ఎవడితోనైనా తిరుగుతుంది... రీతూ చౌదరిపై దివ్వెల మాధురి షాకింగ్ కామెంట్స్
యువ హీరో ధర్మ మహేశ్‌పై అతని భార్య గౌతమి చౌదరి చేసిన ఆరోపణలు తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తన భర్తకు అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, అదనపు కట్నం కోసం మహేశ్‌తో పాటు అత్తమామలు తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని గౌతమి వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో బుల్లితెర నటి, యాంకర్ రీతూ చౌదరి ఎంట్రీతో తమ జీవితాలు నాశనమయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు అందుకు తగిన సీసీటీవీ ఫుటేజ్, ఆధారాలను మీడియాకు అందించింది.
అర్ధరాత్రి వరకు అమ్మాయిలతోనే
సింధూరం, డ్రింకర్ సాయి తదితర చిత్రాలలో నటించి ధర్మ మహేశ్‌కు.. సోషల్ మీడియ ఇన్‌ఫ్లూయెన్సర్ గౌతమి చౌదరికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో ఆమెను 2019లో మహేశ్ పెళ్లాడాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు సంతానం. సినిమాలతో పాటు వీరిద్దరూ ఓ రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగగా.. గత కొంతకాలం నుంచి మహేశ్ - గౌతమి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే మీడియా మందుకు వచ్చిన గౌతమి.. భర్తపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు పీరియడ్స్ అని చెప్పినా మహేశ్ లైంగిక వేధింపులకు గురిచేసేవాడని, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు దాడి చేశాడని ఆరోపించింది. అర్ధరాత్రి వరకు అమ్మాయిలతో తిరిగి వచ్చేవాడని ఇదేంటని అడిగితే తనను చిత్రహింసలు పెట్టేవాడని గౌతమి చౌదరి వాపోయింది.

ఆ అమ్మాయితో ఫ్లాట్‌లోకి
ఇదే సమయంలో ఓ నటితో ధర్మ మహేశ్ సన్నిహితంగా ఉన్న వీడియోలు అర్ధరాత్రి పూట ఇద్తరూ మత్తులో ఊగుతూ వస్తున్న ఫోటోలు, వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టింది గౌతమి. అందులోని యువతి అచ్చుగుద్ధినట్లుగా బుల్లితెర నటి రీతూ చౌదరిలా ఉండటంతో అంతా షాకయ్యారు. గౌతమి లీక్ చేసిన స్క్రీన్ షాట్స్‌లోనూ రీతూ చౌదరి పేరు కనిపించింది. 2023లో వీళ్లిద్దరికీ ఎఫైర్ నడిచిందని, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నదని తనకు తెలియదని .. ఓ రోజున ఫ్లాట్ నా కాస్ట్ లీ ఫుట్‌వేర్ మిస్ అయ్యిందని, ఇందుకోసం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తుండగా వీరిద్దరూ కనిపించారని గౌతమి షాకింగ్ న్యూస్ చెప్పింది.
గౌతమి వ్యాఖ్యలపై దివ్వెల మాధురి స్పందన
ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా ఉన్న రీతూ చౌదరిపై ఈ ఆరోపణలు కలకలం రేపాయి. తీవ్రమైన నెగిటివిటీతో ఓటింగ్ సమయంలో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన దివ్వెల మాధురి.. రీతూ చౌదరిపై గౌతమి చౌదరి చేసిన ఆరోపణలపై స్పందించారు. బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి ముందు ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. బిగ్‌బాస్‌లో ఉన్న రీతూ చౌదరికి బయట జరుగుతున్న విషయాలు తెలియవని, గౌతమి చేసిన వ్యాఖ్యలను ఆమెకు తెలియజేస్తారా అని యాంకర్ అడుగుతాడు.
అమ్మాయి జీవితం తన ఇష్టం
దీనికి మాధురి స్పందిస్తూ.. అసలు నేనెందుకు ఈ విషయాలన్నీ ఆమెకు చెబుతాను. కానీ బయట మాత్రం అలాంటి వీడియోలు చేసే వాళ్లది తప్పు. ఒక ఆడపిల్లను, ఆడపిల్ల జీవితాన్ని అలా పబ్లిక్ చేయకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఉన్నాయి. ఇలా బయటికొచ్చేసి సోషల్ మీడియాలో పెట్టి నాశనం చేయకూడదు. అది రీతూ చౌదరి అయినా ఏ అమ్మాయి అయినా. ఒక మహిళ జీవితాన్ని బయటపెట్టే అర్హత ఎవరికీ లేదు.. మహిళ ఇష్టమొచ్చినట్లు బతుకుతుంది, ఆ అర్హత ఆమెకు ఉంది. ఏ మహిళ జీవితంపై అయినా మాట్లాడే అర్హత ఎవరికీ లేదు అని దివ్వెల మాధురి తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై గౌతమి చౌదరి, ధర్మా మహేశ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











