Bigg Boss Telugu 9: రీతూ చౌదరి దారుణంగా.. కంటెస్టెంట్ గొంతుపై కాలు పెట్టి
బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడటంతో పాటు ఫిజికల్‌గా మీదకి వెళ్తున్నారు. నామినేషన్స్ సందర్భంగా ఇమ్మాన్యుయేల్ మీదకి హరిత హరీశ్ దూసుకెళ్లాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా రీతూ చౌదరి తన విశ్వరూపం ప్రదర్శించింది. ఇన్నాళ్లు ఆమె సెన్సిటీవ్ అనిపించగా.. తనలోని ఫైర్ ఏంటో చూపించింది. ఈ వివరాల్లకి వెళితే..
ఇమ్మూకి రీతూ వెన్నుపోటు
బిగ్‌బాస్‌లో ఫ్రెండ్‌షిప్.. లవర్ అన్న రిలేషన్స్ ఏం ఉండవు. ఇక్కడ గేమ్ ఆడాలి, గెలవాలి అదొక్కటే ఆలోచించాలి. నా వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు? నన్ను తొక్కేశారు అంటే కుదరదు. ఏమాత్రం రేస్ ఆపినా వేరే వాళ్లు దూసుకొచ్చేస్తారు. తాజాగా బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్‌లో రీతూ తనకు సాయం చేయలేదని ఇమ్మాన్యుయేల్ ఆవేదన వ్యక్తం చేశాడు. జరిగిన దానిని ఇమ్మూ తీసుకోలేకపోతున్నాడని భరణికి సుమన్ శెట్టి చెప్పాడు. నేను ఫ్రెండ్ అయితే రీతూ నాకు సపోర్ట్ చేయకుండా వాడికి ఫేవర్‌గా మాట్లాడుతోందని అంటున్నాడని చెప్పాడు. కెప్టెన్సీ టాస్క్‌లో చివరి వరకు పోరాడినా ఫలితం దక్కకపోవడంతో ఇమ్మాన్యుయేల్ కంటతడి పెట్టాడు.. దాంతో నువ్వు మామూలుగా ఆడలేదు, టఫ్ ఇచ్చావని సుమన్ శెట్టి అతనిని ఓదార్చాడు.

డిమోన్ పవన్‌ని కెప్టెన్‌ని చేసిన రీతూ చౌదరి
రీతూ చౌదరి సాయం, కామనర్స్ స్ట్రాటజీతో మొత్తం మీద బిగ్‌బాస్ తెలుగు 9కి సెకండ్ వీక్ కెప్టెన్‌గా డిమోన్ పవన్ నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ కోసం రీతూ రాంగ్ గేమ్ ఆడిందంటూ కామనర్స్, సెలబ్రెటీలు ఆమెపై విరుచుకుపడ్డారు. డిమోన్‌ని కెప్టెన్ రేసులో ఉన్నప్పుడు సంచాలక్‌గా రీతూ చౌదరిని పెట్టడంతో బిగ్‌బాస్ పైనా కంటెస్టెంట్స్ విమర్శలు చేస్తున్నారు. డిమోన్‌ని కెప్టెన్‌ని చేసి బిగ్‌బాస్ హౌస్‌ని రీతూ చౌదరి రూల్ చేయబోతోందని మిగిలిన కంటెస్టెంట్స్ లోలోపల రగిలిపోతున్నారు.
టెనెంట్స్‌కి ఓనర్స్‌గా ప్రమోషన్
ఇదిలాఉండగా.. కెప్టెన్సీ టాస్క్ ముగియడంతో బిగ్‌బాస్ హౌస్‌లో చిచ్చు రేపడానికి మరో పెంట పెట్టాడు. అదేంటంటే ఈ వారం టెనెంట్స్‌గా ఉన్న సెలబ్రెటీల నుంచి ఒకరికి ఓనర్‌గా, మెయిన్ హౌస్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపాడు. అయితే ఇక్కడే ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఓనర్స్ విసిరిన ఐటెమ్స్ పెట్టుకుని చివరి బజర్ మోగే వరకు కంటెస్టెంట్స్ వాటిని తమ బాస్కెట్‌లో భద్రంగా దాచుకోవాలి. చివరి వరకు ఎవరి బాస్కెట్‌లో ఎక్కువ వస్తువులు ఉంటాయో వారే విన్నర్‌గా నిలిచి ఓనర్‌గా మెయిన్ హౌస్‌లో అడుగుపెడతారని కండీషన్స్ చెప్పాడు బిగ్‌బాస్. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇన్నాళ్లు టెనెంట్స్‌గా ఉండి తిండికి, చివరికి మంచినీటికి కూడా ఇబ్బంది పడిన సెలబ్రెటీలు ఓనర్స్‌గా మెయిన్ హౌస్‌లో అడుగుపెట్టేందుకు ఆడ, మగ అన్న తేడా లేకుండా ఫిజికల్‌గా ఫైట్ చేసుకున్నారు.
రేలంగి మావయ్యలా దూరొద్దు
గేమ్ మొదలవ్వగానే తొలుత ఫ్లోరా, సంజనలు ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత సుమన్ శెట్టి చేయి మరొకరికి తగలడంతో సుమన్ శెట్టిని సంచాలక్‌గా ఉన్న ప్రియ ఔట్ అని ప్రకటించింది. దీంతో తన బుట్టని కాలితో తన్నేసి కోపంగా వెళ్లిపోయాడు సుమన్. ఇక ఈ టాస్క్‌లో రీతూ చౌదరి రాక్షసంగా, ఉన్మాదిగా బిహేవ్ చేసింది. ఇమ్మాన్యుయేల్ బాస్కెట్‌లోని వస్తువులు తీసి రాము బాస్కెట్‌లో వేయడంతో రీతూతో గొడవకు దిగాడు ఇమ్ము. నీ కోసం వాడు చేతులు కట్టుకుని నిలబడ్డాడని, వాడు ఎలిమినేట్ అవుతాడని చెప్పగా.. నీ సంగతి నువ్వు చూసుకో, ఎలా ఆడాలో మాకు తెలుసు.. నువ్వు రేలంగి మావయ్య లాగా మధ్యలో రావొద్దని వార్నింగ్ ఇచ్చింది రీతూ.
ఉన్మాదిలా రీతూ చౌదరి
నేను రేలంగి మావయ్యని కాదు కానీ.. నువ్వు మాత్రం రేలంగి అత్తవేనంటూ ఇమ్మూ కూడా కౌంటర్ వేశాడు. తర్వాత తనను టాస్క్‌లో నుంచి లేపేద్దామని చూశావంటూ రీతూతో తనూజ గొడవకు దిగింది. నేను ఎవరితో చెప్పాను, ప్రూవ్ చేయమంటూ రీతూ నిలదీస్తూ రాముని సాక్ష్యం చెప్పమని గోల చేసింది. ఆ వెంటనే తనూజను ఫిజికల్‌గా టార్గెట్ చేసిన రీతూ చౌదరి.. ఆమె మీద ఎక్కి కూర్చొని, పీకల మీద కాలు పెట్టినంత పనిచేసింది. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. ఎవరు ఓనర్‌గా అర్హత సాధించారో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











