Bigg Boss Telugu 9: పెద్ద మనిషి దొరికిపోయాడొచ్.. హరిత హరీష్ కుట్రలపై భరణి బుర్రకథ
బిగ్‌బాస్ తెలుగు 9 హోరాహోరీగా సాగుతోంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్‌లో అడుగుపెట్టగా.. వారిలో 9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్ ఉన్నారు. వీరిలో తొలివారం శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు. దీంతో 14 మంది బిగ్‌బాస్‌లో నిలిచారు. వీకెండ్ ముగిసి సోమవారం రాగానే నామినేషన్స్‌తో హౌస్‌లో రచ్చ మొదలైంది. తొలివారం తమకు జరిగిన అన్యాయానికి కొందరు ప్రతీకారం తీర్చుకున్నారు. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరిత హరీష్‌ను అందరూ ఆడుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
గుండు అంకుల్‌ని కడిగేసిన నాగార్జున
తొలి వారమే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ నిజస్వరూపాలు ఏంటో బయటపడ్డాయి. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిని కడిగిపారేశారు. ఈ వారంలో హైలైట్ అయ్యింది మాత్రం హరిత హరీషే. భరణి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఆడింగోళ్లు అనడంతో పాటు రెడ్ ఫ్లవర్ అంటూ టంగ్ స్లిప్ అయ్యాడు హరీష్. నాగార్జు వీడియో ప్లే చేసి అతని బండారం బయటపెట్టాడు. అయినప్పటికీ నా తప్పు లేదని, నా ఉద్దేశం అది కాదని దబాయించే ప్రయత్నం చేయగా.. నాగార్జున ముందు అతని ఆటలు సాగలేదు.

హరిత హరీష్‌పై ఉతికారేసిన తనూజ
నామినేషన్స్ డే రానే వచ్చింది? హరీష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్న వారంతా క్యూకట్టారు. ముందు తనూజ వంతు వచ్చింది. ఫస్ట్ వీక్‌లో ఎవరి బిహేవియర్ ఏంటో తెలియదని, కానీ హరీష్ మాత్రం నా గురించి తప్పుగా మాట్లాడారు.. అది చేయండి, ఇది చేయండి అంటూ ఆర్డర్స్ వేశారని తనూజ మండిపడింది. అక్కడ కూడా డిఫెండ్ చేసుకోవాలని మాస్క్ మ్యాన్ ట్రై చేసినప్పటికీ తనూజ ఎక్కడా తగ్గలేదు. నేను నా ఇంట్లోనే నా వాళ్లతో కలవనని, ఎక్కడో మూల కూర్చొంటానని తనూజ చెప్పింది.
ముందు మీ సంగతి చూసుకోండి
కనీసం గౌరవం లేకుండా నన్ను.. నువ్వు నువ్వు అంటున్నారని హరీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకళ్లకి చెప్పే ముందు మీ బిహేవియర్ చూసుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చింది. పక్కవాళ్ల పొట్ట గురించి ఆలోచిస్తే తప్పా? అని మాస్క్ మ్యాన్ ఆన్సర్ ఇవ్వబోయినా ఇది నా నామినేషన్ మీరు మాట్లాడొద్దని తనూజ తేల్చేసింది. ఆ వెంటనే హరీష్‌కు పెయింట్ పూసి నామినేట్ చేసింది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో తనూజ, మర్యాద మనీష్, రీతూ చౌదరిలు నామినేట్ చేశారు. అయితే మంగళవారం నాటి ఎపిసోడ్‌లో హరీష్‌ను భరణి తగులుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హరీష్‌ని టీజ్ చేసిన భరణి
దొరికాడు.. దొరికాడు.. ఎన్ని మాయలు చేశాడో, ఎన్ని దొంగపనులు చేశాడో, పెద్ద మనిషి ముసుగులో చేసిందంతా వీడియోలతో సహా చూపించారంటూ హరీష్ కుట్రలను బుర్ర కథ రూపంలో చెప్పాడు భరణి. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి? ఏం చేయడానికి అంటూ హరీష్‌ను ర్యాగింగ్ చేశాడు. హరీష్ దబాయించేందుకు ప్రయత్నించినప్పటికీ భరణి బేస్ వాయిస్ ముందు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. మరి వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరిగిందో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిల్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











