twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: రేవంత్ ని అనరాని మాట అన్న వాసంతి.. మళ్లీ హౌజ్ టార్గెట్ ఆమెనే!

    |

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సింగర్ రేవంత్ తోపాటు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినేషన్ మిగతా ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చింది. దీంతో వాళ్లు ఆడే గేమ్ ఆడియెన్స్ కు ఎలా రిజిస్టర్ అవుతుందోనని ఆలోచనలో పడ్డారు. ఇక ఎలిమినేషన్ తర్వాత రోజు జరిగేది నామినేషన్స్ ప్రక్రియ. ఎప్పటిలానే బిగ్ బాస్ తెలుగు 6 10వారం నామినేషన్ల ప్రక్రియ వాడివేడీగా జరిగింది. ఈ ప్రక్రియలో మళ్లీ కొందరు వెటకారంగా, వ్యంగంగా మాట్లాడుతూ కనిపించారు. ఇక రేవంత్, వాసంతి మధ్య మాటల యుద్ధం నడిచింది. బిగ్ బాస్ తెలుగు 6 నవంబర్ 7 64వ రోజు 65 ఎపిసోడ్ హైలెట్స్ లోకి వెళితే..

    తొమ్మిది వారాలుకు 9 మంది ఔట్..

    తొమ్మిది వారాలుకు 9 మంది ఔట్..

    ఈ బిగ్ బాస్ తెలుగు 6 సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో తొమ్మిది వారాల్లో షానీ సల్మాన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినట్ అయి వెళ్లిపోయారు.

    టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన వాళ్లు..

    టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన వాళ్లు..

    బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ ఎంతో ఆసక్తికరంగా, ఊహించని విధంగా జరిగాయి. మరీ ముఖ్యంగా ఇందులో టాప్ ప్లేయర్లు అనుకున్న వాళ్లు, టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన వాళ్లు చాలా మంది వెళ్లిపోయారు. దీంతో నామినేషన్స్ టాస్కులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక, తొమ్మిదో వారం గీతూ వెళ్లిపోవడంతో పదో వారం నామినేషన్స్ ప్రక్రియపై అందరూ దృష్టి పడింది. ఈ నామినేషన్లు జోరుగా సాగాయి.

     హౌజ్ టార్గెట్ ఇనయా..

    హౌజ్ టార్గెట్ ఇనయా..

    బిగ్ బాస్ తెలుగు 6 నవంబర్ 7వ తేది 64వ రోజు 65వ ఎపిసోడ్ లో గొడవలు, టార్గెట్ లు, మాటల యుద్ధాలు జరిగాయి. నామినేషన్లలో హౌజ్ మొత్తం ఇనయా సుల్తానాను టార్గెట్ చేసింది. ఆమెకు ఏకంగా 8 ఓట్లు పడ్డాయి. నామినేట్ చేయాలనుకున్న ఇంటి సభ్యుల మొహాలపై ఎరుపు రంగు నీళ్లు కొట్టి కారణాలు చెప్పాలి. ఈ ప్రక్రియ కెప్టెన్ శ్రీ సత్యతో మొదలైంది. ఆమె బాలాదిత్య, ఇనయాను నామినేట్ చేసింది.

    ఫైమా గురించి మాట్లాడం..

    ఫైమా గురించి మాట్లాడం..

    బాలాదిత్య కోపంలో గీతూ రాయల్ ను అన్నమాటలను ప్రస్తావిస్తూ నామినేట్ చేసింది శ్రీ సత్య. అలాగే బేటాన్ టాస్క్ తదితర టాస్క్ ల్లో తనను, శ్రీహాన్ ను ఉద్దేశించి ఇనయా మాట్లాడిన మాటలు నచ్చలేదని నామినేట్ చేసింది. సూర్య టాపిక్ తీసుకొచ్చినందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పింది ఇనయా. తర్వాత తను సూర్య గురించి కాదు ఫైమా గురించి మాట్లాడామని శ్రీ సత్య తెలిపింది.

    అగ్రెసివ్ పేరుతో రెండు వారాలు నామినేట్..

    అగ్రెసివ్ పేరుతో రెండు వారాలు నామినేట్..

    ఇలా ఇనయా సుల్తానాను, ఆదిరెడ్డి, కీర్తి భట్, మెరీనా, శ్రీహాన్, శ్రీ సత్య, రాజ శేఖర్, వాసంతి, బాలాదిత్య నామినేట్ చేశారు. తర్వాత వాసంతి, రేవంత్ మధ్య మాటల యుద్ధం నడిచింది. వాసంతిని రేవంత్ నామినేట్ చేశాడు. నేను అగ్రెసివ్ అని నన్ను రెండు వారాలు నామినేట్ చేశారు అని రేవంత్ అనగానే అది అందరూ చెప్పేదే. నేను కొత్తగా చెప్పేది ఏముంది అని వాసంతి సమాధానం ఇచ్చింది.

    మీరు అందరినీ తోసేయట్లేదా..

    మీరు అందరినీ తోసేయట్లేదా..

    వెంటనే దీనికి వినండి అంటూ.. కావాలని ఓ వ్యక్తి మీద చేయి ఎత్తి కొట్టడం తప్పు. అక్కడ నేను హర్ట్ అయ్యానా.. తగులుతుందా.. చిన్న దెబ్బా.. పెద్ద దెబ్బా.. అనవసరం. కానీ కొట్టాలనే ఇంటెన్షన్ రాంగ్ అని చెప్పుకొచ్చాడు రేవంత్. దానికి తను ఇంటెన్షన్ తో కొట్టలేదని వాసంతి తెలిపింది. మరైతే తనను రెండు సార్లు అగ్రెషన్ పేరుతో ఎందుకు నామినేట్ చేశారని రేవంత్ అడిగాడు. నేను ఒక్కసారి చేయి ఎత్తి కొడితేనే మీరు అంతలా అంటున్నారే. మరి ప్రతిసారి గేమ్ లో మీరు అందరినీ తోసేయట్లేదా, కావాలని చేయట్లేదా అని వాసంతి ప్రశ్నించింది.

    నీకన్నా నేను చాలా బెటర్..

    నీకన్నా నేను చాలా బెటర్..

    దీనికి రేవంత్.. అయితే వాళ్లను అడ్డు రావొద్దని చెప్పండి అని అన్నాడు. మీకు అడ్డు రాకపోతే ఎవరూ ఆడరు. మీరొక్కరే ఆడుకోండని అంది వాసంతి. మీకు భయం ముందుకు రావడానికి భయం.. వెనకుండి ఆడటం కాదు.. గేమ్ అంటే ముందుకొచ్చి ఆడాలి. వేరేవాళ్లు ట్రై చేశారు. మీరు కనీసం అది కూడా చేయలేదు అని రేవంత్ అన్నదానికి.. వేరేవాళ్లను తోసేసి ఆడటం నాకు తెలీదు. ఎదుటివాళ్లకు ఏమైపోయినా పర్వాలేదు. నేను విన్ అయితే చాలు అని అనుకునేది నువ్వు. నీకన్నా నేను చాలా బెటర్ వెళ్లు అని వాసంతి గట్టిగానే అంది.

     ఒళ్లు గురించి నేను అనలేదు..

    ఒళ్లు గురించి నేను అనలేదు..

    వెళ్లు అంటే వెళ్లిపోను.. వేరేవాళ్లలా చూస్తూ ఊరుకోను.. నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అన్ని దగ్గరపెట్టుకుని మాట్లాడండి అని రేవంత్ అంటే.. సేమ్ నువ్ కడా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు నాతో అని బదులిచ్చింది వాసంతి. ఒళ్లు గురించి నేను అనలేదు.. నోరు జారింది మీరు అని రేవంత్ ఫైర్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ తెలుగు 6 పదో వారం నామినేషన్లలో మొత్తం 9 మంది ఉన్నారు. కెప్టెన్ అయిన కారణంగా శ్రీ సత్య, ఎవరు నామినేట్ చేయకపోవడంతో రాజ్, రోహిత్ సేఫ్ అయ్యారు.

    English summary
    Total 9 Housemates In Bigg Boss Telugu 6 Season 10th Week Nominations And November 7th Day 64 Episode 65 Highlights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X