Don't Miss!
- Sports
INDvsNZ : నువ్వూ.. నీ ఆట.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- Finance
Wheat Price: సామాన్యులకు శుభవార్త.. తగ్గనున్న గోధుమ పిండి ధర..
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- News
ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన నల్గొండవాసి అంశాల స్వామి కన్నుమూత; కేటీఆర్ ట్వీట్!!
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
Bigg Boss Elimination మిడ్ వీక్ ఎవిక్షన్ తో షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. కీర్తినే వాళ్ల టార్గెట్!
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ పూర్తి కావడానికి ఇంకో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఆదివారం అంటే గ్రాండ్ ఫినాలేను గ్రాండ్ గా నిర్వహించి సీజన్ టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. గ్రాండ్ ఫినాలే అంటే సెలబ్రిటీల రాకతో సందడిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు, సెలబ్రిటీల మధ్య విన్నర్ ను ప్రకటించి ట్రోఫీ అందజేస్తారు. హౌజ్ లో ఇప్పటికీ ఆరుగురు మిగలగా.. మిడ్ వీక్ ఎవిక్షన్ కింద మరొకరు వెళ్లనున్నారు. దానికి సంబంధించిన డిసెంబర్ 16 శుక్రవారం నాటి ఎపిసోడ్ 103 ప్రోమోను విడుదల చేశారు.

వేకువ జామున..
సాధారణంగా మంచి పాటలతో ఇంటి సభ్యులను ఉదయం నిద్ర లేపుతారు. కానీ డిసెంబర్ 16 నాటి 103 ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో కుక్కల అరుపు, సైరన్ మోగించి ఇంటి సభ్యులను నిద్రలేపారు. రెగ్యూలర్ ఉదయం 9 గంటలకు అలా పాటలు వేస్తారు. కానీ ఈసారి వేకువ జామున ఇంటి సభ్యులను మేల్కొల్పాడు బిగ్ బాస్. ఇంటి సభ్యులందరినీ గార్డెన్ ఏరియాలోకి బిగ్ బాస్ పిలిచినట్లు తెలుస్తోంది.

15 వారాల సుధీర్ఘ ప్రయాణం..
"ఇంటి సభ్యులు అందరు తక్షణమే మీ బ్యాగ్స్ ను ప్యాక్ చేసుకోండి. ఈరోజు ఒక మిడ్ వీక్ ఎవిక్షన్ జరగబోతోంది" అని బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే శ్రీసత్య, కీర్తితోపాటు అందరూ షాక్ కు గురయ్యారు. తర్వాత హౌజ్ మేట్స్ అందరూ ఇంట్లోకి వెళ్లి తమ బ్యాగ్స్ సర్దుకుని మళ్లీ గార్డెన్ ఏరియాకు వచ్చారు. "15 వారాల సుధీర్ఘ ప్రయాణం తర్వాత మీ ఆరుగురు టాప్ 6గా నిలిచారు. మీ అభిప్రాయంలో ఏ ఒక్కరు టాప్ 5లో అనర్హులనుకుంటున్నారో బిగ్ బాస్ ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారు" అని బిగ్ బాస్ అన్నారు.

ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం..
రోహిత్ పేరును శ్రీహాన్, ఆదిరెడ్డి అని కీర్తి, శ్రీహాన్ అని రోహిత్, కీర్తి అని శ్రీసత్య, రేవంత్, అండ్ ఆదిరెడ్డి కీర్తి పేరు చెప్పారు. ఒక్కొక్కరిగా ఇతరులు అనర్హులు అనడానికి తగిన కారణాలు చెప్పినట్లు తెలుస్తోంది. "ఇంటి సభ్యులందరు మీ అభిప్రాయంలో కీర్తి టాప్ 5లో ఉండటానికి అనర్హలుగా భావించి, తను ఇంటి నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించారు. కానీ, ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం టాప్ 5కి చేరుకోక ముందే ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సభ్యులు" అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ప్రోమోను ముగించారు.

మొదట్లో సైలెంట్ గా ఉండి..
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోకి 21 మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇవ్వగా.. 15వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా హౌజ్ నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ శ్రీ సత్య అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఓటింగ్ పోల్స్ లో చివరి స్థానంలో ఉన్న శ్రీ సత్యను ఎలిమినేట్ చేశారు. సీజన్ ప్రారంభంలో సైలెంట్ గా ఉన్న శ్రీసత్య తర్వాత తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆమె వెంట అర్జున్ కల్యాణ్ ఎంత పడినా తను మాత్రం హద్దుల్లో ఉంది. కానీ అతన్ని హౌజ్ లో గేమ్ పరంగా శ్రీసత్య బాగా వాడుకుందని విమర్శలు వినిపించాయి.