Don't Miss!
- News
15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ: మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్గా భారతి
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Sports
పిచ్ది ఏముందన్నా.. మనలో దమ్ముండాలి: సూర్యకుమార్ యాదవ్
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Bigg Boss Telugu 6: ఫ్లాప్ అయిన బిగ్ బాస్ ప్లాన్.. అందుకే ఇంత త్వరగా ఫీనిషింగ్ టచ్!
బిగ్ బాస్ తెలుగు గతంలో మాదిరిగా అయితే ఆకట్టుకోవడం లేదు అనే కామెంట్స్ ఈసారి ఎక్కువగా వచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన ఐదు సీజన్స్ ఒక తరహాలో కొనసాగితే 6వ సీజన్ మాత్రం మరొక తరహాలో కొనసాగింది. అసలు కంటెంట్ విషయంలోనే బిగ్ బాస్ ఈసారి జాగ్రత్తలు తీసుకోలేదు అని కామెంట్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి. ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ మాత్రం ఈసారి అత్యధిక మందిని హౌస్ లోకి రప్పించిన విషయం తెలిసిందే. అయితే ఎక్కువ రోజులు ఈసారి బిగ్ బాస్ షోను కొనసాగించాలనుకొని మళ్ళీ తక్కువ రోజులకే ముగింపు కార్డు పెడుతున్నారు. ఈసారి బిగ్ బాస్ ఎందుకు ఫ్లాప్ అయ్యింది అనే ప్రధాన కారణంలోకి వెళితే...

పెద్దగా క్లిక్ క్లిక్కవ్వలేదు
బిగ్ బాస్ లో పరిస్థితిలు అయితే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండాలి. లేకపోతే చూసే ఆడియన్స్ కు చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. అంతేకాకుండా బిగ్ బాస్ కూడా ప్లాన్స్ మారుస్తూ కంటెస్టెంట్స్ ను ఇరకాటంలో పెట్టే టాస్కులను కూడా ఎక్కువగా పెడుతూ ఉండాలి. కానీ ఈసారి టాస్కులు అయితే పెద్దగా క్లిక్ అయ్యింది లేదు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ అయితే చాల వరకు ఒరిజినల్ క్యారెక్టర్స్ కాకుండా ఏదో నటించినట్లుగానే అనిపించింది.. అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

ఆ విషయంలో కూడా ఫెయిల్
బిగ్ బాస్ 6వ సీజన్లో మొత్తంగా 21 మందిని తీసుకువచ్చారు. ఈ రేంజ్ లో తీసుకువచ్చారు అంటే తప్పకుండా ఈసారి బిగ్ బాస్ షో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎక్కువ మంది వచ్చినప్పటికీ అందులో జనాలలో గుర్తింపు అందుకున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. అసలు ఎవరు వీళ్లు అనే తరహాలో కొంతమందిని తీసుకువచ్చారు. ఆ విషయంలో కూడా బిగ్ బాస్ ఈసారి దారుణంగా ఫెయిల్ అయ్యాడు.

న్యాయంగా జరగడం లేదు
ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో అయితే ఎంతో ఆసక్తిని కొనసాగిస్తూ ఉండేలా చేయాలి. కానీ ఈసారి కూడా ప్రేక్షకులు ఆ విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపలేదు. ఎందుకంటే ఉండాల్సిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు.. వెళ్ళిపోవాల్సిన వారు ఉంటున్నారు అని తరహాలో కామెంట్స్ కూడా వచ్చాయి. బలమైన కంటెస్టెంట్స్ ను కూడా తీయడం ఏమిటో అని, బిగ్ బిగ్ బాస్ ఈసారి అయితే న్యాయంగా జరగడం లేదు అనే విధంగా కామెంట్స్ కూడా వచ్చాయి.

రేటింగ్స్ అంతగా లేకపోవడంతో..
డబుల్ ఎలిమినేషన్స్ అయితే ఒక్కసారి ఉంటే సరిపోతుంది. కానీ ఈసారి బిగ్ బాస్ 2 సార్లు పెట్టడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకు కారణం ఈసారి రేటింగ్స్ అంతగా లేకపోవడంతో వెంటనే షోను ముగించాలి అని అనుకున్నారని కూడా ఒక టాక్ అయితే వినిపించింది. ఎందుకంటే నాగర్జున వచ్చిన వీకెండ్స్ లో కూడా రేటింగ్స్ అయితే పెద్దగా పెరగడం లేదు. ఆయన సీరియస్ అయినా కూడా ఆడియన్స్ మాత్రం సీరియస్ గా చూడడం లేదు.. అని మరొక టాక్ కూడా వినిపించింది.

అందుకే వైల్డ్ కార్డ్ కూడా లేకుండా..
ఏదేమైనా కూడా బిగ్ బాస్ సీజన్ 6 ఈసారి 20 వారాల వరకు కొనసాగుతుంది అని బిగ్ బాస్ మొదట ప్లాన్ చేసుకొని ఈ సీజన్ స్టార్ట్ చేయడం జరిగిందట. కానీ రేటింగ్స్ దారుణంగా పడిపోవడంతో ఇప్పుడు 15 వారాలకి ముగింపు పలకాల్సి వస్తుంది. మధ్యలో వైల్డ్ కార్డులు కూడా తేవాలని అనుకున్నారు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. రీఎంట్రీ కూడా ఇప్పించాలని బిగ్ బాస్ అనుకోలేదు. దీంతో ఫైనల్ గా ఈ సీజన్ మాత్రం తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. అంతే కాకుండా ఇటీవల నాగార్జున హోస్ట్ గా మానేస్తాను అని కూడా చెప్పడంతో బిగ్ బాస్ వచ్చే సీజన్ ఉంటుందా లేదా అని డౌట్ కూడా వస్తోంది.