For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ఎలిమినేషన్ తీసుకుని సూర్య ఇంటికెళ్లి కూర్చోమను.. కొట్టబోయి దెబ్బ తగిలించుకున్న రేవంత్

  |

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ మరింత వాడివేడీగా సాగుతోంది. నామినేషన్లతో మొదలైన రచ్చ టాస్క్ లలో కొనసాగుతోంది. ఇప్పుడు బిగ్ బాస్త తెలుగు 6 తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్ లో విపరీతమైన అగ్రెషన్ తో ఆడుతున్నారు రెడ్ టీమ్ సభ్యులు. ఈ గేమ్ కాస్తా పర్సనల్ గా వెళ్లినట్లు తెలుస్తోంది. ఎదుటివాళ్ల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు. ఇలా పలు రకాల ఆసక్తికర కంటెంట్ తో నవంబర్ 3 గురువారం ఎపిసోడ్ సాగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. ఈ ప్రోమో వివరాళ్లోకి వెళితే..

  ఇనయాను టార్గెట్..

  ఇనయాను టార్గెట్..

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఎనిమిదో వారం అనూహ్యంగా ఆర్జే సూర్య ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. సూర్య ఎలిమినేట్ కావడంతో ఇనయా సుల్తానా తెగ బాధపడిపోతోంది. అయితే మిగతా హౌజ్ మేట్స్ మాత్రం సూర్య వెళ్లిపోవడానికి కారణం ఇనయాని నామినేషన్లలో టార్గెట్ చేశారు. ఇదిలా ఉంటే సూర్య ప్లేట్ లోనే ఇనయా భోజనం చేస్తుంది. ఇది తెలిసి ఆ ప్లేట్ పైన ఉన్న సూర్య పేరును తీసేసింది శ్రీ సత్య.

  సూర్య పేరును చెరిపేసిన శ్రీ సత్య..

  సూర్య పేరును చెరిపేసిన శ్రీ సత్య..

  మిషన్ పాసిబుల్ టాస్క్ లో భాగంగా బేటాన్ గేమ్ ఆడే క్రమంలో శ్రీహాన్ ను.. నువ్ ఎక్కడెక్కడ పడుకుని కంటెంట్ ఇస్తున్నావో తెలుసులే అని అంది ఇనయా. అంటే ఇన్ డెరెక్ట్ గా శ్రీహాన్, శ్రీ సత్య కలిసిపడుకుంటున్నారని వచ్చే అర్థంలో నోరు జారింది ఇనయా. దీంతో తెగ ఫీల్ అయిన శ్రీ సత్య.. ఇనయాపై కోపంతో ప్లేట్ పై సూర్య పేరును చెరిపేసింది. దీని గురించి నవంబర్ 2 నాటి 60వ ఎపిసోడ్ లో కూడా చర్చించారు.

  సూర్య ప్లేటు వాడుతున్నా కదా..

  సూర్య ప్లేటు వాడుతున్నా కదా..

  ఇప్పుడు నవంబర్ 3 నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో సూర్య ప్లేటు ఎక్కడుంది అనుకుంటూ వెతుకుతుంది. ఎవరి దగ్గరైనా సూర్య ప్లేటు ఉంటే ఇవ్వండని అడిగింది. దానికి బాలాదిత్య.. సూర్య ప్లేటుపై పేరును చెరిపేశారు అని చెబుతాడు. దీంతో నేను సూర్య ప్లేటు వాడుతున్నా అని తెలుసు కదా అని ఇనయా అంటే.. అందుకే చెరిపేశారని బాలాదిత్య సమాధానం ఇచ్చాడు. దీంతో కోపంతో ఊగిపోయింది ఇనయా.

  ఇనయాను బతిమిలాడిన సభ్యులు..

  ఇనయాను బతిమిలాడిన సభ్యులు..

  బాలాదిత్య అలా చెప్పడాన్ని తప్పుబట్టాడు రేవంత్. శ్రీ సత్యే తనకు చెప్పిందని బాలాదిత్య అన్నాడు. ఇనయా గొడవపడుతుంటే అందులోకి శ్రీహాన్ ఎంటరయ్యాడు. రాత్రి ఇనయా అన్నం తినకపోవడం గురించి డిస్కషన్ జరిగింది. ఫైమా వచ్చి తిందామంటే ఆకలి లేదని చెప్పావ్ అని శ్రీహాన్ అన్నాడు. దానికి అవునని చెప్పింది. దీని తర్వాత ఓ మూలకు వెళ్లి కూర్చున్న ఇనయాను అన్నం తినమని బాలాదిత్య, మెరీనా, కీర్తి బతిమిలాడారు.

  సూర్య ఇంటికెళ్లి కూర్చోమను..

  సూర్య ఇంటికెళ్లి కూర్చోమను..


  ఫైమా కూడా వచ్చి బతిమిలాడితే నువ్ మీ బ్యాచ్ తో ఉండు.. నువ్ వెళ్లు అని ఇనయా అంది. దీనికి నేను నీ ఫ్రెండ్ కాదనుకుంటే చెప్పు వెళ్లిపోతా అని ఫైమా అంటే కాదని చెప్పేసింది ఇనయా దీంతో ఫైమా వెళ్లిపోయింది. మరోవైపు అంత ప్రేముంటే ఎలిమినేషన్ తీసుకుని వెళ్లిపోయి సూర్య ఇంటికెళ్లి కూర్చోమను అని శ్రీ సత్య అంది. తర్వాత వాష్ రూమ్ కి వెళ్లిన ఇనయాకు ఆమె దుస్తులు కిందపడి ఉండటం చూసి కోపం తెచ్చుకుంది.

  ఆదిరెడ్డికి, శ్రీ సత్యకు వాగ్వాదం..

  వాష్ రూమ్ వరెస్ట్ గా ఉంది. ఎవరు చేశారంటూ ఇనయా గట్టిగా అరిచింది. తర్వాత మీ వాళ్లే అంటూ శ్రీ సత్యపై అరిచాడు ఆదిరెడ్డి. ఇక్కడ ఆదిరెడ్డికి, శ్రీ సత్యకు వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత బ్లూ టీమ్, రెడ్ టీమ్ ఎదురెదురుగా నిల్చుని స్ట్రిప్స్ లాక్కోవడం కోసం ప్రయత్నించారు. రేవంత్ ఎదుటివారికి గట్టిగా తాకేలా చేయి లేపాడు. దీంతో ఆదిరెడ్డి బ్రో అలా వద్దు అని చెప్పాడు. దీనికి నాకు చెప్పే రైట్ నీకు లేదని రేవంత్ రూడ్ గా మాట్లాడాడు. తర్వాత ఎవరినో కొడదామని చూసిన రేవంత్ కే దెబ్బ తగిలింది. ఎవరి గోళ్లు తాకాయి అంటూ ఫైర్ అయ్యాడు రేవంత్.

  English summary
  Bigg Boss Telugu 6 Season Sri Satya Shocking Comments On Inaya Sultana About Surya In November 2nd Episode Latest Promo
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X