What is Demon : బిగ్‌బాస్‌లో మూడో కామనర్‌గా డిమోన్ పవన్.. తొలిరోజే రీతూకి షాక్

బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా మరో సామాన్యుడికి అవకాశం దక్కింది. అతనే డిమోన్ పవన్. ప్రజల ఓటింగ్‌‌ ఆధారంగా బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో డిమోన్ పవన్ విజేతగా నిలిచాడు. అతనిని కింగ్ అక్కినేని నాగార్జున వేదిక మీదకు అతనిని ఆహ్వానించాడు. తనకు జపనీస్ వెబ్ సిరీస్‌లు చూసే అలవాటు ఉండటంతో డిమోన్ పవన్ అని పేరు పెట్టుకున్నానని చెప్పాడు పవన్. అంతకుముందే సీరియల్ యాక్టర్ భరణితో కలిసి స్టేజ్ మీద పుషప్స్ తీసి ఆకట్టుకున్నాడు.

బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో టాప్ 13లో నిలిచిన వారిలో నీకు అవకాశం వస్తే ఎవరిని హౌస్‌లోకి తీసుకెళ్తావని నాగార్జున అడిగారు. దీంతో నాకు ఛాన్స్ ఉంటే దమ్ము శ్రీజను తనతో పాటు హౌస్‌లోకి తీసుకెళ్తానని డిమోన్ పవన్ చెప్పాడు. హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే ఫైనల్లి ఎంటర్ ది డ్రాగన్ అని చెప్పాడు పవన్. ఆ వెంటనే అందరినీ పరిచయం చేసుకున్నాడు. నీతో ఈక్వెల్‌గా డిప్స్ చేయగలిగానా? అని అడిగాడు భరణి. హౌస్‌లో ఎంటరైన వెంటనే డిమోన్ పవన్‌కి టాస్క్ ఇచ్చాడు నాగార్జున. భరణి, రీతూ చౌదరిలలో కిచెన్‌లో గిన్నెలు కడిగే అవకాశం ఎవరికి ఇస్తావ్ అని అడిగాడు నాగార్జున. రీతూ గిన్నెలు బాగా కడుగుతుందని ఇమ్మాన్యుయేల్ చెప్పగా.. ఆమెకే ఆ డ్యూటీ ఇస్తున్నట్లు డిమోన్ చెప్పాడు.

Bigg Boss Telugu 9 Demon Pavan entered as bigg boss contestant

బిగ్‌బాస్‌లో అవకాశం కోసం దరఖాస్తు చేసుకున్న కామనర్స్‌లో డిమోన్ పవన్ ఫిజికల్ టాస్క్‌లలో దుమ్మురేపాడు. అగ్నిపరీక్షలో విజేతలుగా నిలిచేవారిలో ఖచ్చితంగా పవన్ పేరు ఉంటుందని అంతా అనుకున్నారు. అందుకు తగినట్లుగానే ఓటింగ్‌లోనూ మనోడు ముందంజలో నిలిచాడు. మొత్తానికి ప్రేక్షకుల నిర్ణయంతో బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో విజేతగా నిలిచి హౌస్‌లో అడుగుపెట్టాడు. డిమోన్ అంటే జపాన్‌ సిరీస్‌లో ఒక క్యారెక్టర్ అని చెప్పాడు.

బీటెక్ చేసి ఆ తర్వాత ఎంబీఏ వైపు వెళ్లిన ఈ కుర్రాడు. ఉద్యగం చేయడం మానేసి అథ్లెటిక్స్ వైపు ట్రై చేశాడు. అయితే మెరిట్ లేకపోవడంతో అవకాశం దక్కలేదు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఈ కుర్రాడు తన కష్టంతో ఇక్కడి వరకు చేరుకున్నాడు. కెరీర్‌లో ఇంకా స్థిరపడకపోవడంతో తల్లిదండ్రులు, అమ్మానాన్నల సాయంతో బిగ్‌బాస్ కామనర్స్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకున్నానని డిమోన్ పవన్ చెప్పాడు. అగ్నిపరీక్షలోనూ ఓవర్‌గా చేయలేదు.. బయట ఎలా ఉన్నానో, ఇక్కడా అలాగే ఉన్నాను. అమ్మ అయితే జాబ్ చేసుకోవాలని, ఇవన్నీ వదిలేయమని చెప్పింది.

షార్ట్ ఫిల్మ్స్, ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాను.. టీవీలో కనిపించిన తర్వాత ఇరుగుపొరుగు వారు, బంధువులు చాలా గర్వంగా ఫీలయ్యారు. మైండ్ రిఫ్రెష్‌గా ఉంచుకోవడానికి క్రికెట్ ఆడటం, వ్యాయామం చేసుకోవడం వంటివి చేశానని డిమోన్ పవన్ తెలిపారు. బాగా ఫేమ్ రావడంతో పాటు జనాల్లోకి వెళ్లింది మాత్రం బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ద్వారానే అని చెప్పాడు. జిమ్‌కి వెళ్లడం తక్కువ.. ఏదైనా గ్రౌండ్‌కి వెళ్లడం, ఇంట్లోనే పుషప్ తీసేవాడినని డిమోన్ పవన్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X