Bigg Boss Telugu 9: రీతూ చౌదరి వెన్నుపోటు.. కెప్టెన్సీ నుంచి సామాన్యుడిని పీకేసిన నాగార్జున

బిగ్‌బాస్ తెలుగు 9 మరో వీకెండ్‌కు చేరువైంది. వారాంతం అనగానే అందరికీ కింగ్ అక్కినేని నాగార్జునే గుర్తొస్తారు. బిగ్‌బాస్‌లో ఏ ఎపిసోడ్ మిస్ అయినా వీకెండ్ ఎపిసోడ్‌ని మాత్రం ప్రేక్షకులు మిస్ కారు. ఆ వారంలో జరిగిన తప్పుల్ని, ఆటని విశ్లేషించి కంటెస్టెంట్స్‌కి పనిష్మెంట్‌తో పాటు కాంప్లిమెంట్స్ ఇస్తారు నాగార్జున. కంటెస్టెంట్స్‌ని కడిగిపారేస్తూ వారికి క్లాస్‌ పీకుతుంటారు. తాజాగా వారం కూడా ఒక్కొక్కరి పని పట్టడానికి నాగ్ రెడీ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

హరిత హరీశ్‌కి క్లాస్‌
గత వారం భరణి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌పై హరిత హరీశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వారిద్దరూ మగాళ్లు కాదన్న అర్ధం వచ్చేలా హరీశ్ వ్యాఖ్యలు ఉండటంతో నాగార్జున గట్టిగా క్లాస్ పీకాడు. తాను ఆ ఉద్దేశంతో అనలేదని బుకాయించాలని చూసి నాగ్ వదిలిపెట్టలేదు. హరీష్ నోరుజారిన వీడియోను పలుమార్లు ప్లే చేసి అతని నోరు మూయంచారు. ఆడియన్స్, కంటెస్టెంట్స్ అంతా ముక్త కంఠంతో తప్పు నీదేనని చెప్పడంతో హరీశ్ తగ్గడంతో పాటు భరణి, ఇమ్మాన్యుయేల్‌కు క్షమాపణలు చెప్పాడు.

Bigg Boss Telugu 9 Akkineni Nagarjuna revoked Demon Pavan s captaincy

కెప్టెన్సీ టాస్క్‌పై విమర్శలు
మరోసారి వీకెండ్ కావడంతో ఈ వారం ఎవరికి పడబోతుందా అని ఎదురుచూసిన వారికి నాగార్జున షాకిచ్చాడు. ఈ వారం ఎక్కువ మంది విమర్శలు గుప్పించింది కెప్టెన్సీ టాస్క్ గురించే. రీతూ చౌదరి ఏకపక్షంగా వ్యవహరించి, రూల్స్ పక్కనపెట్టి డిమోన్ పవన్‌ని కెప్టెన్‌ని చేసింది. ఇమ్మాన్యుయేల్‌కి గెలిచే అవకాశం ఉన్నప్పటికీ అతనిని కాదని పవన్‌కే పట్టం కట్టింది రీతూ. ఫ్రెండ్ అయ్యుండి తనకు రీతూ అన్యాయం చేయడంపై ఇమ్మాన్యుయేల్ ఎంతో బాధపడ్డాడు.

డిమోన్ పవన్‌ చుట్టూనే
వీకెండ్ ఎపిసోడ్‌ కావడంతో నాగార్జున ఏఎన్ఆర్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడంతోనే కెప్టెన్ డిమోన్ పవన్‌కి ఇచ్చిపడేశారు కింగ్. అతనికి అభినందనలు చెప్పడిన ఆయన.. వెంటనే పవన్‌కి కెప్టెన్‌గా ఉండే అర్హత ఉందో లేదో చెప్పాలని నాగార్జున ప్రశ్నించారు. చేతులు పైకెత్తి మీ నిర్ణయం చెప్పాలని నాగ్ చెప్పడంతో.. ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను తెలియజేశారు. మేమంతా మాట్లాడాలని అనుకున్నప్పటికీ సంచాలక్ నిర్ణయమే ఫైనల్ కావడంతో సైలెంట్ అయిపోయామని అందరూ చెప్పారు.

వీడియోతో రీతూ కుట్ర బట్టబయలు
ఆ వెంటనే రీతూ చౌదరిని టార్గెట్ చేశారు నాగార్జున. వీడియోని ప్లే చేసి రీతూ బండారం బయటపెట్టాడు. ఈ దెబ్బతో పవన్, రీతూలు ఆ వీడియోని చూస్తూ సైలెంట్ అయిపోయారు. చివరికి చేసేదేం లేక తన తప్పుని ఒప్పుకున్నాడు డిమోన్ పవన్. అతను న్యాయంగా కెప్టెన్ కాలేదని అందరూ అంగీకరించారు. సంజన అయితే పవన్‌ని కెప్టెన్‌గా పీకేసి మరొకరిని నియమించాలని చెప్పింది. ఫైనల్‌గా రీతూ అభిప్రాయం తీసుకున్నారు నాగార్జున. నేను నిజాయితీగానే ఉన్నానని.. వాడిని గెలిపించాలని అనుకోలేదని బుకాయించే ప్రయత్నం చేసింది. ఆడియన్స్ కూడా రీతూతే తప్పని.. భరణి, ఇమ్మాన్యుయేల్‌లో ఒకరిని కెప్టెన్‌గా నియమించాలని కోరుకున్నారు.

Take a Poll

పవన్ కెప్టెన్సీ పీకేసిన నాగార్జున
అందరూ తాను కెప్టెన్ ఉండొద్దని తేల్చేయడంతో డిమోన్ పవన్ కూడా నాకు కెప్టెన్సీ వద్దని చెప్పేశాడు. దాంతో నాగార్జున .. నీ కెప్టెన్సీని క్యాన్సిల్ చేస్తున్నానని తన నిర్ణయం చెప్పాడు. కెప్టెన్ ఎలా అయినాసరే.. ఒకసారి కెప్టెన్ అయినవారిని పీకెయ్యడం అనేది బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి. దాంతో ఆడియన్స్, కంటెస్టెంట్స్ అంతా నాగార్జున నిర్ణయంతో షాక్ అయ్యారు. కెప్టెన్సీ కోసం మళ్లీ పోటీ పెడతామని.. ఈసారి కూడా రీతూ చౌదరే సంచాలక్‌గా ఉంటుందని నాగార్జున తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X