Bigg Boss Elimination: బిగ్‌బాస్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఇంటి బయటకు టాప్ కంటెస్టెంట్!

బిగ్‌బాస్ తెలుగు 9 ఉత్కంఠగా సాగుతున్న సంగతి తెలిసిందే. మరో 48 గంటల్లో 7వ వారం పూర్తి చేసుకుని 8వ వారంలోకి అడుగుపెట్టనుంది. వీకెండ్ రాగానే అందరికీ ఎలిమినేషన్ భయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. లిస్ట్‌లో చాలామంది పేర్లు వినిపిస్తుండగా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇంతలోనే ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగడంతో కంటెస్టెంట్స్, ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే...

టాప్‌లో తనూజ
ఈ వారం ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. వారు రమ్య మోక్ష కంచర్ల, రీతూ చౌదరి, సాయి శ్రీనివాస్, దివ్య నిఖిత, తనూజ పుట్టస్వామి, రాము రాథోడ్, సంజన గల్రానీ, పవన్ కళ్యాణ్ పడాల ఉన్నారు. కెప్టెన్లుగా గెలిచిన సుమన్ శెట్టి, గౌరవ్‌ గుప్తాలు నామినేషన్స్‌లో లేని సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న జరుగుతున్న ఓటింగ్‌ను ఒకసారి పరిశీలిస్తే... తనూజ పుట్టస్వామి 37.46 శాతం ఓటింగ్‌తో ఎవ్వరూ అందుకోలేని రేంజ్‌లో దూసుకెళ్తోంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పడాల 20.42 శాతం, దివ్య నిఖిత 9.81 శాతం, రాము రాథోడ్ 8.86 శాతం, సంజన గల్రానీ 8.81 శాతం, రీతూ చౌదరి 6.49 శాతం, శ్రీనివాస్ సాయి 4.83 శాతం, రమ్య మోక్ష 3.31 శాతం ఓటింగ్ సాధించారు.

Bigg Boss Telugu 7th Week Elimination Ramu Rathod Frank Elimination goes viral

డేంజర్ జోన్‌లో రమ్య మోక్ష
దాంతో లీస్ట్ ఓటింగ్ సాధించిన శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష కంచర్లలు ఈ వారం హౌస్‌ను వీడుతారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న ఆయేషా జీనత్‌ని అనారోగ్య కారణాలతో బిగ్‌బాస్ హౌస్ నుంచి వాలంటరీ ఎలిమినేషన్ చేశారు. అందరూ ఆమె ట్రీట్ చేయించుకుని తిరిగి వస్తుందని భావించారు. కానీ ఫినాలే వీక్‌లో మళ్లీ కలుద్దామని చెప్పడంతో తన రీ ఎంట్రీ ఉండదని ఆయేషా కుండబద్ధలు కొట్టింది. వెళ్తూ వెళ్తూ తనూజకు జాగ్రత్తలు చెప్పి మరి వెళ్లింది ఆయేషా. అయితే వీటిని పక్కకునెట్టి బిగ్‌బాస్ షాకిచ్చాడు.

రాము రాథోడ్‌ని ఈడ్చుకెళ్లిన అమర్ - అర్జున్
హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుండగా మాజీ కంటెస్టెంట్స్ అమరదీప్ చౌదరి, అర్జున్ అంబటిలు పోలీస్ డ్రెస్‌లో వచ్చి రాము రాథోడ్‌ని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. దాంతో రాముతో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారు. అందరూ ఇదేదో ఫన్ క్రియేట్ చేయడానికి చేసుంటారనే అనుకున్నారు.. కానీ ఎంతకు అమర్, అర్జున్‌లు రామును వదలకపోవడంతో పాటు బిగ్‌బాస్ డోర్లు ఓపెన్ కావడంతో అందరూ టెన్షన్ పడ్డారు. అన్ని సర్దిసుకో, ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసుకో అని గట్టిగా చెప్పడంతో రాము ఎలిమినేషన్ అయిపోయినట్లేనని అతని ఫ్రెండ్స్ ఏడ్చేశారు. రాము బతిమలాడుతున్నప్పటికీ.. నిన్ను ఎలిమినేట్ చేసి బయటికు తీసుకురావడమే మా టాస్క్ అని చెప్పడంతో చేసేదేం లేక రాము బయటకు నడిచాడు.

ఫ్రాంక్ అంటూ ట్విస్ట్
దాంతో అమర్ దీప్, అర్జున్‌లు ఓ నవ్వు నవ్వేసి ఇదంతా ఫ్రాంక్ అని చెప్పడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు. రాము రాథోడ్ హౌస్‌ను వీడకపోవడంతో కంటెస్టెంట్స్ అంతా అతనిని హత్తుకున్నారు. ఓటింగ్ పరంగా డేంజర్ జోన్‌లో ఉన్నప్పటికీ రాము రాథోడ్ ఏదోరకంగా సేవ్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ అమర్, అర్జున్‌ల ఓవరాక్షన్‌తో కాసేపు అందరికీ ఫీజులు ఎగిరిపోయాయి. మొత్తానికి ఈ ఫ్రాంక్ ఎలిమినేషన్ ఎపిసోడ్ మాత్రం అందరికి మంచి వినోదాన్ని పంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X