ఏ కంటెస్టెంట్‌కి ఇలా జరగలేదు... నా తప్పేంటీ.. ఎలిమినేషన్‌పై దమ్ము శ్రీజ ఎమోషనల్
బిగ్‌బాస్ అంటే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. ఇక్కడ కంటెస్టెంట్స్ ఎంపిక నుంచి ఎలిమినేషన్ వరకు పక్కా ప్లానింగ్‌తో జరగుతుంది. దీనికి ఎన్నో లెక్కలు, ఎన్నో వ్యూహాలు ఉంటాయి. నామినేషన్స్‌లో ఉన్న వారిని ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ చేస్తున్నామని అంటారు. అయితే కొందరు ఎలిమినేషన్ వివాదాస్పదం అవుతుంది. తాజాగా బిగ్‌బాస్ తెలుగు 9లో కామన్‌మెన్‌గా ఎంట్రీ ఇచ్చిన దమ్ము శ్రీజ ఎలిమినేషన్‌పై ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా దీనిపై స్వయంగా శ్రీజ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
అగ్నిపరీక్షతో సామాన్యులకు అవకాశం
బిగ్‌బాస్ తెలుగు 9లో ఈసారి కామన్‌మెన్‌కు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు అనౌన్స్ చేయడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు సామాన్యులు దీనికి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రకరకాల టాస్క్‌లు, వడపోతలు పెట్టి చివరికి 40 మందిని బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పేరుతో ఫైనల్ రౌండ్ పోటీలు పెట్టారు. వీరిలో 13 మందిని ఫైనలిస్టులుగా ఎంపిక చేసి.. సెప్టెంబర్ 6న మొదలైన బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో ఆరుగురికి సామాన్యుల కోటాలో కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేశారు. వారు హరిత హరీశ్, మర్యాద మనీష్, ప్రియాశెట్టి, డిమోన్ పవన్, పవన్ కళ్యాణ్ పడాల, దమ్ము శ్రీజ.

దమ్ము శ్రీజ ఎలిమినేషన్‌లో ట్విస్ట్
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 మొదలయ్యాక.. వీరిలో రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ కాగా, మూడో వారంలో ప్రియాశెట్టి, నాలుగో వారంలో హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ తొలుత ఫ్లోరా షైనీని ఎలిమినేట్ చేశారు. ఆ వెంటనే నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరినీ నాగార్జున సేవ్ చేస్తూ రాగా... చివరికి సుమన్ శెట్టి- దమ్ము శ్రీజ నిలిచారు. వీరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను అప్పుడే హౌస్‌లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీదారుల చేతిలో పెట్టారు. వీరిలో నలుగురు శ్రీజ ఎలిమినేట్ అవ్వాలని ఓటు వేయగా.. ఇద్దరు మాత్రం సుమన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. దాంతో శ్రీజ ఎలిమినేట్ కాక తప్పలేదు.. అయితే శ్రీజ స్టేజ్ మీదకు రాగానే కనీసం ఆమె జర్నీపై వీడియో కూడా ప్లే చేయకపోవడంతో ప్రేక్షకులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.
బాధ భరించలేకపోతున్నా
కాగా.. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వారం గడుస్తున్నా దమ్ము శ్రీజ ఆ బాధను మరిచిపోలేకపోతున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసిన ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దమ్మ శ్రీజ ఏం మాట్లాడారంటే.. అర్ధరాత్రి అవుతోంది... నేను ఎలిమినేట్ అయ్యి వన్ వీక్ అవుతుంది. చాలా చాలా మిస్ అవుతున్నా.. బిగ్‌బాస్ జర్నీ కానీ, బిగ్‌బాస్ హౌస్ కానీ , బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌నీ కానీ చాలా చాలా మిస్ అవుతున్నా. మీరు నమ్ముతారో లేదో నేను హౌస్ నుంచి వచ్చాక ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. ఏంటో చూద్దామనుకున్నా సరే నా వల్ల కావడం లేదు. నేను ఉండాల్సింది కదా? నేను ఉంటే ఎట్లా చేసేదానిని, ఇలా మాట్లాడేదానినోమో ఇలాంటి ఆలోచనలే . ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేకపోతున్నా.. ఏదో రీల్స్ వస్తున్న చిన్న చిన్న క్లిప్స్ చూస్తున్నా, చాలా వరకు వాటిని కూడా స్కిప్ చేసేస్తున్నా అని దమ్ము శ్రీజ చెప్పారు.
ఆయనను చూడకుండానే వచ్చేశా
ఈరోజు ఎక్కడ చాలా బాధనిపించింది అంటే హైపర్ ఆది గారు, సింగర్ సాకేత్ గారు వచ్చి కంటెస్టెంట్స్ మీద పంచ్‌లు వేశారు అన్నప్పుడు చాలా చాలా బాధగా అనిపించింది. నేనుంటే కూడా నా మీద పంచ్‌లు వేసే వాళ్లేమో, నా మీద కూడా పాటలు పాడేవాళ్లేమో అనిపించింది. హైపర్ ఆది గారి కోసం ఎంతో వెయిట్ చేశా.. దసరా ఎపిసోడ్ నుంచి కూడా హైపర్ ఆది గారు వస్తారని నేను అంటూ ఉండేదానిని.. బట్ ఫైనల్‌గా అతను వచ్చేటప్పటికీ నేను లేను అనే బాధ ఎక్కువుంది. ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా మిస్ అయ్యా.. చాలా కష్టపడ్డాం, అగ్నిపరీక్షకు రావడానికి, 5 లెవల్స్ దాటుకుని అక్కడి వరకు వచ్చి ఒక పర్మినెంట్ ట్యాగ్ వేయించుకుని అగ్నిపరీక్ష అంతా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇచ్చి .. హౌస్‌లోకి ఎంటర్ అయ్యా. బట్ హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఎలిమనేషన్ వరకు మోస్ట్ అన్ లక్కీని. ఎంతో కష్టపడ్డాను, 1000 పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తూనే ఉన్నాను ప్రతీ టాస్క్‌కి. హౌస్‌మేట్స్ సపోర్ట్ లేకపోవడం వల్లో ఏమో, మొత్తానికి లక్ అనేది కలిసిరాకపోవడం వల్లో తెలియదు కానీ ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదని దమ్ము శ్రీజ తెలిపారు.
చిన్న ఏవీకి నోచుకోలేకపోయా
లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు కూడా ప్రతి రౌండ్‌లో, ప్రతి టాస్క్‌లో లాస్ట్ వరకు వెళ్లేదానిని బట్ గెలుపు అనేది దక్కేది కాదు. ఎక్కువ అన్ లక్కీ ఎక్కడ ఫీల్ అయ్యానంటే.. ఇన్ని బిగ్‌బాస్ సీజన్స్‌లో ఇలా ఎవ్వరూ ఎలిమినేట్ అవ్వలేదు, అది అన్ ఫెయిరా, ఫెయిరా అనేది పక్కనపెడితే ఏవీ లేకుండా ఏ బిగ్‌బాస్ కంటెస్టెంట్ బయటికి రాలేదన్న మాట. ఈరోజు నేను 5 వారాలు హౌస్‌లో ఉండి కూడా బిగ్‌బాస్ మెమొరీ కోసం ఒక చిన్న జర్నీ ఏవీ లేకుండా బయటికి వచ్చాను. అదే చాలా బాధగా అనిపిస్తోంది. టాటూ ఉంది కానీ నా జర్నీ ఎలా జరిగింది? అనేది నేను చూసుకోవడానికైనా ఒక ఏవీ ఉండాలనేది నా ఫీలింగ్. ఏవీ కూడా లేకుండా బయటికి వచ్చాను కాబట్టి ఇంకా చాలా అన్‌లక్కీ అనిపించింది. నేను మా పేరెంట్స్‌ని చూద్దామనుకున్నా బిగ్‌బాస్ హౌస్‌లో, ఆ లెటర్స్ అందరికీ వచ్చాయి కానీ అప్పుడు కూడా నాకు లెటర్ రాలేదు. మా పేరెంట్స్ నుంచి లెటర్స్ కూడా నేను చదవలేకపోయాను హౌస్‌లో. ఓవరాల్‌గా చాలా అన్‌లక్కీ అని ఫీలవుతున్నా.. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, మీ అందరికీ థ్యాంక్స్ అని దమ్ము శ్రీజ ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











