For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: రేవంత్ కు వాసంతి అంటే ఇంట్రెస్ట్.. చింత చచ్చిన పులుపు చావలేదంటూ

  |

  బిగ్ బాస్ రియాలిటీ షోకి రెస్పాన్స్ మాత్రం అసాధారణంగానే ఉంది. ఇప్పటి వరకు 5 సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమైన బిగ్​బాస్​ ఆరో సీజన్​ బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సీజన్ లో వింతలు, విచిత్రాలు బాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతి శనివారం, ఆదివారం హోస్ట్ నాగార్జున వచ్చి రివ్యూ చేస్తాడని తెలిసిందే. అలాగే ఈ ఆదివారం అంటే అక్టోబర్ 9న నాగార్జున వచ్చి ఎంటర్టైన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు కంటెస్టెంట్స్.

  ఎన్నో అంచనాల నడుమ

  ఎన్నో అంచనాల నడుమ

  తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు ప్రసారం అయినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంటూ ఉంటున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వాహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, దీనికి రేటింగ్ మాత్రం చాలా తక్కువగానే వస్తుంది.

  స్ట్రాంగ్ వార్నింగ్..

  స్ట్రాంగ్ వార్నింగ్..

  ఏది ఎలా ఉన్నా ప్రతి శనివారం, ఆదివారం హోస్ట్ నాగార్జున వచ్చి ఎంటర్ టైన్ చేస్తాడని తెలిసిందే. కానీ గత వారం మాత్రం హౌజ్ మేట్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి గట్టి క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం నాగార్జున మరో టాస్క్ తో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. గెస్ట్ గా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కాసేపు ఓ పాట పాడి అలరించాడు. ఈ పాటకు నాగార్జునతో సహా కంటెస్టెంట్లు అందరూ డ్యాన్స్ తో

  రేవంత్ చేతిలో చాక్లెట్ బాక్స్..

  రేవంత్ చేతిలో చాక్లెట్ బాక్స్..

  తర్వాత రేవంత్ చేతిలో చాక్లెట్ బాక్స్ ఉంటుంది. అందులోని చాక్లెట్ల కోసం కంటెస్టెంట్లు పోటీ పడతారు. దీంతో ఏదైనా సీక్రెట్ చెప్పిన వారు ఆ చాక్లెట్ తీసుకోవాలని నాగార్జున చెప్పాడు. దీంతో ఫైమా లేచి.. ఇనయా సుల్తానాకు సూర్య అంటే క్రష్ సార్ అని చెబుతుంది. అందుకు ఒక లాలీపాప్ తీసుకోమని నాగార్జున చెబుతాడు. ఇక చిత్తూరు చిరుత గీతూ రాయల్ లేచి.. రేవంత్ కు వాసంతి అంటే కొంచెం ఇంట్రెస్ట్ లా అనిపిస్తోంది సర్, మొన్న గేమ్ లో ఫ్రీగా మసాజ్ చేయించుకున్నాడు అని చెప్పింది.

  నేనిస్తాలే సగం రా..

  నేనిస్తాలే సగం రా..

  ఇలా గీతూ చెబుతుండగా వాసంతి ఓయ్.. అంటూ ఆశ్చర్యంగా ఎక్స్ ప్రెషన్ పెడుతూ కొద్దిగా నవ్వింది. అలాగే ఫ్రీగా చేయించుకుంటే సాఫ్ట్ కార్నర్ ఎందుకు, పని చేయించుకున్నాడు అని నాగార్జున అన్నాడు. దీంతో ఇక ఎందుకులే రా.. నేనిస్తాలే సగం రా.. అని గీతూని ఫైమా పిలిచింది. తర్వాత కొన్ని సామెతలు ఇచ్చి అవి ఎవరికి సూట్ అవుతాయో వారి మెడలో వేయామని నాగార్జున చెప్పాడు.

  ఇదొక పల్టీలే అన్నాడంట..

  ఇదొక పల్టీలే అన్నాడంట..


  మొదటగా ఏమిరా పడ్డావ్ అంటే ఇదొక పల్టీలే అన్నాడంట అనే సామెతను రాజశేఖర్ కు వేసింది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే సామెత బోర్డ్ ను రోహిత్ మెడలో బాలాదిత్య వేశాడు. అగ్నికి ఆజ్యం పోయడం అనే సామెతను గీతూ రాయల్ కు ఇనయా ఇచ్చనట్లు తెలుస్తోంది. కుక్క తోక వంకర సామెత ఉన్న బోర్డును అర్జున్ కల్యాణ్ కల్యాణ్ కు ఇచ్చారు.

  చింత చచ్చినా పులుపు చావలేదు..


  ఇక రేవంత్ కు చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత బోర్డును ఆర్జే సూర్య వేశాడు. ఈ గేమ్ అయ్యాక చివరికి నామినేషన్లలో ఉన్న ఇనయా సుల్తానా, అర్జున్ కల్యాణ్, చంటి నిలబడ్డారు. వారిలో ఒకరు ఎలిమినేట్ అయినట్లు చూపించారు. అయితే ఇప్పటివరకు చంటినే ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఒకరు ఎలిమినేట్ కావడంతో ఫైమా, రాజశేఖర్, ఆర్జే సూర్య చాలానే ఏడ్చారు. నాకు ఇష్టమైన వాళ్లందరూ ఎందుకో దూరమైపోతుంటారు అని ఆర్జే సూర్య బాధపడుతుంటాడు.

  English summary
  Geetu Royal Says Revanth Has Interest On Vasanthi For Chocolate In Bigg Boss Telugu 6 October 9 2022 Episode Promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X