Don't Miss!
- News
Airport: విదేశాల నుంచి వచ్చాడు, వీడు డ్రగ్స్ ఎక్కడ ఏ రూపంలో పెట్టుకున్నాడో తెలుసా ? !
- Sports
ఓడినా వణికించాం.. మరో 10 పరుగులు చేసుంటే మేమే గెలిచేవాళ్లం: మిచెల్ సాంట్నర్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Bigg Boss Telugu 6: ఫైనల్ ఎపిసోడ్ కోసం బిగ్ ప్లాన్.. గెస్ట్ గా ఆ స్టార్ రాకుంటే మళ్ళీ నష్టమే?
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ నిజంగా ఓ వర్గం ప్రేక్షకులను మరింత తీవ్రంగా నిరాశపరిచింది. ఈసారి అంచనాలకు తగ్గట్టుగా కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాకపోవడం వలన మొదట్లోనే రేటింగ్స్ చాలా తక్కువగా వచ్చాయి. ఇక బిగ్ బాస్ కూడా చేసేదేమీ లేక ఈసారి సీజన్ ను కూడా తొందరగానే ముగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి ఎపిసోడ్ కు అంతగా రేటింగ్స్ ఏమి రావడంతో ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్ కు రికార్డ్ స్థాయిలో రేటింగ్ అందుకోవాలి అని బిగ్ బాస్ ప్రణాళికలుగా రచిస్తున్నారు. గెస్ట్ గా ఎవరు వస్తారు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

గతంలో మంచి రేటింగ్స్
బిగ్ బాస్ తెలుగు గత ఐదు సీజన్స్ కూడా రేటింగ్స్ విషయంలో అయితే పెద్దగా నిరాశపరచలేదు. ఆఖరికి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో వచ్చిన నాన్ స్టాప్ షోకు కూడా బాగానే క్రేజ్ వచ్చింది. కానీ ఈసారి 6వ సీజన్ కు వచ్చేసరికి మాత్రం బిగ్ బాస్ ప్రణాళికలు మాత్రం ఒక్కసారిగా తల క్రిందులయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎక్కువ స్థాయిలో 21 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి రప్పించారు. వారిలో ఎవరు కూడా ఊహించని స్థాయిలో అయితే క్రేజ్ అయితే అందుకోలేదు.

రెండుసార్లు డబుల్ ఎలిమినేషన్స్
బిగ్ బాస్ ప్రతి సీజన్ కూడా అవసరమైతే ఎలిమినేషన్స్ వాయిదా వేసి మరి ఒక వారానికి పొడిగించి ఎక్కువగా క్యాష్ చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి మాత్రం ఎక్కువ మందిని తీసుకొచ్చినప్పటికీ కూడా ఎక్కువ రోజులు షోను కొనసాగించలేకపోతున్నాడు. 21 మంది వస్తే రెండుసార్లు డబుల్ ఎలిమినేషన్స్ జరిగాయి. ఇక కనీసం 16 వారాలు కొనసాగేలా ప్లాన్ చేసుకున్నప్పటికీ 15 వారంలోనే ఎండ్ కార్డ్ పెడుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

నాగార్జున డౌట్స్?
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కు నార్మల్ డేస్ లో మాత్రమే కాకుండా వీకెండ్స్ లో కూడా నాగార్జున వచ్చినప్పుడు పెద్దగా రేటింగ్స్ ఏమి రావడం లేదు. అందుకే ఆయన కూడా బిగ్ బాస్ కు ఇకనుంచి విముక్తి పలకాలని ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నాగార్జున పోతే ఆ స్థానంలో ఇంకా ఎవరిని తీసుకొస్తారు అనేది కూడా కొంత సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.

ఫైనల్ ఎపిసోడ్ కోసం..
ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ 6వ సీజన్ రేటింగ్స్ అందుకోవడంలో తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి ఎపిసోడ్ కు దారుణంగా రేటింగ్ రావడంతో ఇప్పుడు కనీసం చివరి ఎపిసోడ్ కోసమైనా భారీ స్థాయిలో రేటింగ్ తీసుకురావాలి అని నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసం ఒక అగ్ర హీరోను కూడా ఫైనల్ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా ఇన్వైట్ చేయాలని ఆలోచిస్తున్నారు.

ఎవరు వస్తారో?
ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ వస్తే బాగుంటుంది అని బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచించినట్లుగా తెలుస్తోంది. అయితే బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే ప్రమోషన్స్ కూడా చేయాల్సి ఉంది. దానికి తోడు ఆహా ఓటీటీ షో కోసం కూడా ఆయన చాలా బిజీగా ఉంటాడు. కాబట్టి ఈ క్రమంలో బిగ్ బాస్ షో కి వస్తాడా లేదా అనేది కొంత అనుమానంగానే ఉంది. ఆయన రాకపోతే మాత్రం షోకు పెద్దగా హైప్ అయితే క్రియేట్ కాదు. మిగతా స్టార్స్ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఎవరు ఒకరు వస్తేనే ఊహించని రేంజ్ లో రేటింగ్ వస్తుంది. మరి ఎవరు వస్తారో చూడాలి.