Don't Miss!
- News
తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం: వీడియో వైరల్, టీటీడీ ఏమందంటే.?
- Finance
wipro: అప్పుడు వెయిట్ చెయ్యమన్న విప్రో.. ఇప్పుడు వేటు వేసింది..
- Sports
ఆస్ట్రేలియా క్రికెటర్ వివాహేతర సంబంధం.. చెంపలు వాయించిన ప్రేయసి!
- Lifestyle
పీరియడ్స్ మిస్ అయ్యింది, కానీ నెగెటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్: కారణాలను ఏంటో ఇక్కడ తెలుసుకోండి
- Automobiles
సాధారణ ప్రజలనే కాదు కంపెనీ చైర్మన్ మనసు కూడా దోచేసిన Hero Vida.. స్కూటర్ డెలివరీ ఫొటోస్
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
- Technology
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
Bigg Boss Telugu 6: ఒకప్పుడు సుమ రేంజ్ లో ఆకట్టుకున్న యాంకర్.. ఆమె కోసం బిగ్గెస్ట్ ఆఫర్?
బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అలాగే టెలివిజన్ రంగంలో కూడా చాలా బిజీగా మారిపోయారు. ఇక రాబోయే సీజన్ లో మరి కొంతమంది ఊహించని విధంగా టెలివిజన్ సెలబ్రిటీలు రాబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంతగానో క్రేజ్ అందుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆరో సీజన్ కోసం ప్రణాళికలు మొదలు పెట్టింది. ఇప్పటికే కొంతమంది పేర్లను కూడా ఫైనల్ లిస్టులో చేర్చారు. ఇక మరొక ప్రముఖ మాజీ యాంకర్ కోసం ఎక్కువగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

టెంప్ట్ చేసే ప్రయత్నం
బిగ్ బాస్ ద్వారా క్రేజ్ తో పాటు మంచి ఆదాయం కూడా దక్కుతుంది అని చాలామంది టెలివిజన్ నటులు అలాగే సినీ ప్రముఖులు కూడా బిగ్ బాస్ లోకి రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం వ్యక్తిగత గౌరవానికి భంగం కలుగుతుంది అనే ఆలోచనతో ఇటువైపు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వారిని బిగ్ బాస్ మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్ తో టెంప్ట్ చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటుంది.

ఎక్కువగా టెలివిజన్ సెలబ్రెటీలు
ఇక రాబోయే రోజుల్లో బిగ్ బాస్ ఆరో సీజన్ మొదలుకానుంది. ఇక ప్రస్తుతం నిర్వాహకులు అందుకు సంబంధించిన ప్రణాళికలను కూడా సిద్ధం చేశారు. బిగ్ బాస్ ఆరో సీజన్ సెప్టెంబర్ లో మొదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీల పేర్లను కూడా ఫైనల్ చేశారు. మరికొంత మంది ప్రముఖ టెలివిజన్ సెలబ్రెటీలతో కూడా నిత్యం చర్చలు జరుపుతూనే ఉన్నారు. రేపు మాపో వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఆమె కోసం చర్చలు
అయితే రీసెంట్ గా బిగ్ బాస్ నిర్వాకులు ఒక ప్రముఖ మాజీ యాంకర్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు ఆమె ప్రస్తుతం ఉన్న సుమ కంటే ఎక్కువ స్థాయిలోనే గుర్తింపు అందుకున్నారు. తెలుగులో టెలివిజన్ రంగంలోనే కాకుండా అనేక రకాల సినిమా ఈవెంట్స్ లలో కూడా పాల్గొని మంచి క్రేజ్ అందుకున్నారు. ఆమె కోసం బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పుడు మళ్లీ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఉదయభాను రీ ఎంట్రీ?
ఆ ప్రముఖ యాంకర్ మరెవరో కాదు. ఉదయభాను అని సమాచారం. ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ యాసలో చాలాసార్లు ఆమె కొన్ని సింగింగ్ షోలలో కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు. తన హావభావాలతో మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఉదయభాను టెలివిజన్ రంగంలో జనాలకు బాగా దగ్గరయింది.

ఫ్యామిలీ కారణంగా
అయితే పెళ్లి తర్వాత కూడా టెలివిజన్ రంగంలో కొనసాగినప్పటికీ ఆ తర్వాత ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వడంతో పూర్తిగా టెలివిజన్ రంగంలోకి దూరంగా ఉన్నారు. ఆ మధ్యలో హఠాత్తుగా రానా లీడర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే ఆ తర్వాత కొన్ని టెలివిజన్ షోలు చేసినప్పటికీ ఎక్కువ కాలం నిలవలేకపోయారు.

ఉదయభాను కోసం బిగ్గెస్ట్ ఆఫర్?
బిగ్ బాస్ నిర్వాహకులు గత సీజన్స్ కోసం ఉదయభాను కోసం సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా ఆమె ఎందుకు ఒప్పుకోలేదు. ఇక ఈసారి మాత్రం ఆమెను ఒప్పించాలి అని నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకి ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వని స్థాయిలో పారితోషకం కూడా ఇవ్వడానికి డిసైడ్ అయినట్లు సమాచారం. మరి వారి ఆఫర్స్ కు ఉదయభాను ఒప్పుకుంటుందో లేదో చూడాలి.