For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ఇనయాపై శ్రీహాన్ సీరియస్.. ఆదిరెడ్డికి సర్ ప్రైజ్.. వరెస్ట్ కంటెస్టెంట్ గా అతను!

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మంచి రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు కెప్టెన్సీ కంటెండర్ల కోసం చేపల చెరువు ఆటను జోరుగా ఆడించాడు బిగ్ బాస్. వారిలో ఆరుగురు కెప్టెన్సీ కంటెండర్లుగా సెలెక్ట్ కాగా, ఫైనల్ లోకి కీర్తి, శ్రీహాన్, ఆర్జే సూర్య వెళ్లారు. ఈ ముగ్గురిలో ఒకరికి కత్తిపోటు పొడిచి కెప్టెన్సీ నుంచి తప్పించాలి. ఇక కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న ముగ్గురు సీ ఇంగ్లీష్ లెటర్ ను మెడలో వేసుకుని ప్రచారం చేయసాగారు. ఇదిలా ఉంటే తేజాగా బిగ్ బాస్ తెలుగు 6 అక్టోబర్ 2న ప్రసారం అయ్యే ఎపిసోడ్ రెండో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఇనయాపై శ్రీహాన్ విరుచుకుపడ్డాడు. మరిన్ని ఆసక్తికర విషయాల్లోకి వెళితే..

  గేమ్ అయ్యాక కూడా కంటిన్యూ చేస్తూ..

  గేమ్ అయ్యాక కూడా కంటిన్యూ చేస్తూ..

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. టాస్క్ లో వచ్చే కోపాలు, గొడవలను గేమ్ అయ్యాక కూడా కంటిన్యూ చేస్తూ మంచి కంటెంట్ ఇస్తున్నారు ఇంటి సభ్యులు. ఎనిమిదో వారం ఇంటి కెప్టెన్ కోసం ఫైనల్ లోకి కీర్తి, శ్రీహాన్, సూర్య వెళ్లారు. ఇప్పటికే సూర్యకు నాలుగు కత్తిపోట్లు పడ్డాయి. కీర్తికి, శ్రీహాన్ కు చెరొకటి చొప్పున కత్తిపోటు గుచ్చుకుంది. అందరికంటే తక్కువ కత్తిపోట్లు పడిన శ్రీహాన్ ఇంటి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది.

  రోహిత్ గెలిచినట్లు ప్రకటన..

  రోహిత్ గెలిచినట్లు ప్రకటన..

  తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. హౌజ్ మేట్స్ కి బిగ్ బాస్ యమహా కాల్ ఆఫ్ ది బ్లూ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ పోటీలో శ్రీసత్య, కీర్తి, రోహిత్, రేవంత్ పాల్గొన్నారు. ఈ పోటీలో తాళ్లద్వారా క్లైంబ్ చేయడం, పుషప్స్ కొట్టడం, స్కిప్పింగ్ ఆడటం వంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ టాస్క్ కు సంచాలక్ గా ఇనయా సుల్తానా వ్యవహరించింది. మొత్తంగా ఈ టాస్క్ లో రోహిత్ గెలిచినట్లు ఇనయా ప్రకటించింది.

  బాలాదిత్యకు ఎరుపు రంగు పూసి..

  బాలాదిత్యకు ఎరుపు రంగు పూసి..

  రోహిత్ గెలిచినట్లు ఇనయా ప్రకటించడంతో రేవంత్ కోపంగా వెళ్లిపోయాడు. రేవంత్.. అని ఇనయా పిలిచినా.. నా మైండ్ బాలేదు అని సీరియస్ గా చెప్పి కూర్చున్నాడు. ఆ తర్వాత ఈ వారం వరస్ట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పాల్సిందిగా ఆదేశించాడు బిగ్ బాస్. బాలాదిత్యకు శ్రీహాన్ ఎరుపు రంగు పూసి.. టాస్క్ బాగా ఆడారు. కానీ ఇంకొకరి కోసం కూడా గేమ్ ఆడినట్లు కన్వే చేశారు అని చెప్పాడు శ్రీహాన్.

  కర్రీ లేక వదిలేశాను..

  కర్రీ లేక వదిలేశాను..

  శ్రీహాన్ అలా అనడంతో.. ఒక గేమర్ గా కంటే ఒక మనిషిగా ఆమెకు సపోర్ట్ చేశాను. మొన్న నీకు చెప్పి మాటే నా కర్మణ్యేవాదే కారస్తే. నా పని నేను చేశాను అని బదులిచ్చాడు బాలాదిత్య. తర్వాత హౌజ్ లో రైస్ వృథా అవుతుందని డిస్కషన్ పెట్టుకున్నారు. రైస్ వేస్ట్ అవుతుందని రేవంత్ ముందుగా మాట్లాడాడు. రైస్ ఎక్కువైందని కొందరు వదిలేస్తున్నారు అని శ్రీహాన్ అంటే.. వెంటనే నేను ఎక్కువైందని వదిలేయట్లేదు.. కర్రీ లేక వదిలేశాను అని సమాధానం ఇచ్చుకుంది ఇనయా సుల్తానా.

  రైస్ కు ఇచ్చే వాల్యూ ఇదేనా..

  రైస్ కు ఇచ్చే వాల్యూ ఇదేనా..

  అందరికీ లేని ప్రాబ్లమ్ నీకేందుకు అని శ్రీహాన్ అంటే.. నేను చేసింది తప్పు కాదని అందరికీ క్లారిటీ ఇస్తున్నాను అని ఇనయా అంటే.. నేను మాట్లాడుతున్నప్పుడు కాదు. తర్వాత ఇచ్చుకో. ఇది నా టైమ్. నేను అందరికీ పాయింట్లు చెబుతున్నప్పుడు కామ్ గా ఉండు. మధ్యలో మాట్లాడకు అంటూ శ్రీహాన్ చాలా సీరియస్ అయ్యాడు. కర్రీ వేయలేదు అందుకే తిన్లేదు అని ఇనయా అంటే.. రైస్ కు నువ్ ఇచ్చే వాల్యూ ఇదేనా అని అన్నాడు శ్రీహాన్.

  ఆదిరెడ్డికి సర్ ప్రైజ్..

  తర్వాత నా ముందు రైస్ పడేయటాన్ని అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చాడు శ్రీహాన్. అనంతరం టీవీలో ఆదిరెడ్డి ఫ్యామిలీని చూపించారు. ఆదిరెడ్డి భార్య, పాప, అతని చెల్లెలు కనిపించారు. ఆదిరెడ్డి కూతురు మొదటి బర్త్ డే సందర్భంగా చిన్నపాటి వీడియోతో ఆదిరెడ్డికి సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇదంతా చూసి మురిసిపోయిన ఆదిరెడ్డి.. బిగ్ బాస్ కి థ్యాంక్యు చెబుతూ.. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందంటూ అద్విత హ్యాపీ బర్త్ డే అని చెప్పాడు.

  English summary
  Shrihan Serious On Inaya Sultana And Bigg Boss Gives Surprise To Adireddy In Bigg Boss Telugu 6 And Captaincy Task In October 27 Episode Promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X