For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: గీతూ రాయల్ ఎలిమినేషన్ పై సెటైర్లు.. సినిమా క్లిప్స్ తో ట్రోలింగ్

  |

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగినవారు అనూహ్యంగా ఎలిమినేట్ అవుతున్నారు మిగతా ఇంటి సభ్యులకు షాక్ ఇస్తున్నారు. ఇదివరకే టాప్ 5లో ఉంటాడనుకున్న ఆర్జే సూర్య ఎనిమిదో వారం ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లాడు. తాజాగా సింగర్ రేవంత్ తో పాటు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న చిత్తూరు చిరుత గీతూ రాయల్ అనుకోని విధంగా ఎలిమినేట్ అయింది. దీంతో బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కసారిగా అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఇదిలా ఉంటే గీతూ రాయల్ ఎలిమినేషన్ పై ట్విటర్ లో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది.

  స్ట్రాటజీస్, లూప్ లు అంటూ..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో టాప్ కంటెస్టెంట్స్ అనూహ్యంగా ఎలిమినేట్ అవుతున్నారు. తాజాగా టైటిల్ ఫేవరేట్ కంటెస్టెంట్, బిగ్ బాస్ ముద్దుబిడ్డ, చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడింది. ఇక గీతూ రాయల్ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. స్ట్రాటజీస్, లూప్ లు అంటూ ప్రతిసారి గేమ్ ను అస్తవ్యస్తం చేసింది. అది కరెక్ట్ కాదని చెప్పినా వినిపించుకోకుండా తనదే కరెక్ట్ అన్నట్లుగా బిహేవ్ చేసింది.

  హితబోధ ప్రకారం ఆమెనే..

  బిగ్ బాస్ రూల్స్ కూడా చాలా సార్లు అతిక్రమించింది. ఒకరికి చెడు చేస్తే ఆ చెడు మనకే వస్తుందని గీతూ చేసిన (రీల్స్ లో) హితబోధ ప్రకారం ఆమెనే ఎలిమినేట్ అయిందని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే గీతూ రాయల్ బిగ్ బాస్ మొదటి వారంలో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ఇక రెండో వారంలో లాస్డ్ అండ్ ఫౌండ్ టాస్క్ లో ఆమె గేమ్ చూసి అందరూ ఫిదా అయ్యారు.

  వందకు రెండొందల మార్కులు..

  అలా గీతూ రాయల్ గేమ్ కి కనెక్ట్ అయిన ప్రేక్షకులు ఆమెపై ఆదరణ చూపారు. వీకెండ్ లో వచ్చిన నాగార్జున కూడా ఆమె గేమ్ కు వందకు రెండొందల మార్కులు ఇచ్చాడు. అలాగే గత ఎనిమిది వారాలుగా ప్రేక్షకుల ఓటింగ్ తో అందరికంటే ముందుగా నామినేషన్స్ నుంచి సేవ్ అవుతూ వచ్చింది. దీంతో ఆమెపై ఆమెకు భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచుకుంది. టాప్ 5 నుంచి టైటిల్ విన్నర్ తానే అని చాలా బలంగా నమ్మింది.

  ఓడిపోయానన్న కారణం..

  అందుకే ఎలిమినేట్ అయ్యాకా దాన్ని భరించలేకపోయింది. ప్రేక్షకులకు నచ్చలేదన్న దానికంటే తాను ఓడిపోయానన్న కారణం ఆమెను విపరీతంగా బాధపెట్టింది. అయితే ముందుగా గీతూ రాయల్ ను ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో ఉంచుదామనుకున్నారట. గీతూతోపాటు మరొకరిని సీక్రెట్ రూమ్ లో ఉంచాలని ఆ గదిలో రెండు బెడ్స్ కూడా వేశారట. అయితే ఎలిమినేషన్ రోజు మాత్రం బిగ్ బాస్ క్రియేటివిటీ టీమ్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుందని సమాచారం.

  టాస్క్ లు సక్రమంగా జరగలేదని..

  టాస్క్ లలో బిగ్ బాస్ రూల్స్ పాటించకపోవడం, తాను చెప్పే లూప్స్ కరెక్ట్ అని ఇతర ఇంటి సభ్యులపై ప్రభావం చూపేలా మాట్లాడటంతో నిర్వాహకులు విసిగిపోయారట. ఆమె లూప్స్ తో బిగ్ బాస్ టాస్క్ లు సక్రమంగా జరగలేదని ఒక టాక్ ఉంది. ఆమె వల్ల గేమ్ టాస్క్ లు అస్తవ్యస్తంగా తయారయ్యాని వినిపిస్తున్న విషయం. అలాగే ఆమె వల్ల టీఆర్పీ రేటింగ్ కూడా తగ్గిపోయిందని మరో విషయం కూడా వైరల్ అవుతోంది.

  వాళ్ల మైండ్ సెట్ అంతే..

  ఇక మరోవైపు హౌజ్ లో తనకుమించిన కంటెస్టెంట్ లేరన్నట్లుగా గీతూ రాయల్ బిహేవ్ చేయడం ప్రేక్షకులకు అయితే కాస్తా వెగటు పుట్టించింది. ఆదిరెడ్డి వాళ్లు చెప్పేందుకు ప్రయత్నించిన వినకపోయేది. వాళ్ల మైండ్ సెట్ అంతే.. తనవే గొప్ప లాజిక్ లు, స్ట్రాటజీస్, లూప్స్ అంటూ ఎక్కువ ఊహించుకుని.. అలాగే ఊహకు అందని విధంగా ఎలిమినేట్ అయింది. అందుకే ఆమె ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

  English summary
  Bigg Boss Telugu 6 Season 9 Week Elimination Contestant Is Geetu Royal And Netizens Trolling On Her Elimination
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X