Bigg Boss Telugu 9: సెలబ్రెటీలకు షాక్.. మళ్లీ కెప్టెన్‌గా పవన్ డిమోన్? కసితో గెలిచిన కామన్‌మెన్!

బిగ్‌బాస్ తెలుగు 9 ఊహించని ట్విస్ట్‌లతో , గొడవలతో సాగుతోంది. కామనర్స్, సెలబ్రెటీల మధ్య నిత్యం వివాదాలు, మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక బిగ్‌బాస్ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా కెప్టెన్‌ని హోస్ట్ నాగార్జున పీకి పారేయడం విశ్లేషకుల్ని ఆశ్చర్యపరిచింది. బిగ్‌బాస్ తెలుగులో గత 8 సీజన్‌లలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. రీతూ కారణంగానే పవన్ కెప్టెన్ అయ్యాడని భావించిన నాగార్జున అతనిని కెప్టెన్సీ నుంచి తప్పించాడు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా డిమోన్ పవన్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ వివరాల్లోకి వెళితే..

పవన్‌కి రీతూ మైండ్ వాష్
బిగ్‌బాస్ తెలుగు 9లో తొలివారం సంజన గల్రానీ కెప్టెన్ కాగా.. సెకండ్ వీక్ కెప్టెన్ ఎవరు? అవుతారోనని ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కెప్టెన్సీ కంటెండర్లని ఎంచుకోవడానికి ముందే రీతూకి డిమోన్‌కి మధ్య నైట్ బెడ్‌రూమ్‌లో ఓ డిస్కషన్ జరిగింది. చాక్లెట్ తింటూ మత్తు మత్తుగా మాట్లాడిన రీతూ.. ఈ వారం నువ్వు ఖచ్చితంగా కెప్టెన్ కావాలని అడిగింది. ఆమె అడిగిందే తడవుగా నీ కోసం ట్రై చేస్తానని ఆమె కళ్లలో కళ్లు పెట్టి మాటిచ్చాడు. అయితే అనూహ్యంగా కెప్టెన్సీ టాస్క్‌కు సంచాలక్‌గా రీతూ చౌదరినే బిగ్‌బాస్ నియమించడం.. డిమోన్ పవన్‌కు కలిసొచ్చింది.

Bigg Boss Telugu 9 Demon Pavan gets his captain band again after Akkineni Nagarjuna revoke

భరణిని, ఇమ్మూని బలి చేసిన రీతూ
టాస్క్ మొదలయ్యాక పవన్ తప్పు చేసినా వెనకేసుకొచ్చిన రీతూ.. బలమైన కంటెండర్స్ అయిన భరణిని, ఇమ్మాన్యుయేల్‌ను ఎలిమినేట్ చేసే వరకు నిద్రపోలేదు. భరణిని తప్పుగా ఎలిమినేట్ చేసిన రీతూకి ఇమ్మాన్యుయేల్ చిక్కలేదు.. డిమోన్‌తో హోరాహోరీగా తలపడిన ఇమ్మూ టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఇద్దరూ పోరాటంలో సమంగా నిలవగా.. తన ఫ్రెండ్, జబర్దస్త్‌లో సహ నటుడు అయిన ఇమ్మాన్యుయేల్‌ను పక్కకు నెట్టి పవన్‌ను కెప్టెన్‌గా చేసింది. దీనిపై కంటెస్టెంట్స్‌ భగ్గుమనగా, ప్రేక్షకులు కూడా తప్పుబట్టారు.

పవన్ కెప్టెన్సీ పీకేసిన నాగార్జున
వీకెండ్‌లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున రావడం రావడంతోనే పవన్ కెప్టెన్సీపై ఫోకస్ చేశాడు. పవన్ కెప్టెన్‌గా అర్హుడేనని కంటెస్టెంట్స్ నుంచి ఆడియన్స్ వరకు అందరి అభిప్రాయాలను తీసుకుని డిమోన్ పవన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాడు. తప్పు ఒప్పుకున్న పవన్.. ఈసారి నిజాయితీగా సాధించుకుంటానని కెప్టెన్ బ్యాడ్జ్ తిరిగి ఇచ్చేశాడు. అన్నట్లుగానే అతనికి మరోసారి టైం వచ్చింది. ఆదివారం నాటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. అందులో ఓనర్స్‌కి, టెనెంట్స్‌కి మధ్య ఓ టాస్క్ ఉంటుందని నాగార్జున చెప్పారు. తాము ప్లే చేసే లిరిక్‌ని సరిగ్గా గుర్తేచేసి కాలింగ్ బెల్ కొట్టి పాట పాడాలని చెబుతాడు. తొలుత ఇమ్మాన్యుయేల్, దమ్మ శ్రీజలకు జల్సా సినిమాలోని జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్‌లా అనే పాట వస్తుంది. తొలుత ఇమ్మాన్యుయేల్ కాలింగ్ బెల్ కొట్టి పాడగా.. శ్రీజను సరిగా పాడమని నాగ్ చెబుతాడు. ఆమె డ్యాన్స్‌లు వేస్తూ.. ఈ పాడ పాడగా నీకు ఆ పాట ఎలా గుర్తుందని ఇమ్మాన్యుయేల్ అడుగుతాడు.

తిరిగి కెప్టెన్‌గా డిమోన్ పవన్
శ్రీజ జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు చాలా మంది పాడారని నాగార్జున సెటైర్లు వేశాడు. ఆ తర్వాత మన్మథుడిలోని వద్దురా సోదరా.. నువ్వెళ్లి గోతిలో పడొద్దరా అనే సాంగ్‌ని ప్లే చేస్తాడు. దీనికి ఇమ్మాన్యుయేల్ సరైన ఆన్సర్ చెబుతాడు. అయితే ఈ ప్రోమోని జాగ్రత్తగా గమనిస్తే పవన్ డిమోన్ తిరిగి కెప్టెన్ అయినట్లుగా కనిపిస్తోంది. భరణి, మనీష్, ఇమ్మాన్యుయేల్, పవన్ మధ్య మరోసారి కెప్టెన్సీ కోసం జరిగిన ఫైట్‌లో పవన్ గెలిచినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రోమోలో పవన్ కెప్టెన్సీ బ్యాడ్జ్‌తోనే కనిపించడంతో అందరినీ షాక్‌కి గురిచేసింది. మరి పవన్ కెప్టెన్‌గా ఎలా గెలిచాడన్నది తెలియాలంటే కొద్దిగంటలు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X