For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Elimination: ఎలిమినేట్ అయిన మదర్ ఇండియా.. శ్రీసత్య కోసం బలి? డబుల్ ఎలిమినేషన్ ఉండనుందా?

  |

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఇక చివరి దశకు చేరుకున్నట్లే అనిపిస్తోంది. అనూహ్య పరిణామాలు, విచిత్ర సంఘటలు, రొమాన్సులు, అరుపులు, గొడవలు, విభేదాలు, స్నేహం, శత్రుత్వం వంటి అనేక ఎమోషన్స్, సీన్స్ తో బాగానే రక్తికట్టించారు ఇంటి సభ్యులు. ఇప్పటికి 75 రోజులు, 76 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది ఈ బిగ్ బాస్ సీజన్ 6. హౌజ్ నుంచి ఒక్కొక్కరుగా తమ ఇంటి బాట పడుతున్నారు. ఇప్పటికే పది వారాలకు గాను 11 మంది ఎలిమినేట్ అయ్యారు. గత వారం డబుల్ ఎలిమినేషన్ ఉండగా.. ఈవారం సింగిల్ ఎలిమినేషన్ ఉన్నట్లే తెలుస్తోంది. హౌజ్ లో మంచి ప్రవర్తన కలిగిన మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

  ఐదు టీవీ, ఒక ఓటీటీ..

  ఐదు టీవీ, ఒక ఓటీటీ..

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే సంచలన రేటింగ్‌తో దూసుకుపోతోన్న బిగ్ బాస్.. ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా అనూహ్య సంఘటనలు, ఊహించని బిగ్ బాస్ డెసిషియన్స్ తో సాగుతోంది. అయితే ఈ సీజన్ కు ఆరంభంలో పెద్దగా రేటింగ్ రాకపోవడంతో ప్రస్తుతం రేటింగ్ తెచ్చే పనిలో పడింది బిగ్ బాస్ టీమ్.

  21 మందిలో 11 మంది బయటకు..

  21 మందిలో 11 మంది బయటకు..

  ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో 10 వారాల్లో షానీ సల్మాన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్, బాలాదిత్య, వాసంతి కృష్ణన్ ఎలిమినట్ అయి వెళ్లిపోయారు.

  నామినేషన్లలో 8 మంది..

  నామినేషన్లలో 8 మంది..

  బిగ్ బాస్ ఏ సీజన్ లోనైనా నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగానే ఉంటుంది. కానీ పదకొండోవారం మాత్రం చాలా కూల్ గా సాగింది. బిగ్ బాస్ హౌజ్ లో మిగిలిన 10 మంది ఇంటిసభ్యుల్లో ముందుగా కెప్టెన్ మినహా 9 మంది నామినేట్ అయ్యారు. కెప్టెన్ అయినా కారణంగా ఫైమా నామినేషన్ నుంచి తప్పించుకోగా.. ఇనయా సుల్తానా, రోహిత్, కీర్తి భట్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రాజ శేఖర్, శ్రీహాన్, మెరీనా, రేవంత్ నామినేషన్లలో ఉన్నారు. అయితే ఇమ్యునిటీ కారణంగా రాజ్ కూడా నామినేషన్ నుంచి ఎస్కేప్ అయ్యారు. మొత్తంగా 8 మంది నామినేషన్లలో ఉన్నారు.

  డేంజర్ జోన్ లో ముగ్గురు..

  డేంజర్ జోన్ లో ముగ్గురు..

  శుక్రవారం అర్ధరాత్రితో ఓటింగ్స్ ముగుస్తాయని తెలిసిన విషయమే. ఈ ఓటింగ్స్ ప్రకారం మొదటి స్థానంలో రేవంత్ నిలవగా రెండో ప్లేస్ లో ఇనయా సుల్తానా ఉంది. తర్వాతి స్థానాల్లో కీర్తి భట్, ఆదిరెడ్డి ఉండగా ఐదో ప్లేస్ లో శ్రీహాన్, ఆరో స్థానంలో రోహిత్ ఉన్నారు. ఇక ఏడో స్థానంలో శ్రీసత్య, ఎనిమిదో స్థానంలో మెరీనా ఉన్నట్లు సమాచారం అందింది. అంటే రోహిత్, శ్రీసత్య, మెరీనా ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు.

  హౌజ్ మేట్స్ టార్గెట్ గా మెరీనా..

  హౌజ్ మేట్స్ టార్గెట్ గా మెరీనా..

  ఇక రోహిత్, శ్రీసత్య, మెరీనా ముగ్గురిలో అతి తక్కువ ఓటింగ్ తో మెరీనా ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అయితే గత వారం నుంచే ఈ వీక్ మెరీనానే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వచ్చాయి. అలా అనుకున్నదే జరిగనట్లు తెలుస్తోంది. హౌజ్ లో ప్రారంభంలో ఎక్కువగా కిచెన్ లో వంట చేస్తూ గేమ్ పై అంతగా ఫోకస్ చేయలేదు. కానీ ఆమె మంచి ప్రవర్తన కారణంగా ఇప్పటివరకు ఆడియెన్స్ ఆమెకు ఓట్లు వేస్తూ వచ్చారు. ఆమెను, రోహిత్ ను కపుల్స్ కలిసి గేమ్ ఆడుతున్నారని మిగతా హౌజ్ మేట్స్ ఎంత టార్గెట్ చేసిన నిలదొక్కుకున్నారు.

  నాగార్జున నుంచి ప్రశంసలు..

  నాగార్జున నుంచి ప్రశంసలు..

  నామినేషన్లలో మిగతా ఇంటి సభ్యులు వెటకారంగా, అగౌరవంగా మాట్లాడిన మెరీనా మాత్రం వారికి గౌరవం ఇస్తూనే మాట్లాడారు. అందుకే ఆమెను ప్రేక్షకులు సపోర్ట్ చేస్తూ వచ్చారు. బిగ్ బాస్ ఇచ్చిన మిషన్ పాజిబుల్ టాస్క్ లో మాత్రం మెరీనా చాలా కష్టపడి ఆడారు. అందుకు హోస్ట్ నాగార్జున నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. అయితే ఆమె బాగా ఆడిన గేమ్స్ లో అదొక్కటే అని చెప్పుకోవచ్చు.

  మదర్ ఇండియాగా మెరీనా..

  మదర్ ఇండియాగా మెరీనా..

  బిగ్ బాస్ హౌజ్ లోకి స్టార్టింగ్ లో మెరీనా వచ్చినప్పుడు షానీ సాల్మన్ ఆమెను మదర్ ఇండియాగా పిలిచాడు. ఇప్పటికీ ఆమె పేరు అలాగే ఉండిపోయింది. అయితే ఈవారం కూడా మెరీనాకు ఓట్లు పడ్డాయని.. కానీ ఆమెకోసం చేసిన కాల్స్ డైవర్ట్ అవ్వడంతో శ్రీసత్య సేవ్ అయిందని ఒక టాక్ వినిపిస్తోంది. శ్రీసత్యను సేవ్ చేసేందుకు బిగ్ బాస్ టీమ్ ఇలా ప్లాన్ చేసిందని రూమర్. అలాగే ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ కింద ఆమె భర్త రోహిత్ ను కూడా హౌజ్ నుంచి పంపే ఆలోచన ఉన్నట్లు మరో టాక్ వినిపిస్తోంది.

  English summary
  Bigg Boss Telugu 6 Season 11th Week Elimination And Host Nagarjuna Eliminated Marina Abraham For Saving Sri Satya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X