For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ నేనే.. కోపంగా కుండ బద్దలు కొట్టిన రేవంత్

  |

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ మాంచి రసవత్తరంగా సాగుతోంది. టాప్ 5లో ఉంటాడనుకున్న కంటెస్టెంట్ ఆర్జే సూర్య అనూహ్యంగా ఎనిమిదో వారం ఎలిమినేట్ అయి ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చాడు. శనివారం సూర్యను డైరెక్ట్ ఎలిమినేషన్ కింద హౌజ్ బయటకు పంపించారు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన ఆర్జే సూర్య జర్నీని చూపించారు. మనోడు ఎలాగు సేవ్ అవుతాడన్న ఆలోచనతో నాకు ఓట్లు వేయలేదేమో అని ఆర్జే సూర్య అభిప్రాయపడ్డాడు. సూర్య ఎలిమినేట్ అవ్వడానికి కారణమైన ట్రాక్ నే (ఇనయాతో లవ్ ట్రాక్) మళ్లీ ఆ స్టేజీపై చూపించారు. అదేంటో తనకు అర్థం కావట్లేదని నాగార్జున అన్నాడు. ఒక ఎలిమినేషన్ అయిందంటే తర్వాతి రోజు మరొక హౌజ్ మేట్ ను పంపించేందుకు నామినేషన్స్ ప్రక్రియ సాగుతుందన్న విషయం తెలిసిందే. ఈ సారి మరింత జోరుగా సాగింది ఈ నామినేషన్ల పరంపర.

   ఇంటి సభ్యులందరికి స్ట్రాంగ్ క్లాస్..

  ఇంటి సభ్యులందరికి స్ట్రాంగ్ క్లాస్..

  ఎన్నో అంచనాలు, విమర్శల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రారంభం కంటే చాలా రసవత్తరంగా సాగుతోంది. శని, ఆది వారాల్లో వచ్చే హోస్ట్ నాగార్జున ఆ వారం మొత్తంలో ఇంటి సభ్యులు ఆడిన ఆట తీరు, మాట తీరు, ప్రవర్తన తీరుపై విశ్లేషిస్తూ వార్నింగ్, అడ్వైస్ లను ఇస్తారని తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం ఇంటి సభ్యులందరికి స్ట్రాంగ్ క్లాస్ పీకాడు.

  ఫండే కంటే ఎక్కువ ఫన్ నామినేషన్స్ డే..

  ఫండే కంటే ఎక్కువ ఫన్ నామినేషన్స్ డే..

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ హౌజ్ మేట్స్ కు హద్దులు పెట్టుకోవాలని, అగ్రెషన్ తో కాకుండా గేమ్ లా ఆడాలని సలహాలు ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ప్రతి ఒక్కరూ గేమ్ చాలా బాగా ఆడారని మెచ్చుకున్నారు. అయితే అనూహ్యంగా ఆర్జే సూర్యను డైరెక్ట్ ఎలిమినేట్ చేశారు నాగార్జున. ఇక ఇదిలా ఉంటే శనివారం, సండే ఫండే కంటే ఎక్కువ ఫన్ నామినేషన్స్ రోజు వస్తుందని ప్రతి ఒక్క బిగ్ బాస్ ప్రేక్షకుడికి తెలిసిందే.

   తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ..

  తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ..

  నామినేషన్లలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య జరిగే విమర్శలు, ప్రతి విమర్శలు, టాకింగ్ వార్, సెటైర్లు వాళ్లకేమో కానీ ఆడియెన్స్ కు మాత్రం ఫన్ క్రియేట్ చేస్థాయి. ఇప్పుడు బిగ్ బాస్త తెలుగు 6 తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియ సోమవారం జరుగుతుందని తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు 6 అక్టోబర్ 31 సోమవారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

  అది బ్యాడ్ వర్డా..

  అది బ్యాడ్ వర్డా..

  బిగ్ బాస్ తెలుగు 6 తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నామినేట్ చేయాలనుకున్న ఇంటి సభ్యుల ముఖాలతో ఉన్న దిష్టిబొమ్మలపై కుండ పెట్టి వాటిని తగిన కారణాలు చెప్పి పగలగొట్టాలి. ముందుగా వచ్చిన రేవంత్ 'బ్యాడ్ వర్డ్స్ యూస్ చేశారని నన్ను అన్నారు. మీరు ఛీ తూ అని అన్నారంటూ'' కీర్తిని నామినేట్ చేశాడు. ఛీ తూ అనేది బ్యాడ్ వర్డ్ ఆ నాకు అర్థం కాలేదు అని కీర్తి ఆశ్చర్యంగా చెబితే హా అవును అది బ్యాడ్ వర్డే అని రేవంత్ చెప్పుకొచ్చాడు.

  అదంతా నాకెందుకు నాయనా..

  అదంతా నాకెందుకు నాయనా..

  కీర్తి అలా అన్నాకా వెంటనే మీ వర్డ్స్ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారని ఇనయా అంటుంటే.. ఇనయా గారు అరవద్దు నేను చెబుతున్నాను మాట అరవకండి అంటూ ఫైర్ అయ్యాడు రేవంత్. తర్వాత వచ్చిన గీతూ రాయల్.. ఎవరికి వాళ్లు కలిసి ఆడేదానికి ఇద్దరిని టీమ్ గా బిగ్ బాస్ ఎందుకు పెట్టారు అని చెబుతూ మెరీనా నామినేట్ చేసింది. దానికి మెరీనా వివరణ ఇవ్వబోతుంటే.. అదంతా నాకెందుకు నాయనా.. మీరు ఇద్దరు (మెరీనా-రోహిత్) కలిసి ఆడారాని నాకు అనిపించింది అంటూ కుండ పగలగొట్టింది గీతూ రాయల్.

   నేను ఓట్ల కోసం చెప్పట్లేదు..

  నేను ఓట్ల కోసం చెప్పట్లేదు..

  గీతూ అలా చేయడంతో గేమ్ కోసం చేయి గానీ పర్సనల్ గా వెళ్లకు అని రోహిత్ అడ్వైస్ ఇచ్చాడు. చూసే జనాలు ఒక ఆడపిల్ల స్టేట్ మెంట్ పాస్ చేసిందంటే కళ్లు మూసుకుని జనాలు ఓట్లు వేయరు అని శ్రీ సత్య అంటే.. నేను ఓట్ల కోసం చెప్పట్లేదు. బాగున్నప్పడు బాగుందని చెప్పా.. బాగలేనప్పుడు బాగాలేదని చెప్పాను అని బాలాదిత్య అన్నాడు. దీంతో ఒకపని చేయండి.. ఏం చెప్పకండి అని ఫైమా బదులిచ్చింది. నీకు కూడా చెప్పొద్దా అని నవ్వి ఊరుకున్నాడు బాలాదిత్య.

  నువ్ కన్ఫ్యూజ్ డ్ పర్సన్ అని..

  నువ్ కన్ఫ్యూజ్ డ్ పర్సన్ అని..

  అనంతరం రోహిత్ ను నామినేట్ చేసింది గీతూ రాయల్. నీ గేమ్ పైనా గానీ, బిహేవియర్ పైనా గానీ, మ్యానరిజంపైనా గానీ ఇన్ని వారాలైన గానీ క్లారిటీ రాలేదు. నువ్ కన్ఫ్యూజ్ డ్ పర్సన్ అని నాకు అనిపిస్తుందని గీతూ అంటే.. కెప్టెన్సీ కంటెండర్ అయినప్పుడు నాకు ఓటు వేశారు కదా మరి అది ఎలా వేశారని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు రోహిత్. తర్వాత వచ్చిన ఆదిరెడ్డి.. ఇనయా గారు ఫేకస్యా.. ఫేకోభ్యః అని అనిపిస్తుంది అని అన్నాడు.

  English summary
  Bigg Boss Telugu 6 Season 9th Week Nominations Process October 31 Episode Promo
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X