For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Winner: చాలా బాధ పడ్డాను.. నా వాళ్లే అలా అంటూ షాకింగ్ గా రేవంత్ కామెంట్స్

  |

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. 21 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయిన బిగ్ బాస్ హౌజ్ లో మొదటి నుంచి సింగర్ రేవంత్ టైటిల్ ఫేవరెట్ గా నిలిచాడు. అలాగే అందరూ ఊహించిన విధంగానే టైటిల్ విజేతగా నిలిచి బగ్ బాస్ తెలుగు 6 సీజన్ ట్రోఫీ అందుకున్నాడు. గోల్డెన్ బ్రీఫ్ కేస్, డబ్బు అంటూ నాటకీయ పరిణామాల వద్ద ఫైనల్ గా రేవంత్ ను విన్నర్ గా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. ఇదిలా ఉంటే షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తాడన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా విన్నర్ అయిన రేవంత్ ను ఇంటర్వ్యూ చేశాడు యాంకర్ శివ.

  ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో..

  ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో..

  బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినట్ అయిన ఇంటి సభ్యులను బీబీ కేఫ్ ద్వారా నాన్ స్టాప్ సీజన్ కంటెస్టెంట్, యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తాడన్న విషయం తెలిసిందే. కానీ, డిసెంబర్ 18 ఆదివారంతో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ముగిసింది. దీంతో ఈ ఆరో సీజన్ విన్నర్ గా నిలిచిన సింగర్ రేవంత్ ను తాజాగా ఇంటర్వ్యూ చేశాడు యాంకర్ శివ. బీబీ కేఫ్ కి హాజరైన రేవంత్ ను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు శివ.

  అప్పుడు నీ ఫీలింగ్ ఏంటీ..

  అప్పుడు నీ ఫీలింగ్ ఏంటీ..

  బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ రేవంత్.. అంటూ అతనికి స్వాగతం పలికాడు యాంకర్ శివ. బిగ్ బాస్ ఆరో సీజన్ టైటిల్ ట్రోఫీతో పాటు ఎంట్రీ ఇచ్చిన రేవంత్.. యాంకర్ శివతో కలిసి చిరంజీవి బాసు పార్టీ పాటకు స్టెప్పులేశాడు. రేవంత్ బ్రో.. కంగ్రాచ్యులేషన్ అని యాంకర్ శివ చెబితే.. థ్యాంక్యూ డార్లింగ్ అంటూ చేతులతో నమస్కరించాడు రేవంత్. బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్.. ఎలా ఉంది అసలు.. టైటిల్ నీ చేతిలో పెట్టినప్పుడు కానీ, చేయిని ఇలా పైకి లేపినప్పుడు కానీ నీ ఫీలింగ్ ఏంటీ అని యాంకర్ శివ అడిగాడు.

  నా దృష్టిలో మ్యాటర్ కాదు..

  నా దృష్టిలో మ్యాటర్ కాదు..

  ఏం జరిగింది.. ఎలా జరిగింది.. ఎలా వచ్చింది.. అన్నది నా దృష్టిలో మ్యాటర్ కాదు.. నేను టైటిల్ గెలుచుకున్నాను.. టైటిల్ నా చేతిలో ఉంది. పేరు సంపాదిస్తే డబ్బు ఆటోమాటిక్ గా సంపాదించొచ్చు అని రేవంత్ అన్నాడు. తన కోపమే తనకు శత్రువు అంటారు.. నీకు మాత్రం ఆ కోపం మిత్రుడు అయింది అని యాంకర్ శివ అన్నాడు.

  నేను ఎలా ఉన్నానో అలేగా ఉన్నా..

  నేను ఎలా ఉన్నానో అలేగా ఉన్నా..

  శివ అడిగిన దానికి ఈ 105 రోజుల్లో కోపం వచ్చినప్పుడు కోపం, ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ.. ఎలా ఉండాలో అలాగే ఉన్నాను తప్పా.. నేనైతే నా క్యారెక్టర్ ను మార్చుకోలేదు. జనం కోసం ఒక అమ్మాయిని పొగడాలి. జనం కోసం ఒక అమ్మాయికి స్టాండ్ తీసుకోవాలి. జనం కోసం ఇలా ఉండాలని చెప్పేసి ఏనాడు చేయలేదు. ఎందుకంటే నేను ఎలా ఉన్నానో అలేగా ఉన్నా కాబట్టి నేను ఇంతదూరం వరకు వచ్చానని నమ్మకం నాకుంది అని రేవంత్ చెప్పాడు.

  నెగెటివ్స్ ని కూడా పాజిటివ్ గా మలుచుకున్నానో..

  నెగెటివ్స్ ని కూడా పాజిటివ్ గా మలుచుకున్నానో..

  అందరు మిమ్మల్ని టార్గెట్ చేశారు. అందరూ మిమ్మల్ని మాటలు అన్నారు. మీరు ఎలా తీసుకున్నారు బ్రో అని యాంకర్ శివ అడిగాడు. నా బ్యాడ్ లక్ ఏంటంటే.. నావాళ్లు అని అనుకుంటానో.. వాళ్లు కూడా వీళ్లతోపాటు ఒక మాట కలిపినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది.. చాలా బాధ అనిపించింది. అందరూ కూడా ఏంటంటే.. ఎవరి సందర్భం వచ్చినప్పుడు వాళ్ల పాజిటివ్స్ మాత్రమే ఎలివేట్ చేసుకున్నారు. కానీ, ఎప్పుడైతే నెగెటివ్స్ తీసుకుని.. ఆ నెగెటివ్స్ ని కూడా ఎప్పుడైతే పాజిటివ్ గా మలుచుకున్నానో చూడండి.. అదే కారణం నేను విన్నర్ అనడానికి అని రేవంత్ చెప్పాడు.

  ఎవ్వరైనా రానీ.. తగ్గేదేలే..

  ఎవ్వరైనా రానీ.. తగ్గేదేలే..

  అనంతరం బీబీ కేఫ్ లో రేవంత్ విన్నింగ్ సెలబ్రేషన్స్ చేశారు. కేక్ కట్ చేసి యాంకర్ శివకు తినిపించాడు రేవంత్. చివర్లో ఎవ్వరైనా రానీ.. ఏమైనా అనని.. తగ్గేదేలే అని డైలాగ్ కొట్టాడు సింగర్ రేవంత్. ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోకి.. 21 మంది కంటెస్టెంట్లుగా కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఇనయా సుల్తానా, అరోహీ రావు, రేవంత్ ఎంట్రీ ఇచ్చారు.

  English summary
  Bigg Boss Telugu 6th Season Title Winner Singer Revanth Interview With Anchor Shiva In BB Cafe.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X