Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Bigg Boss Telugu 6: శ్రీహన్ గొప్పతనంపై బిగ్ బాస్ పవర్ఫుల్ కామెంట్స్.. ఆ మాటలకు ఏడ్చేసిన శ్రీహన్
బిగ్ బాస్ సీజన్ 6 ఆఖరి వారం కూడా విభిన్నమైన అంశాలతో హైలైట్ గా నిలుస్తోంది. అయితే గతవారం కంటే ఈసారి అంత ఆసక్తిగా ఏమీ లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ ఎక్కువగా కంటెస్టెంట్స్ కు సంబంధించిన లైఫ్ జర్నీని హైలెట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు శ్రీహన్ కూడా తన వందరోజుల జరిగిన జర్నీని బిగ్ బాస్ హౌస్ లో చూసుకున్నాడు. అతను కొంత ఎమోషనల్ కూడా అయ్యాడు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ ప్రయాణంలో
బిగ్ బాస్ మాట్లాడుతూ.. శ్రీహాన్.. బిగ్ బాస్ ప్రయాణంలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో ఆట కోసం గెలుపు కోసం సభ్యులు పడే తపన ఎలాంటిదో మునుపటి సీజన్లో దగ్గర నుంచి చూశారు. ఈసారి స్వయంగా అనుభవాన్ని పొందేందుకు ఇంట్లోకి అడుగు పెట్టారు. మీరు తోటి ఇంటి సభ్యుని కోసం నిలబడిన తీరు స్నేహానికి మీరు ఇచ్చే విలువను తెలుపుతుంది.

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో
ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో.. తెలిసిన శ్రీహాన్ తన స్నేహితుల కోసం తగ్గారు. ఆట ఎలా ఆడాలో తెలుసుకుని అదే స్నేహితులతో పోటీపడి టికెట్ టూ ఫినాలేలో నెగ్గారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మీరు ఒక సేఫ్ ప్లేయర్ అనిపించినా వారి మాటలకు మీ ఆటతో సమాధానం చెప్పారు. ఎత్తు పల్లాలతో సాగే ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు బిగ్ బాస్ విన్నారు.

శ్రీహన్ కంటతడి
ఇంట్లో వారితో మాట్లాడితే వచ్చే బలం ఎంతో తెలిసిన ఆ అవకాశాన్ని తోటి సభ్యులకు వదిలేసుకున్నారు. పట్టుకోవడంలోనే కాదు వదిలేయడంలోనూ బలం ఉంటుంది. నీ బలాన్ని వినోదాన్ని పట్టుదలను ఇలాగే కొనసాగిస్తూ మీరు అనుకున్నవన్నీ సాధించాలని బిగ్ బాస్ ఆశిస్తున్నారు.. అనే బిగ్ బాస్ వివరణ ఇవ్వడంతో మధ్య మధ్యలో శ్రీహాన్ అయితే కంటతడి పెట్టుకున్నాడు.

సిరి కోసమైనా..
ఇక బిగ్ బాస్ ఇచ్చిన వివరణకు అతను ఐ లవ్ యు చెప్పేసాడు. తప్పకుండా ఈ ఆటలో విజయం సాధిస్తానని కూడా ధీమాగా కనిపించాడు. ఇక శ్రీహన్ టిక్కెట్ టూ ఫినాలే ద్వారా డైరెక్ట్ గా ఫైనల్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అతను ఫైనల్స్ లో గెలుస్తాడా లేదా అనేది ఆసక్తిగా మారింది. అతని ప్రియురాలు సిరి గత సీజన్లో బాగానే పోరాడింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆటలో నువ్వు గెలవాలి అని ఇదివరకే సిరి చెప్పింది. దీంతో శ్రీహాన్ తన కోసమైనా ఈ ఆట గెలవాలి అనే పట్టుదలతో ఉన్నాడు.
|
శ్రీహన్ కు పోటీగా..
అయితే శ్రీహన్ కు పోటీగా సింగర్ రేవంత్ ఉన్న విషయం తెలిసిందే. తప్పకుండా అతను ఫైనల్స్ లో ఎవరో ఒకరికి పోటీగా నిలుస్తాడు అని అర్థమయిపోయింది. అయితే రేవంత్ ను ఎదుర్కోవడం చాలా కష్టమైన టాస్క్. ఇక శ్రీహన్ మిగతా ఇంటి సభ్యులతో బలంగా పోరాడా రేవంత్ తో పోరాడాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ అంటూ రోహిత్ పేరు కూడా వినిపిస్తోంది. మరి శ్రీహన్ ఆ బలమైన పోటీదారులపై ఎలా నెగ్గుతాడో చూడాలి.