For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 7: ఏడో సీజన్ లోకి ఆ యంగ్ హీరో.. బిగ్ బాస్ స్కెచ్ మాములుగా లేదుగా!

  |

  బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి కూడా తీసుకొచ్చారు. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో 2017లో ప్రారంభమైంది. తర్వాత వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు బీబీ నిర్వాహకులు.

  ఇటీవల ఆరో సీజన్ పూర్తి అయినప్పటికీ అట్టర్ ఫ్లాప్ గా 6వ సీజన్ పేరు తెచ్చుకుంది. దీంతో తర్వాత వచ్చే ఏడో సీజన్ ను సూపర్ హిట్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది బిగ్ బాస్ మేనేజ్ మెంట్. ఇందులో భాగంగానే ఒక యంగ్ హీరోను కంటెస్టెంట్ గా తీసుకోనుందట. ఆ వివరాల్లోకి వెళితే..

  భారీ రేటింగ్ తో..

  భారీ రేటింగ్ తో..

  ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చినా.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న షో బిగ్ బాస్. అందుకే నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. ఇవన్నీ భారీ రేటింగ్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్‌లుగా రికార్డులు సాధించాయి.

  ప్రైజ్ మనీ ఒకరిది.. ట్రోఫి మరొకరిది అన్నట్లుగా..

  ప్రైజ్ మనీ ఒకరిది.. ట్రోఫి మరొకరిది అన్నట్లుగా..

  తెలుగులో ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు భారీ సక్సెస్ అవడంతో బిగ్ బాస్ నిర్వహకులు ఇటీవలే ఆరో దానిని నడిపించారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. ఎన్నో ట్విస్టులతో, అనుకోని సంఘటనలతో సాగిన ఆరో సీజన్ ఫినాలేలో ప్రైజ్ మనీ ఒకరికి, ట్రోఫి మరొకరికి సొంతమైంది. ఇందులో సింగర్ రేవంత్ విజయం సాధించాడు.

  అట్టర్ ఫ్లాప్ గా ఆరో సీజన్..

  అట్టర్ ఫ్లాప్ గా ఆరో సీజన్..

  బిగ్ బాస్ షో తెలుగులో ఎంతటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. కానీ, ఆరో సీజన్ మాత్రం చాలా నిరాశజనకంగానే సాగింది. దీనికితోడు ఫేక్ ఎలిమినేషన్స్, రాజకీయ ప్రభావం కూడా పడటంతో కొంతమంది హానెస్ట్ కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగిందన్న విమర్శలు తలెత్తాయి. అందుకే దీనికి రేటింగ్ కూడా సరిగా రాలేదు. దీంతో ఈ ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ గా మారింది. అందువల్లే ఈ సీజన్ తర్వాత నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  కొన్ని నెలలు దూరం..

  కొన్ని నెలలు దూరం..

  హోస్ట్ గా నాగార్జున తప్పుకోవడంతో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు హోస్ట్ గా యంగ్ హీరో రానా దగ్గుబాటి రానున్నాడని టాక్ వినిపిస్తోంది. రానా దగ్గుబాటి పేరును నాగార్జుననే రికమండ్ చేసినట్లు సమాచారం. అయితే రానాకు ఒక సర్జరీ కారణంగా సినిమాలకు కొన్ని నెలలు దూరం కానున్నాడట. ఆ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వొచ్చన్న ఉద్దేశంతో రానా దగ్గుపాటి దాదాపుగా ఒప్పుకున్నాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

  ఎలాగైనా సక్సెస్ చేయాలని..

  ఎలాగైనా సక్సెస్ చేయాలని..

  బిగ్ బాస్ ఆరో సీజన్ డిజాస్టర్ కావడంతో ఏడో సీజన్ ను ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో బీబీ నిర్వాహకులు ఉన్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దీన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే దీన్ని వచ్చే ఏడాది జూలైలోనే మొదలు పెట్టాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు మరో వార్త సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది.

  ప్రెషర్ కుక్కర్ హీరోను..

  ప్రెషర్ కుక్కర్ హీరోను..

  బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కోసం టాప్ కంటెస్టెంట్స్ ను వెతికే పనిలో పడిందట బీబీ టీమ్. అంతకుముందు సీజన్ల మాదిరిగా బెస్ట్ కంటెస్టెంట్స్ ను తీసుకోనున్నారట. అందులో భాగంగానే యంగ్ హీరో సాయి రోనాక్ ను కంటెస్టెంట్ గా తీసుకునేందుకు అతన్ని బీబీ టీమ్ అప్రోచ్ అయినట్లు ఓ న్యూస్ లీకైంది. ప్రెషర్ కుక్కర్, ఛలో ప్రేమిద్దాం సినిమాల్లో హీరోగా నటించిన సాయి రోనాక్ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.

  మోడల్ రాజ్ కు సపోర్టింగ్ గా..

  మోడల్ రాజ్ కు సపోర్టింగ్ గా..

  ఇటీవల ఓటీటీలో విడుదలైన ఓదేల రైల్వే స్టేషన్ సినిమాలో సాయి రోనాక్ పోలీస్ గా నటించాడు. అంతేకాకుండా బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ మోడల్ రాజశేఖర్ కోసం స్టేజ్ పైకి కూడా సాయి రోనాక్ వచ్చి అతనికి సపోర్ట్ చేశాడు. యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే కెరీర్ ను మలుచుకుంటున్న సాయి రోనాక్ ను కంటెస్టెంట్ గా తీసుకుంటే సెలబ్రిటీ రియాలిటీ షోకి మంచి పేరు వస్తుందని బీబీ టీమ్ ఆలోచిస్తుందట. అయితే మరి బీబీ టీమ్ ఆఫర్ కు సాయి రోనాక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.

  English summary
  Bigg Boss Telugu 7 Season Team Approaching Hero Sai Ronak For Participating As Contestant.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X