తున్నాడు. ఇక 95వ రోజు బిగ్బాస్ హౌస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అని వివరాల్లోకి వెళితే..
నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలయింది. ఆ హైలెట్స్ ఈ విధంగా ఉన్నాయి. విన్నర్ యొక్క ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బును తిరిగి సంపాదించుకునే దానికి బిగ్ బాస్ మనీ టవర్ అనే చాలెంజ్ ఒకటి ఇచ్చాడు. అయితే ఆ టవర్లో డబ్బు ఉన్న ఒక్కో బ్రిక్ తీసి బ్లూ బ్రిక్స్ పై పెట్టాలి. ఇక టవర్ కూలిపోయే వరకు ఎన్ని బ్రిక్స్ అయితే ఇంటి సభ్యులు బ్యాలెన్స్ చేయగలుగుతారో వాటికి సంబంధించిన డబ్బు యొక్క టోటల్ ఇంటి సభ్యులు గెలుచుకుంటారు అని ఇనయా సుల్తానా బిగ్ బాస్ ఇచ్చిన వివరణ గురించి తెలియజేసింది.

అయితే ఈ ఛాలెంజ్ కోసం రేవంత్ తో పాటు ఇనయా సుల్తానా కూడా పోటీ పడింది. ఒక్కొక్క బ్రిక్ చాలా ఓపికతో తీసుకుంటూ వచ్చారు. ఇక శ్రీహన్ కూడా ఈ గేమ్ లో చాలా బాగానే పోటీపడినట్లు అనిపించింది. కీర్తి కూడా బాగానే పోరాడింది కానీ ఆమె బ్రిక్స్ పెడుతున్నప్పుడు టవర్ మొత్తం కదిలిపోయింది. మిగతా వాళ్ళు చాలా జాగ్రత్తలు కూడా చెప్పారు. ఇక మరొక ఛాలెంజ్ .. వెలిగించు విజయం సాధించు అనే కొత్త టాస్క్ ఇచ్చారు. రెండు లెటర్స్ కలిగిన BB 6 బోర్డులను గార్డెన్ ఏరియాలో ఉంచారు. అయితే వాటికి బల్బులను అమర్చాలి.
లైట్ వస్తేనే ఈ ఛాలెంజ్ లో గెలిచినట్లు లెక్క. ఇక ఎవరూ ఎక్కువ స్థాయిలో లైట్లు పెడతారు అనేది ఈ గేమ్ లో హైలైట్ గా నిలవబోతోంది. శ్రీ సత్య తో పాటు శ్రీహన్ కూడా ఈ ఆటలో పోటీపడ్డాడు. ఇద్దరు కూడా ఈ ఆటలో బాగానే కష్టపడుతున్నట్లు ఆదిరెడ్డి కూడా కామెంట్ చేశాడు. అయితే మధ్యలో మాత్రం కొంత శ్రీ సత్య అసంతృప్తితో కనిపించింది. అయితే ఒక లైట్ పని చేయకపోయినా మధ్యలో ఇంకోటి పెడుతున్నావు అని రేవంత్ చెప్పడంతో అది ఆల్రెడీ వెలిగి ఆగిపోయింది అని శ్రీసత్య సమాధానం చెప్పింది. అయితే నువ్వే సెట్ చేసుకొని పెట్టాలి అని కూడా రేవంత్ చెప్పడంతో నేను ఎలక్ట్రిషన్ కాదని ఆమె మొండిగా సమాధానం చెప్పింది. మరి ఈ తరహా మాటలు ఛాలెంజ్ లో ఎలాంటి గొడవలు క్రియేట్ చేస్తాయో చూడాలి.