For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య రాజుకున్న గొడవ.. శ్రీసత్యకు కీర్తి వార్నింగ్..

  |

  తెలుగులో అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఈ షో ముందుగా అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో ప్రారంభై సూపర్ హిట్ సాధించింది. దీంతో ఈ షోను ఇండియాలోకి తీసుకొద్దామన్న భావనతో భారత్ లో స్టార్ట్ చేశారు. హిందీలో ఈ షో సూపర్ హిట్ కావడంతో తెలుగులోకి సైతం తీసుకొచ్చి ఘన విజయం సాధించారు. తెలుగులో వరుసపెట్టి సీజన్లతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. తాజాగా బిగ్ బాస్ హౌజ్ నుంచి మంచి వ్యక్తగా గుర్తింపు పొందిన బాలాదిత్య ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు 6 నవంబర్ 15 మంగళవారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన రెండో ప్రొమోను తాజాగా విడుదల చేశారు.

  11 మంది ఎలిమినేట్..

  11 మంది ఎలిమినేట్..

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ దాదాపు పూర్తయ్యే దశకు వచ్చింది. ఇప్పటికి 71 రోజులు 72 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఇంకొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అయితే ఇప్పటికీ పది వారాలకు గానీ 11 మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడి వెళ్లిపోయారు. వారిలో మొదటి వారంలో షానీ సల్మాన్, అభినయ శ్రీ ఎలిమినేట్ కాగా నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్ తోపాటు బాలాదిత్య, వాసంతి కృష్ణన్ డబుల్ ఎలిమినేషన్ తో ఇంటి బయటకు వెళ్లిపోయారు.

  కెప్టెన్ అయిన కారణంగా..

  కెప్టెన్ అయిన కారణంగా..

  ఇక బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ 11వ వారం నామినేషన్ల ప్రక్రియ చాలా కూల్ గా జరిగింది. ఎప్పుడు నామినేషన్లలో అరుచుకునే ఇంటి సభ్యులు ఈ పదకొండో వారం మాత్రం పెద్ద డిస్కషన్స్ లేకుండా సాఫీగా సాగింది. ప్రస్తుతం ఉన్న 10 మంది ఇంటి సభ్యుల్లో 9 మంది నామినేట్ అయ్యారు. ఫైమా కెప్టెన్ అయిన కారణంగా ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు. ఫైమా తప్పా రొహిత్, ఇనయా, ఆదిరెడ్డి, కీర్తి, మెరీనా, శ్రీసత్య, శ్రీహాన్, రాజ శేఖర్, రేవంత్ నామినేషన్లలో ఉన్నారు.

  గాల్లో కాళ్లు ఊపుతూ అలా..

  గాల్లో కాళ్లు ఊపుతూ అలా..

  తాజాగా నవంబర్ 15 మంగళవారం నాటి ఎపిసోడ్ రెండో ప్రోమోను విడుదల చేశారు. ప్రోమో స్టార్టింగ్ లో ఇక్కడ ఒకరిది ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు కదా అని మెరీనాతో కీర్తి అంటుంది. మరోవైపు శ్రీహాన్, శ్రీసత్య గార్డెన్ లో పడుకుని మాట్లాడుకున్నారు. తను బెడ్ మారిపోయి ర్యాపో తగ్గిందంటదేంటి పిచ్చా.. అని శ్రీహాన్ తో శ్రీ సత్య అంది. దీంతో శ్రీహాన్ గాల్లో కాళ్లు ఊపుతూ అదోలా నవ్వాడు.

  ఎలిగేషన్ వేసినప్పుడు..

  ఎలిగేషన్ వేసినప్పుడు..

  ఏందీ దమాక్ లేకుండా మాట్లాడతేందీ ఆ పిల్ల అని ఫైమాతో రాజ్ చెప్పుకుంటాడు. తను ఆడిన పర్సనల్ గేమ్.. నేను ఆడింది జనాలు చూస్తున్నారుగా అని కీర్తితో ఇనయా చెప్పుకుంది. మన పక్కన వాళ్లు నీ మీద ఒక ఎలిగేషన్ వేసినప్పుడు.. ఏ ఏందా ఎలిగేషన్ అని నువ్వే అన్నావ్.. ఈ వారం నువ్ ఏం చేశావ్. నిన్ను శ్రీహాన్ నామినేట్ చేశాడని నువ్ నన్ను చేశావా అని కీర్తిని అడిగింది శ్రీ సత్య.

  మంచి మాత్రం అస్సలు కనిపించదు..

  మంచి మాత్రం అస్సలు కనిపించదు..

  లేదు లేదు నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా. నువ్ ఎక్కడికెక్కడికో తీసుకెళ్లకు అని కీర్తి అంది. దేవలోకం కుక్కలు అన్నావ్ గా నేను అన్నాకే అన్నావ్ అది అంటూ ఇద్దరూ వాదించుకున్నారు. ఈ వెటకారమే వద్దనుకుంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది కీర్తి. నెగెటివ్ పాయింట్స్ మాత్రం కనిపిస్తాయి చేసిన మంచి మాత్రం అస్సలు కనిపించదని రేవంత్ అంటాడు. తర్వాత ఇప్పుడు వద్దని శ్రీహాన్ తో అంటే.. ఏదైనా చెబితే ఒకమాటే మీదే ఉండు అని శ్రీహాన్ అరిచాడు.

  నా విషయం కూడా అర్థం చేసుకో..

  నా విషయం కూడా అర్థం చేసుకో..

  నేను వెతకడం స్టార్ట్ చేస్తే నీకన్న ఎక్కువగా మిస్టేక్స్ చెబుతా అని రేవంత్ అంటే.. చెప్పు అని శ్రీహాన్ అన్నాడు. నీలా పాయింట్ అవుట్ చేయలేను నాకు ఆ అలవాటు లేదని రేవంత్ అంటే.. అలవాటు లేదు కాదు ఏం లేవు.. అని శ్రీహాన్ అన్నాడు. ప్రతీసారీ నీదే కాదు నా విషయం కూడా అర్థం చేస్కో అని రేవంత్ అంటే.. అర్థం చేసుకున్నా కాబట్టే.. నేను ఊరుకుని ఏం అన్లేదు అన్నాడు శ్రీహాన్.

  బయటకు పంపించి చెప్పాలనుకోను..

  అందరు ఎవరికీ నచ్చినట్లు వాళ్లు ఉన్నారు తప్పా ఎవ్వరు ఎవ్వరికీ అవసరం లేదు అని రేవంత్ అంటే.. అందరి గురించి నాకు అనవసరంరా.. నీకు నాకు మధ్యలో.. నా గురించి మాట్లాడు అనేసి వెళ్లిపోయాడు శ్రీహాన్. తర్వాత శ్రీసత్యతో.. రేవంత్ నన్ను నామినేట్ చేద్దామనుకున్నాడట చెబుతున్నాడు. నా ఫ్రెండ్ కు బయటకు పంపించి వేసి చెప్పాలనుకోను.. పక్కకు పిలిచి చెప్పాలనుకుంటా అని చెప్పాడు శ్రీహాన్.

  English summary
  Bigg Boss Telugu 6: Revanth Shrihan Fight And Keerthi Warning To Sri Satya November 15 Episode Promo Released
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X