Don't Miss!
- News
ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ సంచలనం: కేంద్రానికి సవాల్, అరవింద్‌కు హెచ్చరిక
- Sports
INDvsNZ : టీ20ల్లో గిల్ కథేం బాగలేదు.. పెదవి విరిచిన మాజీ దిగ్గజం
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Bigg Boss 6 Winner: కూతురిని మొదటిసారి అలా చూసేసరికి తట్టుకోలేకపోయిన రేవంత్.. వీడియో వైరల్
బిగ్ బాస్ 6వ సీజన్ విజేత రేవంత్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఈ సీజన్ మొత్తంలో కూడా అతను అత్యధిక స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ వదులుకోవద్దు అని ఎన్ని లక్షల ఆఫర్ ఇచ్చిన కూడా అతను టెంప్ట్ కాలేదు. బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు కూడా అందరికీ రేవంత్ గెలుస్తాడు అని ఒక నమ్మకం అయితే ఏర్పడింది.
ఇక ఫైనల్ ఎపిసోడ్లో అతనికి పోటీగా శ్రీహాన్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా నిలబడ్డాడు. తప్పకుండా ట్రోఫీ గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేశాడు. మధ్యలో నాగార్జున వచ్చి మొదట 20 లక్షలు ఇస్తాను అని ఆ తర్వాత 30 లక్షలు, ఆ తర్వాత 40 లక్షల కూడా ఆఫర్ చేస్తాను అని చెప్పినప్పటికీ కూడా అతను ఎంత మాత్రం లొంగలేదు. టైటిల్ తనకు కావాలి అనే లక్ష్యంతో వచ్చాను అని అన్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ టైటిల్ ను తన కూతురికి కానుకగా ఇవ్వాలని కూడా కోరుకున్నాడు.

అందుకే శ్రీహాన్ 40 లక్షల తీసుకొని సేఫ్ అయినప్పటికీ రేవంత్ అయితే టైటిల్ తీసుకొని ఎంతో సంతోషంగా కొనసాగుతున్నాడు. అయితే అతనికి సంబంధించిన ఒక ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేవంత్ హౌస్ లో ఉన్నప్పుడే అతని భార్యకు డెలివరీ అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మహాలక్ష్మి పుట్టింది అని వార్త రావడంతో అతను అప్పుడే ఎంతగానో సంతోషించాడు.
ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను తన కూతురిని మొదటిసారి చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు. మొదట కళ్లకు గంతలు కట్టి పాపను అతని ముందుకు తీసుకువచ్చారు. ఇక ఆ పాపను చూడగానే రేవంత్ చాలా ఎమోషనల్ అయినట్లు అనిపించింది. అంతేకాకుండా తన బిగ్ బాస్ ట్రోపిని పాపకు గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు. ఇక రేవంత్ తన కూతురికి ఏం పేరు పెట్టాడు అని ఫ్యాన్ ఫాలోవర్స్ అడుగుతున్నారు. మరి రేవంత్ ఏం పేరు పెడతాడో చూడాలి.