Don't Miss!
- News
స్మితా ఇంటికి ప్రమోషన్లపై చర్చించేందుకే వెళ్లా: ఆనంద్ కుమార్, రాత్రే ఎందుకంటే?
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్పై వెటరన్ కామెంట్స్!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Bigg Boss Telugu 6: టీఆర్పీ దెబ్బకు ప్లాన్ మొత్తం తారుమారు.. నష్టాలు రాకుండా ఎస్కేప్!
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ అట్టహాసంగా మొదలయినప్పటి కూడా టీఆర్పీ మాత్రం చాలా దారుణంగా వచ్చింది. ఒక విధంగా ఈ సారి బిగ్ బాస్ ఫ్లాప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. బిగ్ బాస్ పిసినారి తనంతో తక్కువ ఖర్చుతో ఊహించని స్థాయిలో లాభాలను అర్జించాలని అనుకున్నప్పటికి ప్లాన్ రివర్స్ అయింది. ఇక బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ నష్టాలు రాకుండా ఎస్కేప్ అయ్యే విధంగా మరో ప్లాన్ వేసినట్లు అనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

హోస్టింగ్ విషయంలో..
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మొదలవ్వడానికి ముందు నాగార్జున ఈసారి హోస్ట్ అని అనగానే మళ్ళీ ఆయనేనా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. గత మూడు సీజన్స్ కు కూడా నాగ్ హోస్ట్ చేసిన విధానం బాగానే క్లిక్ అయ్యింది. ఓటీటీ నాన్ స్టాప్ షో కూడా హిట్ అయ్యింది. కానీ 6వ సీజన్ మొదటి ఎపిసోడ్ కు మాత్రం అంతగా క్రేజ్ రాలేదు. నాగ్ కూడా బోర్ కొట్టేసి ఉండవచ్చనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

అదొక మైనెస్
అయితే బిగ్ బాస్ ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ను సెలెక్షన్ చేసిన విధానం కూడా డిజాస్టర్ అయ్యిందని చెప్పవచ్చు. అసలు ఇందులో సెలబ్రెటీస్ ఎవరు ఉన్నారు అనే తరహాలో కామెంట్స్ కూడా వచ్చాయి. సగంలో సగం కూడా ఎవరు ఆడియెన్స్ కు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయారు. సింగర్ రేవంత్, చలాకి చంటి తప్పితే ఎక్కువ స్థాయిలో జనాల్లో ఆదరణ ఉన్నవారు లేకపోవడం కూడా ఓ వర్గం జనాలకు ఈ సారి సీజన్ అంతగా కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు.

చిరాకు తెప్పించింది..
అంతే కాకుండా 21 మందిని ఒకేసారి హౌస్ లోకి రప్పించడం కూడా కొంత చిరాకు తెప్పించింది. అసలే గంట ఎపిసోడ్ లో అంతమంది గురించి జనాలు తెలుసుకోవడం ఏమాత్రం సాధ్యపడదు. ఆ విధంగా జనాల్లో కొంత రొటీన్ అని బోర్ కొట్టేసింది. ఒక విధంగా జనాల సంఖ్య తగ్గుతున్న కొద్దీ రేటింగ్ శాతం పెరుగుతోంది. ఇక రేటింగ్స్ లేకపోవడం వలన బిగ్ బాస్ ఈసారి డబుల్ ఎలిమినేషన్స్ తో అందరికి షాక్ ఇచ్చాడు.

అందుకే అలా..
ఇక ఈసారి కొంతమందికి అత్యధికంగా రెమ్యునరేషన్స్ కూడా ఇచ్చారు. అయితే రేటింగ్ తగ్గుతూ ఉండడం వలన ఆదాయం లేకపోవడంతో బిగ్ బాస్ షోకు ఉపయోగం లేని వారిని తీసేస్తూ వచ్చారు. ముఖ్యంగా అందులో అత్యదిక రెమ్యునరేషన్ తీసుకున్న వారి సంఖ్యనే ఎక్కువగా ఉందట. అందులో చాలకి చంటి కూడా టాప్ లో పేమెంట్ అందుకున్నాడాని చెప్పవచ్చు. అదే రేంజ్ లో తీసుకున్న వారిని కూడా తొందరగానే హౌస్ లో నుంచి వెళ్లిపోయారు.

వైల్డ్ కార్డ్ లేదు
అసలైతే ఈసారి బిగ్ బాస్ లోకి కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలను వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి రప్పించాలని అనుకున్నారు. ముఖ్యంగా కామెడీ యాంగిల్ లో ఈసారి ఎవరు ఆకట్టుకోలేదు అని మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ఒక మాజీ జబర్దస్త్ కమెడియన్ తో మాట్లాడినప్పటికి కూడా హౌస్ లోకి తీసుకురాలేదు. తీసుకొచ్చినా లాభం ఉండదని అందరికి క్లారిటీ వచ్చేసినట్లుంది.

టీఆర్పీ బాగా తగ్గడం వలన
ఏదేమైనా ఈసారి బిగ్ బాస్ దెబ్బకు అనుకున్నట్లుగా బిగ్ బాస్ షో కొనసాగలేదు. డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉండకూడదని అనుకున్నారు. అలాగే టాప్ పేమెంట్స్ అందుకున్న వారిని కూడా తీయకూడదని అనుకున్నారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో కొందరిని రప్పించాలని చూశారు. కానీ టీఆర్పీ బాగా తగ్గడం వలన మళ్ళీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మరి మిగిలిన 3 వారాల్లో అయినా బిగ్ బాస్ రేటింగ్స్ పెరుగుతాయో లేదో చూడాలి.