భరణి శంకర్ ఎలిమినేట్... బిగ్‌బాస్ తెలుగు 9లో టాప్ రెమ్యునరేషన్.. 6 వారాలకు ఎంతంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 ఊహించని మలుపులు తిరుగుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీదారుల రాకతో గేమ్ ఉత్కంఠగా మారింది. ఆదివారంతో బిగ్‌బాస్ తెలుగు 9 ఆరు వారాలు పూర్తి చేసుకోని 7వ వారంలోకి అడుగుపెట్టనుంది. ఆదివారం అంటేనే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. అక్కినేని నాగార్జున ఎంట్రీతో పాటు ఆ రోజు ఎలిమినేషన్ ఉండటమే ఇందుకు కారణం. మరి ఆరో వారంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వీక్ ఊహించని ఎలిమినేషన్ జరగబోతోందని చెబుతున్నారు.

6వ వారంలో ఆరుగురు నామినేట్
సోమవారం హౌస్‌లో నామినేషన్ల కార్యక్రమానికి బిగ్‌బాస్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కొత్తగా వచ్చిన ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులను మాత్రం నామినేషన్స్ నుంచి మినహాయించాడు. అయితే పాత కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేసే పవర్ మాత్రం వీరికే ఇచ్చారు. దాంతో 6వ వారం బిగ్‌బాస్ తెలుగులో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారు దివ్య నిఖిత, పవన్ డిమోన్, భరణి శకంర్, రాము రాథోడ్, తనూజ పుట్టస్వామి, సుమన్ శెట్టి.

Bigg Boss Telugu 9 Bharani Shankar Remuneration for 6 weeks in BB House Here is the details

ఓటింగ్ తారుమారు
అయితే నామినేషన్స్‌లోకి వచ్చినప్పటి నుంచి ఓటింగ్ అనూహ్యంగా మలుపులు తిరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్‌ను బట్టి శనివారం అర్ధరాత్రి వరకు సుమన్ శెట్టి 21.91 శాతం ఓటింగ్‌తో టాప్‌లో నిలిచాడు. ఆ తర్వాత డిమోన్ పవన్ 21.88 శాతంతో రెండో స్థానంలో నిలిచాడు. మిడ్ వీక్ వరకు టాప్‌లో నిలిచిన తనూజ పుట్టస్వామి అనూహ్యంగా 21.46 శాతం ఓటింగ్‌తో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత రాము రాథోడ్ 11.77 శాతం, దివ్య నిఖిత 11.55 శాతం, భరణి శంకర్ 11.43 శాతం నిలిచారు. సుమన్ శెట్టి కెప్టెన్ కావడంతో పాటు ఓటింగ్‌లో టాప్‌లో నిలవడంతో ఆయన ఆల్రెడీ సేవ్ అయిపోయారు. దివ్య, రాము రాథోడ్, భరణిలు ముగ్గురు ఓటింగ్‌లో డేంజర్ జోన్‌లో నిలిచారు. వీరిలో భరణి శంకర్ ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి.

చేజేతులా చేసుకున్న భరణి
బిగ్‌బాస్ తెలుగు 9లో టాప్ కంటెస్టెంట్‌గా, ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడని అనుకున్న భరణి శంకర్ ఎలిమినేట్ కావడం ఖచ్చితంగా ప్రేక్షకులకు షాకిచ్చేది. అయితే ఇది ఆయన స్వయంకృతమే అంటున్నారు విశ్లేషకులు. ఐదు వారాల వరకు తన ఆట తాను ఆడుతూ.. ఇంటికి పెద్ద మనిషిలా వ్యవహరించారు భరణి. అయితే 6వ వారం వచ్చేసరికి ఆయన చుట్టూ బాండింగ్స్ ఎక్కువయ్యాయి. దీంతో గేమ్ ఆడటం మరిచిపోయి ఏడుస్తూ కూర్చొన్నారు. తాను ఎలాగైనా సేవ్ అయిపోతానని... తనను టార్గెట్ చేసినవాళ్లంతా ఎలిమినేట్ అయిపోయారనే ఓవర్ కాన్ఫిడెన్స్.. భరణి శంకర్ కొంపముంచింది. దీంతో చివరికి ఆయనే ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ఎలాంటి నెగిటివిటీ, మచ్చ పడకుండా క్లీన్‌గా భరణి బయటకు వస్తుండటం విశేషం.

భరణి శంకర్ రెమ్యునరేషన్
బిగ్‌బాస్ తెలుగు 9లో సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 19 వరకు దాదాపు 6 వారాల పాటు భరణి శంకర్ పాల్గొన్నారు. సినిమా, బుల్లితెర రెండింటిలోనూ తిరుగులేని ఫాలోయింగ్ ఉండటంతో భరణి శంకర్ .. బిగ్‌బాస్‌లో పాల్గొనడానికి పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారట. అయితే చర్చల అనంతరం రోజుకు 50 వేల రూపాయల చొప్పున పారితోషికం చెల్లించేందుకు నిర్వాహకులు ఓకే చెప్పారట. అంటే భరణి శంకర్ పారితోషిక వారానికి 3.50 లక్షల రూపాయలు.. ఈ లెక్కల 6 వారాలకు గాను 21 లక్షల రూపాయల పారితోషికం అందుకోనున్నారు భరణి శంకర్. తద్వారా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్‌గా ఆయన నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X