For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ఆటంటే ఫేక్.. ఆ బుద్ధి ఎవరికీ ఉండదు.. ఎలిమినేట్ అయ్యాక చంటి షాకింగ్ కామెంట్స్

  |

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. 21 మంది కంటెస్టెంట్లు అడిగు పెట్టిన ఈ హౌజ్ లో ఐదు వారాల్లో ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ ఐదోవారం అనూహ్యంగా చలాకీ చంటి ఎలిమినేట్ అయి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అయితే ఐదో స్థానంలో ఉన్న చలాకీ చంటి ఎలిమినేట్ కావడం పలువురిని ఆశ్చర్యపరిచింది. అందుకు కారణాలుగా ఆయన ఇచ్చిన రెమ్మునరేషన్ కు తగిన పర్ఫామెన్స్ చేయలేదని, హౌజ్ లో ఏం తినకుండా పస్తులున్నాడటం వంటి తదితర విషయాలు అనిపిస్తున్నాయి. అయితే ఎలిమినేట్ అయినవారిని బిగ్ బాస్ కేఫ్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే చలాకీ చంటిని యాంకర్ శివ ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ గేమ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు చలాకీ చంటి.

   మొదట్లో ఎవరు ఊహించలేదు..

  మొదట్లో ఎవరు ఊహించలేదు..

  చంటి 5 వారంలో ఎలిమినేట్ అవుతాడు అని మొదట్లో ఎవరు ఊహించలేదు. ఒక విధంగా అతన్ని తీసేయాలని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు అనుకోలేదు. చంటి మీద ముందుగా పాజిటివ్ ఆలోచన ఉన్నప్పటికీ అతను మాత్రం బిగ్ బాస్ హౌస్ లో పెద్దగా ఆకట్టుకున్నది లేదు. గొడవలలో కూడా అనవసరంగా చర్చలు మొదలు పెడుతూ.. లాజిక్స్ లేని మాటలతో అతను కాస్త చిరాకు తెప్పించాడు అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

   ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దగా ఏమీ లేదు..

  ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దగా ఏమీ లేదు..

  బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పటికీ కూడా చంటి అందులో ఏమాత్రం సక్సెస్ కాలేకపోయాడు. ఇక అతని వల్ల ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దగా ఏమీ రావడం లేదు అని బిగ్ బాస్ ఈసారి ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ లో చలాకి చంటి ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అతనికి వారానికి 50 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. అంటే ఈ 5 వారాల్లో అతనికి బిగ్ బాస్ ద్వారా మొత్తంగా 2 లక్షల 50 వేల వరకు వచ్చినట్లు టాక్.

   ఎలిమినేట్ అయిన వారితో యాంకర్ శివ ఇంటర్వ్యూ..

  ఎలిమినేట్ అయిన వారితో యాంకర్ శివ ఇంటర్వ్యూ..

  ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలతోపాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల మనో భావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది బీబీ కేఫ్.ఈ కేఫ్ కు మొన్నటి వరకు ఐదో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ అరియానా గ్లోరీ, ఆర్జే కాజల్ వ్యాఖ్యతలుగా వ్యవహరిస్తే ఎలిమినేట్ అయిన వారిని మాత్రం కాంట్రవర్సీ యాంకర్ గా పేరు తెచ్చుకున్న శివ హోస్ట్ చేస్తున్నాడు.ఇక తాజాగా ఎలిమినేట్ అయిన చలాకీ చంటి ఈ బీబీ కేప్ కు హాజరయ్యాడు. బిగ్ బాస్ చరిత్ర తాకాలంటే ఈ చంటిసారుడి కత్తిలాంటి పంచులు దాటాలి అని చంటి బిగ్ బాస్ ప్రారంభం రోజు వచ్చిన ప్రోమోలోని డైలాగ్ ను చెప్పించిన యాంకర్ శివ తర్వాత పంచులేశారా బిగ్ బాస్ హౌజ్ లో అని వెటకారంగా ప్రశ్నించాడు. అందుకు వేశా అని చంటి ఆన్సర్ ఇవ్వగా ఎక్కడ అని యాంకర్ శివ అడిగాడు.

  ఆ లిస్ట్ ఇస్తే ఆ జనం ముందు కూర్చొబెట్టి మాట్లాడదాం..

  ఆ లిస్ట్ ఇస్తే ఆ జనం ముందు కూర్చొబెట్టి మాట్లాడదాం..

  అసలు జనాలకి చలాకీ చంటి ఏమైపోయాడు అని శివ అంటుండగా ఇది నువ్వుగా ఇస్తున్నావా.. జనం తరఫున ఇస్తున్నావా.. అని చంటి అంటే.. జనం తరఫున నేను ఒక జనంలా ఇస్తున్నా అని శివ చెబుతాడు. దానికి ఏ జనం తరఫున నీకు చెప్పారో ఆ లిస్ట్ ఇస్తే ఆ జనం ముందు కూర్చొబెట్టి మాట్లాడదాం అని చంటి ఆన్సరిచ్చాడు. తర్వాత లోపలున్న ప్రతివాడు వాన్ని వాడు కాపాడుకోవడానికి ఎవర్నైనా ఇరిక్కించడానికి ప్రయత్నిస్తున్నాడని చంటి చెప్పాడు.

   మీ తప్పేం లేదు బిగ్ బాస్ తప్పు..

  మీ తప్పేం లేదు బిగ్ బాస్ తప్పు..

  దీనికి అంటే మీ తప్పేం లేదు బిగ్ బాస్ తప్పు.. గేమ్ ఆపడం అని శివ అంటే.. ఎస్.. ఎలా అయిన అనుకో.. ప్లాబ్లమ్ లేదు అని చంటి ఆన్సరిచ్చాడు. నాకు ఇప్పటిదాకా అర్థమైంది బిగ్ బాస్ హౌజ్ లో ఆటంటే బీయింగ్ ఫేక్. నువ్వు (యాంకర్ శివ) కూడా ఫేక్ గానే ఆడావ్ అని షాకింగ్ కామెంట్స్ చేశాడు చంటి. తర్వాత గీతూ రాయల్ గురించి మాట్లాడుతూ నేను ఇట్లనే ఉంటా.. ఇట్లనే ఆడతా.. ఎవర్నైనా మోసం చేస్తా.. ప్రపంచంలో ఏ మనిషికి ఆ బుద్ధి ఉండదు అని చెప్పుకొచ్చాడు.

  ఆడియెన్స్ మీద కోపమా..

  తర్వాత ఆడియెన్స్ తీసుకున్న డెసిషియన్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఎవరికి వారు ఓటు వేసిన వాళ్లకే తెలియాలి అని చంటి చెప్పడంతో సో ఆడియెన్స్ మీద కోపమా.. అని యాంకర్ శివ అంటాడు. దీనికి నువ్ అటుగా మారుస్తున్నావ్ రరేయ్.. ఎన్ని చూశాం.. అంటూ యాంకర్ శివను అన్నాడు చలాకీ చంటి. దీంతో ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది. ఇక మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.

  English summary
  Bigg Boss Telugu 6th Season Fifth Week Eliminated Contestant Chalaki Chanti Says Bigg Boss Game Is Being Fake In BB Cafe.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X