Bigg Boss Telugu 9 1st Week Voting: బిగ్‌బాస్ తెలుగు 9 ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు టాప్ కంటెస్టెంట్లు!
తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్‌గా మొదలైంది. హోస్ట్ నాగార్జున అక్కినేని చేతుల మీదుగా కంటెస్టెంట్ల పరిచయంతో ఇంటిలోకి రకరకాల ట్విస్టులు, టాస్కుల మధ్య కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు అయ్యారు. అయితే ఇంటిలోకి వెళ్లిన తర్వాత తొలి రోజు నుంచి సభ్యుల మధ్య రచ్చ మొదలైంది. రకరకాల భావోద్వేగాలు కనిపించాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య మూడో రోజే నామినేషన్ల ప్రక్రియను ముగించారు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో ఎవరు నామినేట్ అయ్యారు? ఫస్ట్ డే ఓటింగ్ ఎలా జరుగుతున్నది? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు అనే వివరాల్లోకి వెళితే..
నామినేషన్ ప్రక్రియ పలు రకాల గేమ్స్‌తో సాగింది. అయితే చివరికి బిగ్‌బాస్ ఇంటిలో తొలివారం నామినేషన్‌కు గురైన వారిలో తనూజ గౌడ, ఫ్లోరా సైనీ,ఇమ్మాన్యుయేల్, శ్రష్టి వర్మ, రీతూ చౌదరీ, డెమాన్ పవన్, సంజన గల్రానీ, రాము రాథోడ్, సుమన్ శెట్టి ఉన్నారు. వీరందరూ నామినేషన్ ప్రక్రియను ముగించుకొని ఈ వారం ఎలిమినేట్ కావడానికి అవకాశం ఉన్న వారి జాబితాలో చేరారు.

నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత జియో హాట్‌స్టార్ యాప్‌లోను, టెలిఫోన్ కాల్స్ ద్వారా ఓటింగ్ జోరుగా కొనసాగుతున్నట్టు స్పష్టమైంది. ఈ ఓటింగ్‌లో ఆశ్చర్యకరమైన ఫలితాలు నమోదు అవుతున్నాయి. ఇంకా రెండు, మూడు రోజుల వ్యవధి ఉన్నందున్న ఈ పరిస్థితి తారుమారవ్వడానికి అవకాశం ఉంది అనే విషయం సోషల్ మీడియా ట్రెండ్స్ ద్వారా తెలుస్తున్నది.
తాజా ఓటింగ్ వివరాల్లోకి వెళితే.. అత్యథికంగా టెలివిజన్ సీరియల్ ఆర్టిస్ట్ తనూజ గౌడ టాప్‌లో కొనసాగుతున్నది. ఆమె అత్యధికంగా 7 వేలకుపైగా ఓట్లు రాగా, మొత్తం పోలైన ఓట్లలో 24 శాతం ఓట్లను సొంతం చేసుకొన్నది. ఇక సుమన్ శెట్టి 6 వేల ఓట్లు, 22 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో ఇమ్మాన్యుయల్‌కు 4500 ఓట్లు, నాలుగో స్థానంలో డీమాన్ పవన్‌కు 3 వేల ఓట్లు వచ్చాయి. సీనియర్ హీరోయిన్ సంజనా గల్రానీ 9 శాతం ఓటింగ్‌తో 2 వేలకుపైగా ఓట్లను సంపాదించుకొన్నారు.
అయితే అత్యల్పంగా ఓట్లు తెచ్చుకొన్న సెలబ్రిటీలలో రాము రాథోడ్, రీతూ చౌదరీ, ఫ్లోరా సైనీ, శ్రష్టి వర్మ ఉన్నారు. రాము రాథోడ్ 8 శాతం ఓట్లు, రీతూ చౌదరీ 7 శాతం ఓట్లు సంపాదించుకొన్నారు. ఇక ఫ్లోరా సైనీ 3 శాతం ఓట్లతో కేవలం 800 ఓట్లు, శ్రష్టి వర్మ 2 శాతం ఓట్లతో 500 ఓట్లకుపైగా తెచ్చుకొని డేంజర్ జోన్‌లో ఉన్నారు. రానున్న రోజుల్లో ఓటింగ్ మెరుగు పరచుకోకపోతే ఫ్లోరా సైనీ, శ్రష్టి వర్మ ఎలిమినేషన్ ఉచ్చులో చిక్కుకొనే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది.
అయితే తొలి వారం నామినేషన్ ప్రక్రియ అయితే ముగిసింది. కానీ ఎలిమినేషన్ ఉంటుందా? లేదా? అనే విషయంపై అనేక సందేహాలు ఉన్నాయి. తొలివారం వారం కాబట్టి ఎలిమినేషన్ వేటు వేయకుండా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అంతేకాకుండా తమ ఆట తీరును మెరుగు పరుచుకొనేందుకు కంటెస్టెంట్లకు అవకాశాన్నిఇచ్చే ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











