Bigg Boss Telugu 6: గొడవలు స్థాయిని మరింత పెంచిన బిగ్ బాస్.. నీ చుట్టే తిరగాలా అంటూ సత్య కౌంటర్!
బిగ్ బాస్ 6వ సీజన్లో కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఊహించిన విధంగా కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మొదట్లోనే నాగర్జున కంటెస్టెంట్స్ లలో టాలెంట్ ఏమీ కనిపించడం లేదు అని గాలి తీసేశాడు. ఇక ఇటీవల బిగ్ బాస్ కూడా మీ వల్ల ఉపయోగం లేదు అని ఆడియన్స్ కూడా చిరాకు పడుతున్నట్లుగా ఒక నిజమైతే చెప్పాడు. ఇక ప్రతి టాస్క్ లో కూడా కంటెస్టెంట్స్ పై ఒత్తిడి అయితే పెరుగుతోంది. ఇక ఇప్పుడు నామినేషన్ లో మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన కొన్ని హైలెట్స్ లోకి వెళ్తే..

నేరుగా నామినేట్ అయ్యేందుకు
ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నేరుగా నామినేట్ అయ్యేందుకు మీరు ఎవరిని ఎంచుకుంటున్నారో ఏకాభిప్రాయంతో బిగ్ బాస్ కు చెప్పండి అని ఆదేశాలు వచ్చాయి. ఇక బిగ్ బాస్ అలా చెప్పగానే సత్య, అర్జున్ నామినేట్ చేయగా అతను రివర్స్ లో ఆమెను నామినేట్ చేశాడు. క్యారెక్టర్ లో ఆమె అటు ఇటుగా ఉంది అని అతను కారణం చెప్పడంతో 24 గంటలు నీ చుట్టే తిరగలేను కదా అర్జున్ అనే మరో కౌంటర్ ఇచ్చింది.

మీ గేమ్ నాకు సేఫ్ అనిపిస్తోంది
ఇక తర్వాత మీ గేమ్ నాకు సేఫ్ అనిపిస్తోంది మీరు ఆడేది ఏంటో అంటూ పక్కనే ఉన్న గీతు కౌంటర్ ఇచ్చింది. గతంలో వారిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలను గుర్తు చేస్తూ అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏమిటి అని అర్జున్ ని కూడా ప్రశ్నించింది. మరోవైపు మెరీనా నా ఓటు నీకే అంటూ గీతూ ఫిజికల్ గా గేమ్ లో పెద్దగా హైలెట్ అవ్వలేదు అని చెప్పింది.

దానివల్లే కొంత లాస్ అయ్యాము
పక్కనే ఉన్న వాసంతి కూడా అదే సమాధానం ఇవ్వడంతో.. నేను కామెడీ చేస్తాను ఫిజికల్ గా గేమ్ ఆడతాను అని గీతూ వారిద్దరితో విభేదించింది. ఇక రాహుల్ అయితే సత్యను నామినేట్ చేస్తున్నట్లు తెలియజేశాడు. ఇక సత్య అయితే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. టీం లీడర్ గా గేమ్ గురించి ఎదో చెప్పావు కానీ దానివల్లే కొంత లాస్ అయ్యాము అని రోహిత్ తెలియజేశాడు.

వాసంతి సీరియస్
అయితే మనం ఎవరు కూడా ఫెయిర్ గేమ్ ఆడలేదు అంటూ సత్య మరో బాంబు పేల్చింది. ఇంతకుముందు టాస్కులలో అయితే వాసంతి అంతగా ఏమీ ఆడలేదు అని రాజశేఖర్ చెప్పడంతో వాసంతి ఒక్కసారిగా సీరియస్ అయింది. అన్ని గేమ్లు ఎలా ఆడాము అనేది చూడాలి కాని కేవలం ఎంటర్టైన్మెంట్ అనేది చూడకూడదు అని వాసంతి చెప్పింది.

చిరాకుతో వెళ్లిపోయింది
అయితే ఆ ఎంటర్టైన్మెంట్ టాస్క్ బాగా ఆడి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని కూడా అతను అన్నాడు. దీంతో వాసంతి ఒక్కసారిగా చేతిలో ఉన్న పిల్లోనూ కింద పడేసి చిరాకుతో వెళ్లిపోయింది. అంత కష్టపడి ఆడినా కూడా మళ్ళీ చివరికి అదే మాట అంటే ఎంత బాధ ఉంటది అని వాసంతి ఆవేదన చెందింది. ఇక దానికంటే ఆడకుండా ఉంటే బెటర్ అని కూడా ఆమెకు మెరినా సపోర్ట్ చేసింది. మరి ఈ గొడవలు బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











