For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Elimination: షాకింగ్ ట్విస్ట్.. ఇద్దరు మంచివాళ్లు ఎలిమినేట్.. ఆమెకోసమే డబుల్ ఎలిమినేషన్?

  |

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఇక చివరి దశకు చేరుకున్నట్లే అనిపిస్తోంది. అనూహ్య పరిణామాలు, విచిత్ర సంఘటలు, రొమాన్సులు, అరుపులు, గొడవలు, విభేదాలు, స్నేహం, శత్రుత్వం వంటి అనేక ఎమోషన్స్, సీన్స్ తో బాగానే రక్తికట్టించారు ఇంటి సభ్యులు. ఇప్పటికి 68 రోజులు, 69 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది ఈ బిగ్ బాస్ సీజన్ 6. హౌజ్ నుంచి ఒక్కొక్కరుగా తమ ఇంటి బాట పడుతున్నారు. ఇప్పటికే తొమ్మిదివారాలకు గాను తొమ్మిది మంది ఎలిమినేట్ కాగా ఈ పదో వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. హౌజ్ లో మంచి వాళ్లుగా, ఇతరులను బాధపెట్టని వాళ్లుగా పేరుపొందిన ఇద్దరు కంటెస్టెంట్స్ ఈసారి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌజ్ వీడనున్నారు.

  ఐదు టీవీ, ఒక ఓటీటీ..

  ఐదు టీవీ, ఒక ఓటీటీ..

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే సంచలన రేటింగ్‌తో దూసుకుపోతోన్న బిగ్ బాస్.. ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా చిత్ర విచిత్రంగా సాగుతోంది. దీనికి ఆరంభంలో పెద్దగా రేటింగ్ రాలేదు. కానీ, క్రమంగా ఇందులో అదిరిపోయే కంటెంట్ వస్తుండడంతో ఆదరణ పెరుగుతోంది. ఫలితంగా రేటింగ్ పెరుగుతోంది.

  21 మందిలో 9 మంది ఎలిమినేట్..

  21 మందిలో 9 మంది ఎలిమినేట్..


  ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో తొమ్మిది వారాల్లో షానీ సల్మాన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినట్ అయి వెళ్లిపోయారు.

   నామినేషన్లలో 9 మంది..

  నామినేషన్లలో 9 మంది..

  బిగ్ బాస్ ఏ సీజన్ లోనైనా నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగానే ఉంటుంది. ఈ బిగ్ బాస్ తెలుగు 6లో కూడా నామినేషన్ల పర్వం ఆసక్తికరంగా సాగింది. ఇక పదోవారం నామినేషన్లలో మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు ఇనయా సుల్తానా, కీర్తి భట్, ఫైమా, వాసంతి, రేవంత్, ఆదిరెడ్డి, బాలాదిత్య, మెరీనా అబ్రహం, శ్రీహాన్ కాగా.. కెప్టెన్ అయిన కారణంగా శ్రీసత్యతోపాటు రాజశేఖర్, రోహిత్ ను ఎవరు నామినేట్ చేయలేదు. దీంతో వారు ముగ్గురు సేఫ్ అయ్యారు.

  మంచి బిహేవియర్ కలిగిన కంటెస్టెంట్లు..

  మంచి బిహేవియర్ కలిగిన కంటెస్టెంట్లు..

  ఇక బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ఒకరు కాకుండా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఈ పదోవారం డబుల్ ఎలిమినేషన్ తో షాక్ ఇవ్వనున్నాడు బిగ్ బాస్. ఈ డబుల్ ఎలిమినేషన్ లో మంచి బిహేవియర్ కలిగిన కంటెస్టెంట్లుగా పేరు పొందిన బాలాదిత్య అండ్ మెరీనా అబ్రహం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అయితే బాలాదిత్య మంచి జెన్యూన్ పర్సన్ అయినప్పటికీ హౌజ్ లో ఆడిన గేమ్ అంతా ఎఫెక్టివ్ గా లేకపోవడంతో ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

  సిగరెట్ల గొడవ కారణంగా..

  సిగరెట్ల గొడవ కారణంగా..

  హౌజ్ లో గానీ, గేమ్ లో గానీ చురుగ్గా పాల్గొనకపోవడం, ఇతర విషయాల్లో స్టాండ్ తీసుకోకపోవడం, లాస్ట్ వీక్ జరగిన సిగరెట్ల గొడవ కారణంగా బాలాదిత్యకు ఓట్లు తక్కువ పడినట్లు సమాచారం. అలాగే మెరీనా కూడా వంటగదిలో ఎక్కువగా గడపడం, టాస్క్ లో అంతా ఎఫెక్టివ్ గా లేకపోవడంతో ఆమె కూడా ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ వర్గాల టాక్. అయితే మిషన్ పాజిబుల్ బేటాన్ టాస్క్ లో మెరీనా బాగా ఆడినప్పటికీ అదే జోరు తర్వాతి సీజన్ లో కనపడలేదు.

  మంచితనం కారణాంగానే..

  మంచితనం కారణాంగానే..


  బాలాదిత్య అండ్ మెరీనా అబ్రహం ఎక్కువగా గొడవలు పడకుండా, వారితో ఇతరులు ఎలా బిహేవ్ చేసిన వారు మాత్రం క్షమించి, సర్దుకునిపోయి పర్సనల్ గా తీసుకోకుండా గేమ్ ఆడారు. అందుకే వారి ప్రవర్తనలో మంచితనంలో ఎలాంటి మార్పు రాలేదు. వారి మంచితనం కారణాంగానే హౌజ్ లో ఎఫెక్టివ్ గా పార్టిస్ పేట్ చేయలేకపోయారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఓటింగ్ లీస్ట్ లో బాలాదిత్య ఉండగా.. మెరీనాను కూడా హౌజ్ నుంచి పంపించేందుకే డబులు ఎలిమినేషన్ పెట్టనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  English summary
  Bigg Boss Telugu 6 10th Week Double Elimination. Host Nagarjuna Eliminated Baladitya And Marina Abraham.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X