For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: హౌజ్ లో రేవంత్ బూతుల వర్షం.. అమ్మని తిడుతూ, కొడకా అంటూ ఘోరంగా

  |

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. అరుపులు, కేకలు, ఫ్రస్టేషన్, ఎంకరేజ్ మెంట్, కన్నింగ్ చూపిస్తున్నారు ఇంటి సభ్యులు. కొందరైతే వెక్కిరింతలు, కావాలని రెచ్చగొట్టడంతోపాటు బూతులు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా బలహీనతలపై కొడుతూ ఎమోషనల్ గా దెబ్బతీసైనా గేమ్ విన్ అవ్వాలనుకుంటున్నారు. ఇలా తాజాగా బిగ్ బాస్ హౌజ్ లో మరోసారి ఆట రంజుగా సాగింది. ఈ ఆటలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన సింగర్ వాడిన బూతులు ఎవరు వాడి ఉండకపోవచ్చు. నవంబర్ 3 గురువారం ప్రసారమైన 60వ రోజు 61వ ఎపిసోడ్ వివరాళ్లోకి వెళితే..

   మిషన్ పాజిబుల్ గేమ్..

  మిషన్ పాజిబుల్ గేమ్..

  ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ తొమ్మిదో వారం నామినేషన్లలో మొత్తం 10 మంది ఉన్న విషయం తెలిసిందే. వీరిలో కెప్టెన్ అయిన కారణంగా శ్రీహాన్ నామినేషన్ నుంచి తప్పించుకోగా వాసంతి, రాజ శేఖర్ ని ఎవరు నామినేట్ చేయలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మిగిలిన 13 మంది కంటెస్టెంట్లందరికీ తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా మిషన్ పాజిబుల్ గేమ్ ఆడాల్సి ఉంది.

   సీక్రెట్ టాస్క్ లో భాగంగా..

  సీక్రెట్ టాస్క్ లో భాగంగా..

  మిషన్ పాజిబుల్ గేమ్ రెండో రోజు కూడా కొనసాగింది. ఈసారి మరింత అగ్రెషన్ తో ఆట ఆడింది రెడ్ టీమ్. ఎపిసోడ్ ప్రారంభంలో బాలాదిత్య గురించి రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్ కామెంట్స్ చేశారు. అనంతరం సూర్య పేరు చెరిపేయడం గురించి ఇనయా గొడవ చేసింది. అనంతరం సీక్రెట్ టాస్క్ లో భాగంగా వాష్ రూమ్ ను వరెస్ట్ గా తయారు చేస్తారు ఆదిరెడ్డి, ఇనయా సుల్తానా. అలా చేసి రెడ్ టీమ్ పై నెడుతారు.

  రీవైవ్ చేసుకునే అవకాశం..

  రీవైవ్ చేసుకునే అవకాశం..

  వాష్ రూమ్ ను, నా దుస్తులను చిందరవందరగా పడేశారని ఇనయా సుల్తానా గొడవ పెట్టుకుంటుంది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఆమెను ఆపినట్లు చేస్తాడు ఆదిరెడ్డి. మొత్తం రెడ్ టీమ్ సభ్యులదంతా తప్పన్నట్లు నిరూపిస్తారు. ఈ విషయాన్ని చెబుతూ సీక్రెట్ టాస్క్ లో గెలిచామని కెమెరాలకు చెబుతాడు ఆదిరెడ్డి. దీంతో బ్లూ టీమ్ లో చనిపోయిన ఒకరిని రీవైవ్ చేసుకునే అవకాశం వస్తుంది.

  గాయం అవ్వాలని చూడటం తప్పు..

  గాయం అవ్వాలని చూడటం తప్పు..

  రీవైవ్ లో భాగంగా రోహిత్ ను సెలెక్ట్ చేస్తాడు బ్లూ టీమ్ లీడర్ ఆదిరెడ్డి. ఆ తర్వాత బ్లూ టీమ్, రెడ్ టీమ్ ఎదురెదురుగా నిల్చుని స్ట్రిప్స్ లాక్కోవడం కోసం ప్రయత్నించారు. రేవంత్ ఎదుటివారికి గట్టిగా తాకేలా చేయి లేపాడు. దీంతో ఆదిరెడ్డి బ్రో అలా వద్దు ఫిజికల్ అవుతుంది. ఒకరికి గాయం అవ్వాలని చూడటం తప్పు అని చాలా మర్యాదగా చెప్పాడు. దానికి నా ఇష్టం. వద్దని చెప్పడానికి నీకు హక్కు లేదని రేవంత్ రూడ్ గా మాట్లాడాడు. రేవంత్ అలాగే చేతులు ఊపుతూ చేశాడు.

   తనే వచ్చి మనల్ని అంటాడేంటి..

  తనే వచ్చి మనల్ని అంటాడేంటి..

  రేవంత్ అలా చేతులు గట్టిగా ఊపే క్రమంలో తనను డిఫెన్ చేసుకునే క్రమంలో రోహిత్ చేయి అడ్డంగా పెట్టాడు. దీంతో రేవంత్ కు దెబ్బ తగిలింది. ఎవరివో గోళ్లు తాకాయంటూ వెళ్లి మొహం కడుక్కున్నాడు. తనకు దెబ్బ తగలగానే 'నీ అమ్మా' ఎవడ్రా తగిలింది ఇప్పుడు అనుకుంటూ గీతూని తోసుకుంటూ కోపంగా వెళ్లాడు. దీంతో తనే వచ్చి మనల్ని అంటాడేంటి అని ఆదిరెడ్డితో రోహిత్ చెప్పుకున్నాడు.

   నీ అమ్మా అని అనలేదు..

  నీ అమ్మా అని అనలేదు..


  రేవంత్ అలాగే రెచ్చిపోతుంటే రోహిత్ కాస్త సహనంగా ఉన్నాడు. ఎందుకు ఊరుకుంటున్నావ్ అని ఇనయా అడిగింది. ఏదో కావాలని కొట్టినట్లు మాట్లాడుతున్నావ్ ఏంటీ.. నీ అమ్మా అనే మాట ఏంటీ.. అది తప్పు అని మెరీనా అంది. నిన్న మీరు అన్నారు కదా తగలొద్దని వెటకారంగా హేళనగా మాట్లాడాడు రేవంత్. నేను నీ అమ్మా అని అనలేదని మెరీనా చెబితే.. నేను కూడా అనలేదు. అని చెప్పుకొచ్చాడు రేవంత్.

  రేవంత్ బూతులు..

  రేవంత్ బూతులు..

  ఇలా రేవంత్ ప్రతిసారి అమ్మాయిలు అని చూడకుండా ఎప్పుడూ అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. ఇదివరకు నాగార్జున చెప్పినట్లు ఉన్మాదిలానే ప్రవర్తిస్తున్నాడు. అంతేకాకుండా గేమ్ ను స్పోర్టివ్ గా తీసుకోవడానికి బదులు బూతులు కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 'నీ అమ్మా' అని అంటే.. ఇంతకుముందు ఆదిరెడ్డిని 'నా కొడకా' అన్నాడు. మళ్లీ దానికి వెనుక ముందు ఏం లేదని బుకాయించాడు. బేటన్ టాస్క్ లో కూడా 'ఏం పీకుతావ్' అని ఇనయా సుల్తానాపై నోరు పారేసుకున్నాడు రేవంత్.

  English summary
  Blue Team Vs Red Team Participate In Mission Possible Task And Revanth Using Abusing Words In Bigg Boss Telugu 6 Season November 3 Day 60 Episode 61 Highlights.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X