Don't Miss!
- Lifestyle
చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టే PCOD మరియు PCOS సమస్యకు ఈ ఆహారాలు పరిష్కారం చూపుతాయి.
- News
వైసీపీకి మద్దతిచ్చిన బీఆర్ఎస్ - పార్లమెంటులో ఆసక్తికర పరిణామం-ఇదే తొలిసారి ?
- Finance
adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Bigg Boss Telugu 6: శత్రువులను పెంచుకుంటున్న రేవంత్.. ఎటాక్ మొదలైంది.. క్లిక్కయితే ఇంటికే!
గత రెండు వారాలా నుంచి బిగ్ బాస్ కొనసాగుతున్న విధానం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా ఎలిమినేషన్ అనేది ఉహాలకందని విధంగా కొనసాగుతోంది. కంటెస్టెంట్స్ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ఫైనల్ లో కప్ అందుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికి కూడా బిగ్ బాస్ విన్నర్ రేవంత్ అని కామెంట్స్ అయితే చాలానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు అతనిపై ఎటాక్ మొదలైనట్లు అనిపిస్తోంది. ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్ అతని తప్పులను చాలా బలంగా హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

జనాల్లో సపోర్ట్ ఎక్కువవుతోంది
రేవంత్ మొదటి నుంచి కూడా జనాల్లో మంచి సపోర్ట్ తోనే కొనసాగుతున్నాడు. అతను టాస్క్ లలో కొన్నిసార్లు నిరాశపరిచినప్పటికి జనాల్లో సపోర్ట్ ఎక్కువవుతోంది. ఇక అత్యధిక ఓట్లు అందుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లలో అతను నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు అని చెప్పవచ్చు. ఇక అతనికి పోటీగా ఉన్న మిగతా వాళ్ళు ఇదివరకే తప్పుల గురించి మాట్లాడినప్పటికి అంతగా మైనస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ పై గట్టిగానే ఫోకస్ చేసినట్లు అనిపిస్తోంది.

శ్రీహన్ కౌంటర్
కొన్నిసార్లు రేవంత్ సహనం కోల్పోతు ఉంటాడు. ముఖ్యంగా పిజికల్ టాస్క్ లలో అతను కోపాన్ని ఏ మాత్రం కంట్రోల్ చేసుకోడు అని చాలామంది చెప్పారు. ఇక అనవసరంగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు అని శ్రీహన్ కూడా చెప్పాడు. ఇక సోమవారం ఎపిసోడ్ లో కూడా శ్రీహన్ రేవంత్ చేస్తున్న కామెంట్స్ హర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడాడు. నేను మాట్లాడితే మీ ఇంట్లో గొడవలు అవుతాయని కూడా అతను కౌంటర్ ఇచ్చాడు.

ఆదిరెడ్డి ఫైర్
ఇక ఆది రెడ్డి నామినేషన్ లో ఈసారి రేవంత్ మాటలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తప్పులు బిగ్ బాస్ లో చాలా జరుగుతాయి నేను చేసిన తప్పును ధైర్యంగా ఒప్పుకుంటాను కానీ నువ్వు అలా కాదు అని ఆదిరెడ్డి ఫైర్ అయ్యాడు. దీంతో రేవంత్ కూడా అదే తరహాలో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. ఆదిరెడ్డి గట్టిగానే నిలదీసినట్లు అనిపించింది.

ఫైమా విశ్వరూపం
ఇక మరోవైపు ఫైమా అయితే నామినేషన్ లో మరో లెవెల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ సపోర్ట్ తో ఆడతావు అనే కామెంట్ చేసినందుకు ఆమె చిర్రెత్తి పోయి అతని తప్పుల చిట్టా విప్పే ప్రయత్నం చేసింది. అసలు నువ్వు ఎలాంటి గేమ్ అడుతున్నావో తెలుసా ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడుతున్నావు అని ఫైమా కౌంటర్ ఇచ్చింది. అలాగే రేవంత్ చేసిన తప్పల గురించి ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని ఆమె అందరిని అలెర్ట్ అయ్యేలా చేస్తోంది.

ఇది క్లిక్కయితే ఇంటికే..
మొత్తంగా ఫైనల్స్ కు ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉండడంతో కంటెస్టెంట్స్ ఈ వీక్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న రేవంత్ అందరికి పోటీగానే ఉన్నాడు కాబట్టి మిగతా కంటెస్టెంట్స్ అతనిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఆదిరెడ్డి, శ్రీహన్, ఫైమా చెప్పిన మాటలు ఈ వారం క్లిక్కయితే రేవంత్ ఇంటికి వెళ్లే అవకాశం లేకపోలేదు. ఈ వారం జనాల ఓట్లు చాలా కీలకం కానున్నాయి. మరి ఈ సారి రేవంత్ లక్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూడాలి.