Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6 హార్ట్ టచింగ్ గా రోహిత్ బిగ్ బాస్ ప్రయాణం.. అదొక్కటే అసంతృప్తి!
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ ప్రారంభం నుంచే అనుకోని విషయాలు చోటుచేసుకుంటున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఊహించని ఎలిమినేషన్స్ షాకింగ్ గా మారాయి. టైటిల్ ఫెవరెట్ గా నిలిచినవాళ్లు, టాప్ 5 కంటెస్టెంట్స్ ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇటీవల లేడీ టైగర్ ఇనయా ఎలిమినేట్ కాగా ఈ 15వ వారం మరొకరిని ఎలిమినేట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాప్ 6లో ఉన్న కంటెస్టెంట్స్ బిగ్ బాస్ జర్నీలను చూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మిస్టర్ పర్ఫెక్ట్ రోహిత్ జర్నీని వేశారు.

ఎమోషనల్ గా ప్రయాణం..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ పూర్తి కావడానికి ఇంకొ ఒక్క వారమే మిగిలి ఉంది. వచ్చే ఆదివారం అంటే డిసెంబర్ 18న గ్రాండ్ ఫినాలే జరగనుంది. అదే రోజు టైటిల్ విజేతను ప్రకటించనున్నారు. గ్రాండ్ ఫినాలే అంటే సెలబ్రిటీల రాకతో సందడిగా మారనుంది. ఇదిలా ఉంటే టాప్ 6 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ జర్నీని హౌజ్ లో ప్లే చేస్తున్నారు. అలా ఇప్పటికే రేవంత్, శ్రీసత్య ప్రయాణాన్ని వాళ్లకు చూపించారు. వాళ్ల జర్నీ చాలా ఎమోషనల్ గా సాగింది.

రోహిత్ సహ్ని బిగ్ బాస్ జర్నీ..
బిగ్ బాస్ హౌజ్ లో కూల్ అండ్ కంపోజ్డ్ గా ఉండి ఇంటి సభ్యులచేతనే కాకుండా యావత్ బిగ్ బాస్ ప్రేక్షకుల ద్వారా మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు రోహిత్ సహ్ని. మొదట్లై సైలెంట్ గా ఉన్న రోహిత్ తర్వాత తన ఆట, మాట, ఆలోచన తీరుకు ఫిదా అయ్యారు. అంతేకాకుండా అతనికి హస్బండ్ మెటీరియల్ అని ట్యాగ్ కూడా ఉంది. అలా మొత్తంగా టాప్ 6లోకి వెళ్లాడు రోహిత్. బిగ్ బాస్ తెలుగు 6 డిసెంబర్ 13 నాటి 100వ రోజు ఎపిసోడ్ రెండో ప్రోమోలో రోహిత్ సహ్ని జర్నీని ప్లే చేశారు.

ప్రత్యేకమైన గుర్తింపు సాధించావ్..
బిగ్ బాస్ హౌజ్ లో రోహిత్ జర్నీని అంతా ఫొటోల రూపంలో గార్డెన్ ఏరియాలో డెకరేట్ చేశారు. అందులో రోహిత్ కు మిస్టర్ పర్ఫెక్ట్ అని ఇచ్చిన టైటిల్ ను చూపించారు. వెనుక బ్యాక్ గ్రౌండ్ లో మెరీనా వాయిస్ వినిపించారు. "హాయ్ జాన్.. ఐ లవ్యూ సో షో మచ్ యూ అండ్ ఐ మిస్సింగ్ యూ ఏలాట్ రా.. నీకొక మాట చెప్పనా.. నువ్ ఒక ప్రత్యేకమైన గుర్తింపును యునిక్ నెస్ ను ప్రజల మనుషుల్లో సంపాదించుకున్నావ్" అని మెరీనా తెలిపింది.

మీ మనసుకు బాధ కలిగింది..
"రోహిత్.. ఏ ప్రయాణంలోనైనా ఎదురయ్యే సవాళ్లు.. ఏర్పడే పరిస్థితుల కారణంగా వచ్చే కష్టసుఖాలను పరదాలు లేకుండా పంచుకోవడం కేవలం జీవిత భాగస్వామితోనే సాధ్యం. ఇదే విషయం గురించి కామెంట్ చేస్తున్నప్పుడు మీ మనసుకు బాధ కలిగింది. మీ భావనను వ్యక్తపరచడం కష్టంగా మారినప్పుడు మీ మౌనాన్ని ఆయుధంగా ఉపయోగించారు. మీ మంచితనాన్ని అవకాశంగా ఇతరులు తీసుకున్నా మీరు వారికి సహాయం చేయడానికి నిర్ణయించుకున్నారు"
ఇలా చూసి గర్వపడతారు..
"మీ అమ్మగారు మిమ్మల్ని కేప్టెన్ గా చూడాలనే కోరిక అసంపూర్ణంగా మిగిలిపోయిన ఈ స్థానంలో మిమ్మల్ని ఇలా చూసి వారు గర్వపడతారు. ఎక్కడి నుంచి వచ్చామని కాదు.. వచ్చి ఏం సాధించామనేది ముఖ్యం. 14 వారాల ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసుకుని ఫినాలేకి ఒక్క అడుగు దూరంలో ఉన్న మీకు బిగ్ బాస్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు" అని బిగ్ బాస్ మాట్లాడారు. ఎంతో హార్ట్ టచింగ్ గా ఉన్న బిగ్ బాస్ మాటలకు రోహిత్ చాలా ఎమోషనల్ అయ్యాడు.