Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో చచ్చిపోయినా పర్లేదు.. రమ్య మోక్ష అక్క షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 9 హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. తొలుత 15 మందితో ప్రారంభమైన ఈ టాప్ షోలోకి ఇటీవల ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. వారు దివ్వెల మాధురి, ఆయేషా జీనత్, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష. వీరందరిలోకి ఫేవరెట్‌గా నిలిచిన వారు రమ్య.. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలతో వచ్చిన పాపులారిటీకి అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం మరింత ఫేమ్ తీసుకొచ్చింది. దీంతో రమ్య మోక్ష ఖచ్చితంగా బిగ్‌బాస్‌లో అడుగుపెడుతుందని అందరూ భావించారు.

బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన రమ్య
సెప్టెంబర్ 7న మొదలైన బిగ్‌బాస్ తెలుగులో రమ్య మోక్ష ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. కానీ ఆమె అప్పుడు హౌస్‌లోకి అడుగుపెట్టలేదు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీదారుల జాబితాలో మాత్రం రమ్య పేరు వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకే రమ్య మోక్ష అడుగుపెట్టగా.. రెండు వారాలుగా హౌస్‌‌లో హల్‌చల్ చేస్తోంది. డిస్కషన్స్ కానీ, గేమ్స్ కానీ సత్తా చాటుతూ ఓటింగ్ పెంచుకుంటోంది. తాజాగా రమ్య బిగ్‌బాస్ ఎంట్రీపై ఆమె అక్క సుమ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Bigg Boss Telugu 9 contestant Ramya moksha kancharla sister suma shocking comments

వివాదంలో అలేఖ్య చిట్టి పికిల్స్‌
రాజమండ్రికి చెందిన సుమ, అలేఖ్య, రమ్య కంచర్ల అక్కాచెల్లెళ్లు. వీరిలో రమ్య చిన్నమ్మాయి.. ఈమెకు రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు, రీల్స్ చేస్తూ గ్లామర్ ఫోటోలతో పాపులారిటీ సంపాదించింది. ఈ క్రమంలోనే ముగ్గురు కలిసి చికెన్, మటన్, చేపలు, రొయ్యలు తదితర నాన్ వెజ్ వెరైటీలతో పచ్చళ్ల బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్ బాగానే జరుగుతున్న దశలో ఈ ముగ్గురు సిస్టర్స్‌లోని అలేఖ్య అనే అమ్మాయి.. ఓ కస్టమర్‌తో జరిపిన ఫోన్ కాల్ సంభాషణ వైరల్ అయ్యింది. ధరలు తగ్గించమని అడిగినందుకు ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడం.. దీని తాలుకా ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఈ అక్కాచెల్లెళ్లపై విరుచుకుపడ్డారు. దాంతో అందరికీ క్షమాపణలు చెప్పడంతో పాటు బిజినెస్ క్లోజ్ చేశారు. అయితే ఈ వివాదం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పికెల్స్ పేరు మారుమోగిపోయింది. వీరిలో రమ్యకు పలు సినిమాల్లోనూ ఆఫర్లు వచ్చినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఆమె బిగ్‌బాస్‌లో అడుగుపెట్టడం మాత్రం అందరూ ఊహించినదే. దీనిపై రమ్య అక్క సుమ కీలక వ్యాఖ్యలు చేశారు.

బిగ్‌బాస్‌ ఆఫర్ కోసం వెయిటింగ్
బిగ్‌బాస్ టీమ్ నుంచి కాల్ వచ్చిన తర్వాత వెళ్లాలా? వద్దా? ఏం అనుకున్నారని యాంకర్ ప్రశ్నించగా.. దానికి సుమ తనదైన రీతిలో ఆన్సర్ ఇచ్చారు. కన్ఫర్మ్‌గా బిగ్‌బాస్‌కు వెళ్లాలనే రమ్య ఉంది. అసలు మా విషయంలో రియల్‌గా ఏం జరిగింది? వ్యక్తిత్వ హననం చేసేశారు. వీళ్లు అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు, వీరు ఆ టైప్ అది ఇది అని చాలా మాట్లాడారు. అసలు మేమేంటీ.. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయిలు, ప్రూవ్ చేసుకోవాలి, అందుకోసం ఛాన్స్ అసలు మిస్ చేసుకోదలచుకోలేదు. కాల్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ.. ఇంటర్వ్యూకి వెళ్లింది, సెలెక్ట్ అయ్యింది, అందుకే ఈ రోజు ఆ స్టేజ్ మీద ఉంది. తనను తాను నిరూపించుకుంటుందని రమ్య చెప్పారు.

అమ్మకి ధైర్యం చెప్పి బిగ్‌బాస్‌కి
తుఫాన్ తీసుకురండి, భూకంపం తీసుకురండి.. ఏదైతే అదే అయ్యింది, కూర్చొని ఏడుస్తూ ఏమైపోతుందనే రకం కాదు. డూ ఆర్ డై, వెళ్లడం పోరాడటం.. నేను చచ్చిపోతే చచ్చిపోయాను, ఓడిపోతే ఓడిపోయాను.. నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అనే నేచర్ ఆమెది. చాలా ధైర్యంగా ఉంటది, ఏదిచ్చినా గట్టిగా చేస్తుంది. అలేఖ్య చిట్టి ఇష్యూ, మా నాన్న డెత్, ట్రోలింగ్ వీటన్నింటిని తట్టుకుని నిలబడి మా అందరికీ ధైర్యం చెప్పుకుంటూ వచ్చింది. ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్.. ఎంత గొడవ జరిగినా చివరిలో ఒక్క మాట్లాడి మొత్తాన్ని నోరు మూయిస్తుంది. వెన్నుపోటు పిడిస్తే తట్టుకోలేదు, తన గురించి ఇక్కడ మంచిగా మాట్లాడి.. వెనుక మరోలా మాట్లాడితే అస్సలు తట్టుకోలేదు. తను ఓపెన్ బుక్ కాదు.. ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చుంటే మా మీద ఒక ఓపీనియన్ ఉండేది. ఏ టెన్షన్ పెట్టుకోవద్దు, మంచిగా ఆడేసి వస్తానని అమ్మకే రమ్య ధైర్యం చెప్పింది. బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది అని సుమ తెలిపారు.

కాగా.. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే బిగ్‌బాస్ తెలుగు 9లో ఏడో వారం ఎలిమినేట్ కాబోయేది పచ్చళ్ల పాప రమ్య మోక్షనే అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X