For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: కత్తితో పొడుచుకున్న సూర్య, కన్నీళ్లతో కీర్తి.. ఈవారం కెప్టెన్ గా అతను!

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మంచి జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు కెప్టెన్సీ కంటెండర్ల కోసం చేపల చెరువు ఆటను ఆసక్తికరంగా ఆడారు. వారిలో ఆరుగురు కెప్టెన్సీ కంటెండర్లుగా సెలెక్ట్ కాగా, ఫైనల్ కి కీర్తి, శ్రీహాన్, ఆర్జే సూర్య వెళ్లారు. ఈ ముగ్గురిలో ఒకరికి

  కత్తిపోటు పొడిచి కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశం ఇచ్చారు. గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో ఆర్జే సూర్యకు రాజశేఖర్, రేవంత్, రోహిత్ కత్తిపొడిచారు. కీర్తికి బాలాదిత్య, శ్రీహాన్ కు ఇనయా కత్తిపోటు దించి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ టాస్క్ రెండో రోజు

  కూడా సాగనుంది. దానికి సంబంధించిన అక్టోబర్ 28 శుక్రవారం నాటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు.

  కెప్టెన్ ఎవరవుతారో అనేది..

  కెప్టెన్ ఎవరవుతారో అనేది..

  ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో ఎనిమిదో వారం కెప్టెన్ ను ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఈవారం ఎవరు కెప్టెన్ ఎవరవుతారో అనేది నేటి ఎపిసోడ్ లో తేలనుంది. ఇప్పటికీ ఆర్జే సూర్యకు మూడు, కీర్తి, శ్రీహాన్ కు ఒక్కోటి చొప్పున కత్తిపోట్లు

  పడ్డాయి. ఎవరికీ తక్కువ కత్తిపోట్లు ఉంటే వారే ఇంటి కెప్టె అవుతారు. ఇంటి సభ్యుల మద్దతు కోసం సీ అని ఇంగ్లీష్ లెటర్ ఉన్న ట్యాగ్ వేసుకుని ఓటు అడుగుతున్నారు.

  గీతూ వర్సెస్ బాలాదిత్య..

  గీతూ వర్సెస్ బాలాదిత్య..

  తాజాగా అక్టోబర్ 28 శుక్రవారం నాటి ఎపిసోడ్ ప్రోమో ప్రారంభంలో గీతూ రాయల్, బాలాదిత్య మధ్య మాటల యుద్ధం నడిచింది. గీతూ తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తోంది. తొక్కలు కట్ చేశాక చేత్తో తీసేసి అప్పుడే పడేస్తే అప్పటికప్పుడు ఆ పని అయిపోతుందిగా

  అని బాలాదిత్య అంటే.. నేను చేయను అని గీతూ అంది. వేస్తే నువ్ ఎందుకు మంచిదానివి అవుతావ్ అని బాలా అంటే.. ఎగ్జాట్లీ నేను మంచిదాన్ని కాదు అని గీతూ వాదించడం మొదలుపెట్టింది.

  నీకు నచ్చేలా మాట్లాడేదానికి లేదు..

  నీకు నచ్చేలా మాట్లాడేదానికి లేదు..

  గీతూ అలా అనడంతో మాట తుళ్లుతున్నవ్ గీతూ.. జాగ్రత్త అని బాలాదిత్య చెబుతుంటే.. నీకు నచ్చేలా మాట్లాడేదానికి లేదు అంటూ ఆర్గ్యుమెంట్ చేసింది చిత్తూరు చిరుత. పెంట చేసుకుంటున్నావ్ అని బాలా చెబుతుంటే అలా చేసుకుంటే నేనే పోతా.. ఇంకా

  హ్యాపీయేగా అన్న గీతూతో నువ్ పోతే హ్యాపీగా ఉండనమ్మా.. నువ్ బాగుపడితేనే హ్యాపీగా ఉంటా.. అదే నీకు నాకు తేడా అని బాలాదిత్య చెప్పుకొచ్చాడు.

  ఓటింగ్ ఎందుకు పెట్టారని..

  ఓటింగ్ ఎందుకు పెట్టారని..

  మళ్లీ కెప్టెన్సీ టాస్క్ మొదలైనట్లు బిగ్ బాస్ చెప్పడంతో మెరీనా, ఫైమా, ఆదిరెడ్డి, వాసంతి, శ్రీసత్య కత్తి దించేందుకు సిద్ధమయ్యారు. ఒక్కొక్కరు ఒక్కో కారణాలు చెబుతుంటే వాటిని డిఫెన్స్ చేసుకున్నారు కెప్టెన్సీ పోటీలు ఉన్న సూర్య, కీర్తి, శ్రీహాన్. తర్వాత ఈ

  విషయం గురించి సూర్య, కీర్తి మాట్లాడుకుంటూ కనిపించారు. కెప్టెన్సీ పోటీ కోసం టాస్క్ పెట్టకుండా ఓటింగ్ ఎందుకు పెట్టారని కీర్తి అంటే.. లాస్ట్ టైమ్ కూడా నువ్ ఇంటి సభ్యుల మద్దతుతోనే కదా కెప్టెన్ అయిందని అన్నాడు.

  కన్నీళ్లు పెట్టుకున్న కీర్తి..

  తర్వాత కీర్తి ఏదో చెప్పబోతుంటే.. ఫైమా టీ తాగేశావా అని సూర్య అన్నాడు. దీంతో తను మాట్లాడుతున్నా పట్టించుకోకుండా అక్కడ టీ గురించి అడుగుతున్నావ్ అని కన్నీళ్లు పెట్టుకుంది కీర్తి. అది చూసిన సూర్య సీ లెటర్ పై ఉన్న కత్తితో కసకస

  పొడుచుకున్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో వారం ఇంటి కెప్టెన్ గా శ్రీహాన్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి అది నిజమో కాదో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేదాకా చెప్పలేం. ఇక ఈ వారం నామినేషన్లలో మొత్తం 14 మంది ఇంటి

  సభ్యులు నామినేషన్లలో ఉన్నారు.

  English summary
  Keerthi Gets Emotional And Shrihan Is The Eighth Week Captain In Bigg Boss Telugu 6 And Captaincy Task In October 27 Episode Promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X