Don't Miss!
- News
మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Finance
High Tax: ఆ ఇన్వెస్టర్లకు ఝలక్.. టాక్స్ రేటు 5 నుంచి 20 శాతానికి పెంపు.. ఎప్పటి నుంచంటే..
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6: శ్రీ సత్య ఎమోషనల్ స్టోరీ.. ఏడిపించేసిన బిగ్ బాస్!
బిగ్ బాస్ లో ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లోకి వెళ్లడానికి కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా సీరియస్ గా గేమ్ ఆడుతున్నారు. అనిపిస్తుంది ఏమాత్రం పట్టు విడవకుండా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ క్రమంలో ప్రతి ఒక్కరి బిగ్ బాస్ జర్నీని కూడా షోలో హైలెట్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం టాప్ 5 లో ఎవరు ఉంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక శ్రీ సత్య ఎమోషనల్ జర్నీ కూడా బిగ్ బాస్ మరోసారి గుర్తు చేస్తూ ఆమెకు కన్నీళ్లు వచ్చేలా చేసాడు.
అంతేకాకుండా ఎంతో స్ఫూర్తిని నింపుతూ స్పెషల్ గా విషెస్ కూడా అందించాడు. బిగ్ బాస్ ఇచ్చిన సర్ ప్రైజ్ చూసి శ్రీ సత్య కూడా ఎంతగానో సంతోషించింది. ఆమె గతంలో అల్లరిగా తిరిగిన ఫోటోలను కూడా గార్డెన్ ఏరియాలో ఉంచారు. ఇక ఏంటి బిగ్ బాస్ ఈ ఫోటోలు అంటూ శ్రీ సత్య నవ్వుకుంది. ఇక ఆమెకు ప్రత్యేకంగా ఫోన్ కాల్ కూడా వచ్చింది. వారి తల్లిదండ్రుల నుంచి ఫోన్ కాల్ రావడంతో శ్రీ సత్య బాగా ఏడ్చింది.

నిన్ను చాలా బాగా మిస్ అవుతున్నాను కొంచెం దూరంలోనే ఫైనల్స్ కప్ ఉంది. అది నువ్వు తప్పకుండా గెలుచుకొని రావాలి అని మేము మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని చెప్పడంతో శ్రీ సత్య ఎమోషనల్ అయింది. ఇక బిగ్ బాస్ శ్రీ సత్య గురించి చెబుతూ మీరు ఈ హౌస్ లోకి వచ్చినప్పుడు ఎన్నో బయాలు చూశారు. ఎవరికి ఎంత దగ్గరవ్వాలో తెలియని సంకోచ స్థితిలో మొదట మీరు కనిపించారు. ఇక మీ అమ్మ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి మీరు వచ్చిన కారణం గుర్తొచ్చాయి.
An emotional recap for Sri Satya!
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) December 12, 2022
Watch tonight's episode of Bigg Boss on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/MghpeIUrsk
ఒంటరితనం అడ్డుగా మార్చుకున్న మీకు మీలోని మరో కోణాన్ని తట్టే ఇద్దరు స్నేహితులు దొరికి ఈ ప్రయాణాన్ని మీకు కాస్త సులువు చేశారు.. అనడంతో శ్రీ సత్య కూడా అవును బిగ్ బాస్ అని చెప్పింది. భుజాలపై బరువును పెంచితే అది చిరునవ్వు మోస్తూ ముందుకు కదిలి సత్తవ చూపించడమే మనిషి మొదటి విజయం. కష్టం వచ్చినప్పుడు పారిపోవడం ఎదుర్కోవడం రెండు దారులు ఉంటాయి. మీరు ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవడాన్ని ఎంచుకున్నారు. ఇలాగే ముందుకు వెళ్లాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అని బిగ్ బాస్ తెలియజేశారు. మరి శ్రీ సత్య ఈ స్ఫూర్తితో ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.