Don't Miss!
- News
ఆ `రెండింటి`తోనే అసలు సమస్యలు- జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి కీలక ప్రసంగం
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Finance
reliance q3: అంచనాలకు మించి రిలయన్స్ లాభాలు - మరి వారసుల సామర్థ్యమెంత??
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Bigg Boss Telugu 6 ఎమోషనల్ గా రేవంత్ బిగ్ బాస్ జర్నీ.. టైటిల్ గెలవడంపై అనుమానాలు?
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ పూర్తి కావడానికి ఇంకొ ఒక్క వారమే మిగిలి ఉంది. వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. అదే రోజు టైటిల్ విజేతను ప్రకటించనున్నారు. ఈ సీజన్ ముందు నుంచి టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగింది సింగర్ రేవంత్. దాదాపుగా ఇప్పటివరకు అతనే బిగ్ బాస్ విన్నర్ అని ప్రచారం జరుగుతోంది. అలాగే హౌజ్ లో కూడా తాను గెలిచి కప్పు తీసుకెళ్లి తన పాపకు గిఫ్ట్ గా ఇవ్వాలని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఇటీవల రేవంత్ బిహేవియర్ పై పలు విమర్శలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ ఎవరు? అనే క్యూరియాసిటీ నెలకొంది.

ఈవారం మధ్యలో ఎలిమినేషన్..
21 మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ప్రస్తుతం ఆరుగురు ఇంటి సభ్యులు మిగిలారు. తాజాగా ఇనయా సుల్తానా ఎలిమినేట్ కావడంతో హౌజ్ లో రేవంత్, రోహిత్, శ్రీహాన్, శ్రీ సత్య, కీర్తి భట్, ఆదిరెడ్డి ఉన్నారు. ఈ 15వ వారం మధ్యలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండనుంది. బుధవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఒకరిని హౌజ్ నుంచి బయటకు పంపనున్నారు. దీంతో టాప్ 5లోకి ఎవరు వెళ్లనున్నారో వేచి చూడాలి.

బిగ్ బాస్ పర్మిషన్ తో..
ఇదిలా ఉంటే బిగ్ బాస్ రియాలిటీ షో ప్రతి సీజన్ లో టాప్ 5లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలు వేస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా రేవంత్ జర్నీ గురించి బిగ్ బాస్ అతనితో పంచుకున్నారు. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 6 డిసెంబర్ 12 నాటి 99వ రోజు ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో స్టైలిష్ గా రెడీ అయిన రేవంత్ బయటకొచ్చి అక్కడున్న బేబీ డాల్ ను మీ పర్మిషన్ తో తీసుకుంటా అని చెప్పాడు.

వ్యక్తిత్వానికి జరిగే పోటీలో..
ఆ బేబీ డాల్ తో నా బేబీ కూడా ఇంతే ఉంటుందేమో అని ముద్దు పెట్టుకున్నాడు రేవంత్. టైటిల్ గెలిచిన తర్వాత నా బేబీని కూడా ఇలాగే ఎత్తుకుంటా బిగ్ బాస్. నమ్మకంతోనే అంటున్నా. ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాదు. మనం ఏదైనా సాధించాలంటే ముందు మనమీద మనకు నమ్మకం ఉండాలి అని రేవంత్ అన్నాడు. తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ.. "రేవంత్ ఇప్పటివరకు గాత్రానికి జరిగిన ఎన్నో పోటీల్లో గెలిచి ఇప్పుడు.. వ్యక్తిత్వానికి జరిగే పోటీలో కూడా గెలవాలనే పట్టుదలతో ఈ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టారు" అని అంటే.. అవునని రేవంత్ చెప్పాడు.

ఓవైపు కలతగా ఉన్నా..
"మీ కోపమే మీకు బలహీనతగా మారి పొరపాట్లకు కారణమైంది. ఈ విషయాన్ని వెంటనే అర్థం చేసుకుని అందుకు తగ్గట్టు మారి, మీ కోపాన్ని ప్యాషన్ గా మార్చారు. జీవితంలో అన్ని భావాలను కలిగి ఉన్న వారే నిజమైన విజేతలు. జీవితంలో తండ్రి అయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశాన్ని వదులుకుని, మీ వాళ్లకు దూరంగా ఉండి.. ఓవైపు కలతగా ఉన్నా, మరోవైపు గెలుపు కోసం ఎక్కడికైనా వెళ్లాలనే కోరిక మిమ్మల్ని ముందుకు నడిపింది"

ఎమోషనల్ అయిన రేవంత్..
"ఇప్పుడు మీ ప్రయాణం మీ అంతిమ లక్ష్యానికి చేరుకోవాలని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. ఫినాలే కోసం బిగ్ బాస్ మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు" అని బిగ్ బాస్ తెలిపారు. దీనికి థ్యాంక్యూ బిగ్ బాస్ అంటూ చాలా గట్టిగా అరిచాడు బిగ్ బాస్. తన జర్నీ గురించి బిగ్ బాస్ చెబుతుంటే రేవంత్ చాలా ఎమోషనల్ అయి కంటతడి పెట్టాడు. బిగ్ బాస్ అలా చెప్పడం రేవంత్ కు గూస్ బంప్స్ తెప్పించినట్లుగా అనిపించింది.
విన్నర్ గా రేవంత్ కాకుండా..
అయితే సాధారణంగా టైటిల్ విన్నర్స్ జర్నీని, వారి జర్నీ గురించి బిగ్ బాస్ అందరికన్నా చివర్లో.. అంటే ఫినాలేకు ముందు రోజు, లేదా అదే రోజు చెబుతారని ఒక టాక్ ఉంది. కానీ టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన రేవంత్ జర్నీని అందరికంటే ముందుగా చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్ కు రేవంత్ ను విన్నర్ గా కాకుండా ఇంకొకరిని ప్రకటించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.