Don't Miss!
- News
ఎన్నికల వేళ కొత్త వరాలు - కీలక నిర్ణయాలు: నేడే ప్రభుత్వ ప్రకటన..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Niminations: షాకింగ్ గా నామినేషన్స్ లీక్.. అతను తప్పా అంతా.. నేరుగా నామినేట్ చేసిన బిగ్ బాస్!
తెలుగు బుల్లితెరపై సంచలనాలను సృష్టిస్తూ దేశంలోనే నెంబర్ వన్ షో అనిపించుకుంటూ హవాను చూపిస్తోంది బిగ్ బాస్. అనేక అంచనాలు, అనుమానాల మధ్య వచ్చిన ఈ రియాలిటీ షోకు ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. తాజాగా 13వ వారం జబర్దస్త్ కమెడియన్ ఫైమా ఎలిమినేట్ అయింది. ఇక సోమవారం నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో 14వ వారం నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది? ఎవరు నామినేట్ అయ్యారనే వివరాళ్లోకి వెళితే..

అంతంత మాత్రంగా..
తెలుగులో బిగ్ బాస్ షోకు మాత్రమే అన్నింటి కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంటుంది. ఇది సీజన్ సీజన్‌కు పెరుగుతూ వచ్చింది. కానీ, ఆరోది మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. మరీ ముఖ్యంగా ప్రారంభంలో దీనికి చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. అయితే, ఇది ఇప్పుడు చివరి దశకు చేరడంతో స్పందన పెరుగుతోంది. ఫలితంగా రేటింగ్ కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఇలా విభిన్నంగా ఈ సీజన్ సాగుతోంది.

హౌజ్ నుంచి 14 మంది ఎలిమినేట్..
గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి రికార్డు స్థాయిలో 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే, ఒక్కోసారి డబుల్ ఎలిమినేషన్ పెట్టడం వల్ల ఇద్దరేసి కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనా, రాజశేఖర్‌లు వెళ్లగా తాజాగా సింగిల్ ఎలిమినేషన్ లో భాగంగా ఫైమాతో మొత్తం 14 మంది షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.

14వ వారం నామినేషన్స్ పై..
ప్రస్తుతం నడుస్తోన్న బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ ఎన్నో ట్విస్టులతో సాగాయని తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇందులో టాప్ ప్లేయర్లు అనుకున్న వాళ్లు చాలా మంది ఎలిమినేట్ అయిపోయారు. ఫలితంగా నామినేషన్స్ టాస్కులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో 14వ వారం నామినేషన్స్ టాస్కు మీద అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి.

కన్ఫెషన్ రూమ్ లో సాఫీగా..
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్‌లో నామినేషన్స్ టాస్కులను ఇప్పటివరకు అయితే కొత్తగా డిజైన్ చేశారు. ఇక టాస్కులు అన్నీ కూడా గొడవలతో ఎంతో రచ్చ రచ్చగా సాగుతున్నాయి. ప్రతి వారం కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగాయి. ఒక 12వ వారం నామినేషన్స్ మాత్రం చాలా సాఫీగా సాగాయి. ఎందుకంటే 12వ వారం నామినేషన్ల ప్రక్రియను కన్ఫెషన్ రూమ్ లో నిర్వహించారు. దీంతో ఇంటి సభ్యులు వాదించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.

నేరుగా నామినేట్..
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ఇప్పటికీ 91 రోజులు 92 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. చూస్తుంటే మరో రెండు వారాలు మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది ఈ 13 వారానికే పూర్తయింది. ఈ 14వ వారం మాత్రం ఇంటి సభ్యులందరు నేరుగా నామినేట్ అవుతారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఏడుగురు కంటెస్టెంట్స్ మిగిలారు.

నామినేషన్లలో ఐదుగురు..
ఈ ఆరో సీజన్ లో ప్రస్తుతం మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్స్ లలో ఒక శ్రీహాన్ తప్పా మిగిలిన ఐదుగురు నేరుగా నామినేట్ అయినట్లు తెలుస్తోంది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో విన్నర్ గా నిలిచిన శ్రీహాన్ మొదటి ఫినాలే కంటెస్టెంట్ అయ్యాడు. అందుకే అతన్ని నామినేట్ చేయలేదని తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 14వ వారం రేవంత్, రోహిత్, ఇనయా సుల్తానా, ఆదిరెడ్డి, కీర్తి భట్, శ్రీసత్య నామినేషన్లలో ఉన్నారు. ఇక ఈవారం వారి గేమ్, బిహేవియర్ ను బట్టి ఎవరిని ఎలిమినేట్ చేయాలనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు.