For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Winner: బిగ్ బాస్ విన్నర్ కి ప్రైజ్ మనీతో పాటు ఖరీదైన ల్యాండ్.. దాని విలువ ఎంతో తెలుసా?

  |

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఈ సీజన్ ఇప్పటికే 91 రోజులు 92 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మరికొన్నిరోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇక బిగ్ బాస్ హౌజ్ నుంచి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ ఇంటి బాట పడుతున్నారు. ఇప్పటికే 13 మంది వెళ్లిపోగా.. తాజాగా 13వ వారం జబర్దస్త్ కమెడియన్ ఫైమా ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడింది. ఇదిలా ఉంటే ఫైమా వెళ్లిపోయిన తర్వాత హోస్ట్ నాగార్జున ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ విన్నర్ కి ప్రైజ్ మనీతోపాటు ఖరీదైన ల్యాండ్ ను కూడా అందజేస్తారని ఇంటి సభ్యులకు తెలిపాడు. ఆ ల్యాండ్ ఖరీదు ఎంతనే వివరాల్లోకి వెళితే..

  అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో..

  అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో..

  బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి సైతం తీసుకొచ్చారు. ఇక తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమై భారీగా ప్రేక్షకాదరణ పొందింది. వరుస సీజన్లతో దూసుకుపోతూ ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది.

  ప్రస్తుతం ఆరో సీజన్ రన్నింగ్..

  ప్రస్తుతం ఆరో సీజన్ రన్నింగ్..

  ఇప్పటికే ఐదు టీవీ, ఒక నాన్ స్టాప్ (ఓటీటీ) సీజన్లు పూర్తి చేసుకుంది ఈ రియాలిటీ షో. మొదటి రెండు సీజన్స్ మినహాయిస్తే మిగతా అన్ని సీజన్లకు టాలీవుడ్ కింగ్, మన్మథుడు నాగార్జున హోస్ట్ గా అలరించాడు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కు కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావు, రేవంత్‌‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు.

  హౌజ్ లో ప్రస్తుతం ఏడుగురు..

  హౌజ్ లో ప్రస్తుతం ఏడుగురు..


  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో 13 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్, జబర్దస్త్ ఫైమా ఇలా 14 మంది వెళ్లిపోయారు. దీంతో హౌజ్ లో ఏడుగురు మాత్రమే మిగిలారు.

  విన్నర్ ప్రైజ్ మనీపై ఆసక్తి..

  విన్నర్ ప్రైజ్ మనీపై ఆసక్తి..

  ఇదిలా ఉంటే ఎప్పుడైనా సరే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ ఆసక్తికరంగా ఉంటుంది. విన్నర్ కి ఎంత వస్తుందని తెలుసుకోవాలనే కుతుహలం ఉంటుంది. అలా ఇంట్రెస్ట్ ఉండటం అటు ఇంటి సభ్యుల్లో నుంచి గెలిచే టైటిల్ విన్నర్ కి అయినా.. బిగ్ బాస్ చూసే ప్రేక్షుకులకైనా సర్వసాధారణమే. అయితే ఈ బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో మాత్రం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి ఈ ప్రైజ్ మనీ.

  ప్రైజ్ మనీ తగ్గించే ప్రయత్నం..

  ప్రైజ్ మనీ తగ్గించే ప్రయత్నం..

  బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఈ ఆరో సీజన్ లో ప్రైజ్ మనీని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇంటి సభ్యులకు టాస్క్ లు ఇస్తూ వారిచేతే ఈ డబ్బును తగ్గించే ప్లాన్ వేసింది బిగ్ బాస్ టీమ్. నామినేషన్స్ నుంచి బయటపడేందుకు ఇమ్యూనిటీ టాస్క్ లో భాగంగా రూ. 5 లక్షలలోపు గరిష్ట అమౌంట్ ను చెక్ పై రాసి వేయాల్సిందిగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే అమౌంట్ రాసిన రాయకున్నా.. ప్రైజ్ మనీ నుంచి రూ. 5 లక్షలను కట్ చేస్తామని బిగ్ బాస్ తెలిపాడు.

  ప్రైజ్ మనీ నుంచి తగ్గనుంది ఎంతంటే..

  ప్రైజ్ మనీ నుంచి తగ్గనుంది ఎంతంటే..

  ఈ టాస్క్ లో అందరూ అమౌంట్ రాశారు. అందరికన్నీ యూనిక్ అమౌంట్ రూ. 4, 90, 700 రాసి ఇమ్యూనిటినీ దక్కించున్నాడు మోడల్ రాజశేఖర్. అలాగే ఫ్రీ ఎవిక్షన్ పాస్ కోసం పెట్టిన టాస్క్ లో రేవంత్, శ్రీహాన్, ఫైమా ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కో అమౌంట్ తో గేమ్ ఆడారు. వాళ్ల ముగ్గురిది అంతా కలిపి చూసుకుంటే సుమారు రూ. 3 లక్షల దాకా ఉండొచ్చు. అంటే ఈ అమౌంట్ కూడా విన్నర్ ప్రైజ్ మనీ నుంచి తగ్గనుందన్నమాట. అంటే మొత్తంగా దాదాపుగా రూ. 8 లక్షలు తగ్గనుంది.

  605 స్క్వైర్ యార్డ్ గల భూమి..

  605 స్క్వైర్ యార్డ్ గల భూమి..

  ఇదిలా ఉంటే గత రాత్రి ఎపిసోడ్ లో ఫైమా వెళ్లిపోయిన తర్వాత ఇంటి సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పాడు హోస్ట్ నాగార్జున. బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీతో పాటు 605 స్క్వైర్ యార్డ్స్ గల స్థలాన్ని అందించనున్నారు. సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ కు చెందిన సాకేత్ నుంచి అత్యంత ఖరీదైన ఈ భూమిని బిగ్ బాస్ తెలుగు సీజన్ విన్నర్ కి ఇవ్వనున్నారు. దీని విలువ సుమారు రూ. 25 లక్షలు అని హోస్ట్ నాగార్జున తెలిపారు.

  English summary
  Bigg Boss Telugu 6 Season Host Nagarjuna Reveals Winner Gets Rs 25 Lakh Worth Suvarnabhoomi Infra Developers Saket 605 Sq Yards Land With Prize Money.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X