Bigg Boss Telugu 6: శ్రీహన్ ఆటలో మోసం.. శ్రీసత్యపై కోపంతో తన్నేసిన కీర్తి!
తుది దశకు చేరుకుంటున్న కొద్ది కూడా బిగ్ బాస్ తెలుగు 6 ఎంతో ఆసక్తికరంగా మారుతొంది. కంటెస్టెంట్స్ గతంలో కంటే టికెట్ టు ఫినాలే కోసం ఎంతో బలంగా పోరాడుతున్నారు. ఇక ఈసారి ఎవరెవరు ఫైనల్స్ లోకి వెళ్తారు అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ పోటీలో ఆదిరెడ్డి 9 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా తర్వాత రేవంత్ ఎనిమిది పాయింట్లతో ఉన్నాడు. ఇక మూడవ స్థానంలో శ్రీహన్ 6 పాయింట్లతో కొనసాగుతున్నాడు. ఫైమా నాలుగవ స్థానంలో ఐదు పాయింట్లతో ఉంది.
ఇక చివరి లిస్టులో కీర్తి రెండు పాయింట్లతో ఉండగా రోహిత్ కేవలం ఒక పాయింట్ తోనే ఉన్నాడు. ఇక ఈ స్కోర్ బోర్డ్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా టికెట్టు ఫినాలే టాస్క్ కోసం తదుపరి ఛాలెంజ్ కూడా ఇవ్వడం జరుగుతోంది. రోల్ బేబీ రోల్ అనే ఛాలెంజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. మొదట ఫైమా శ్రీహన్ రోహిత్ కీర్తి నలుగురి మధ్యలో గట్టిగానే పోటీ కొనసాగింది. ఒకవైపు ఉన్న బ్రిక్స్ ను మరొకవైపు రోల్ చేస్తూ అందుకుంటూ ఉండాలి. ఇక కంటెస్టెంట్స్ అందరూ పోటీ ముగించిన తర్వాత శ్రీ సత్య సంచలక్ తన నిర్ణయాన్ని చెప్పింది.

ఎవరైతే ఎక్కువ బ్రిక్స్ పేర్చి చూపించారో వాళ్ళే విన్ అయినట్లు లెక్క. ఇక చివరలో తెలివిగా శ్రీహాన్ ఒకదాన్ని నిలువుగా పెట్టి పై చేయి సాధించాడు. శ్రీ సత్య అతనికి సపోర్ట్ చేసింది. అయితే కీర్తి ఈ విషయంలో ఏమాత్రం ఏకీభవించలేకపోయింది. కీర్తి చిరాకుతో ఏమి మాట్లాడలేక వెనక్కి వెళ్ళిపోయింది.
మీకు నచ్చిన వాళ్లకు మీరు ఇచ్చుకోండి అంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాకుండా తన పేర్చిన బ్రిక్స్ ను కూడా ఆమె తన్నేసింది. ఏం జరుగుతుందో అని శ్రీహన్ కాస్త కన్ఫ్యూజన్ అయ్యాడు. శ్రీ సత్య మళ్లీ ఎప్పటి తరహాలోనే అతనికి సపోర్ట్ చేస్తుంది అని కీర్తి మాత్రం తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. మరి ఈ ఆటలో ఎవరు తదుపరి రౌండ్ లోకి వెళ్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











