For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 7: బిగ్ బాస్ భారీ ప్లాన్.. షాకింగ్ గా లీక్స్.. స్టార్ యాంకర్ తో మంతనాలు!

  |

  బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను మిగతా భాషల్లోకి కూడా తీసుకొచ్చారు. ఇక ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన తెలుగులో 2017లో ప్రారంభమైన ఈ రియాలిటీ షో మంచి విజయం సాధించింది. ఇక అప్పటినుంచి వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు బీబీ నిర్వాహకులు. ఇక ఇటీవల పూర్తి అయిన ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ కాగా రాబోయే ఏడో సోజన్ ను సూపర్ హిట్ చేసేందుకు పావులు కదుపుతోంది బీబీ మేనేజ్ మెంట్. దీనికి సంబంధించిన ఒక న్యూస్ తాజాగా లీక్ అయింది.

  ఎలాంటి అంచనాలు లేకుండా..

  ఎలాంటి అంచనాలు లేకుండా..

  ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చినా.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న షో బిగ్ బాస్. అందుకే నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. ఇవన్నీ భారీ రేటింగ్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్‌లుగా రికార్డులు సాధించాయి.

  ట్రోఫి అందుకోవడంతో..

  ట్రోఫి అందుకోవడంతో..


  తెలుగులో ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు భారీ సక్సెస్ అవడంతో బిగ్ బాస్ నిర్వహకులు ఇటీవలే ఆరో దానిని నడిపించారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. ఎన్నో ట్విస్టులు, అనుకోని సంఘటనలు, ఊహించన పరిణామాలతో సాగిన ఆరో సీజన్ ఫినాలేలో ప్రైజ్ మనీ ఒకరికి, ట్రోఫి మరొకరికి సొంతమైంది. సింగర్ రేవంత్ ట్రోఫిని అందుకోవడంతో అతనే విజేతగా నిలిచాడు.

  రాజకీయ ప్రలోభాలు..

  రాజకీయ ప్రలోభాలు..

  బిగ్ బాస్ షో తెలుగులో ఎంతటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. కానీ, ఆరో సీజన్ మాత్రం అందుకు భిన్నంగా చాలా నిరుత్సాహపరించింది. ప్రేక్షకులనే కాకుండా బీబీ లవర్స్ ను కూడా ఆకట్టుకోకుండా ఈసారి ఫేక్ ఎలిమినేషన్స్, రాజకీయ ప్రలోభాలు కూడా ఉండటంతో నిజాయతీగా ఆడిన కొంతమంది కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగిందన్న విమర్శలు ఎక్కువగా తలెత్తాయి. అందుకే ఈ సీజన్ కు రేటింగ్ బాగా పడిపోయిందని టాక్.

  హోస్టింగ్ నుంచి తప్పుకున్నట్లు..

  హోస్టింగ్ నుంచి తప్పుకున్నట్లు..

  ఆరో సీజన్ కు రేటింక్ భారీగా పడిపోయి అట్టర్ ఫ్లాప్ సీజన్ గా రికార్డ్ కెక్కడం, విమర్శలు, తదితర కారణాలతో హోస్టింగ్ బాధ్యతల నుంచి నాగార్జున తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు హోస్ట్ గా యంగ్ హీరో రానా దగ్గుబాటి రానున్నాడని టాక్ వినిపిస్తోంది. రానా దగ్గుబాటి పేరును నాగార్జుననే రికమండ్ చేసినట్లు సమాచారం. అయితే రానాకు కొన్ని నెలలు సినిమాలకు దూరం కావడంతో హోస్ట్ గా చేసేందుకు ఒప్పుకున్నాడనే వార్త వైరల్ అవుతోంది.

  బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ రన్నరప్..

  బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ రన్నరప్..

  బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కోసం టాప్ కంటెస్టెంట్స్ ను వెతికే పనిలో పడిందట బీబీ టీమ్. అంతకుముందు సీజన్లలో ఉన్నట్లుగానే బెస్ట్ కంటెస్టెంట్స్ ను తీసుకోనున్నారట. అందులో భాగంగానే పాత సీజన్ రన్నరప్స్ ను కలిసి డీల్ సెట్ చేసుకుని పనిలో ఉందట బిగ్ బాస్ మేనేజ్ మెంట్. వీరిలో బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ రన్నరప్, స్టార్ యాంకర్ శ్రీముఖిని అప్రోచ్ అయిందని ఓ న్యూస్ లీక్ అయింది.

  ఒప్పుకోని శ్రీరామ చంద్ర..

  ఒప్పుకోని శ్రీరామ చంద్ర..

  స్టార్ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో తన ఆటతీరుతో ఎంత పేరు తెచ్చుకుందో తెలిసిందే. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు సమానమైన పోటీనిచ్చి చివరిగా రన్నరప్ గా మిగిలింది. మళ్లీ ఆమెను బీబీ 7కు తీసుకుంటే బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని శ్రీముఖితో బీబీ టీమ్ మంతనాలు జరుపుతోందట. అలాగే సింగర్ శ్రీరామ చంద్రను కూడా అడిగారని ఓ టాక్ వినిపించింది. అయితే అందుకు శ్రీరామ చంద్ర ఒప్పుకోలేదని తెలుస్తోంది. అతనితోపాటు బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ మిత్రా శర్మను కూడా బిగ్ బాస్ అప్రోచ్ అయిందని మరో వార్త లీక్ అయింది.

  జూలైలో ప్రారంభించాలని..

  జూలైలో ప్రారంభించాలని..

  బిగ్ బాస్ ఆరో సీజన్ డిజాస్టర్ కావడంతో ఏడో సీజన్ ను ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో బీబీ నిర్వాహకులు ఉన్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దీన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే దీన్ని వచ్చే ఏడాది జూలైలోనే మొదలు పెట్టాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు మరో వార్త సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది.

  English summary
  Bigg Boss Telugu 7 Season Team Approaching Bigg Boss Telugu 3 Runner Up Sreemukhi For Participating As Contestant.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X