Bigg Boss Telugu 9 Elimination: ఓటింగ్‌ లెక్కలు తారుమారు.. డేంజర్ జోన్‌లో టాప్ కంటెస్టెంట్స్?

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ అప్పుడే ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకోబోతోంది. ఇప్పటికే గొడవలు, అల్లర్లు, అరుపులు, కేకలతో హౌస్ మొత్తం హీటెక్కిపోతోంది. నామినేషన్స్ తంతు ముగియడంతో బిగ్‌బాస్ తెలుగు 9లో తొలి వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. నామినేషన్స్‌లో ఏకంగా 9 మంది ఉండటంతో వీరిలో ఎవరు హౌస్‌ను వీడుతారు అనే దానిపై నెటిజన్లు రకరకాల ప్రశ్నలు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్ వివరాలు పరిశీలిస్తే..

హౌస్‌లోకి 15 మంది
మొత్తం 9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. వారే తనూజా పుట్టస్వామి, ఫ్లోరా షైనీ, సంజన గల్రానీ, భరణి శంకర్, శ్రేష్టి వర్మ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ రీతూ చౌదరి, రాము రాథోడ్, సుమన్ శెట్టిలు సెలబ్రెటీ హోదాలో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఇక కామనర్స్ కోటాలో హరిత హరీష్, దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్‌లు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా అవకాశం దక్కించుకున్నారు.

Bigg Boss Telugu 9 First Week Elimination flora saini and Shrasti Verma are in Danger Zone

నామినేషన్స్‌లో 9 మంది
మంగళవారం నామినేషన్స్ సెషన్స్‌కు శ్రీకారం చుట్టిన బిగ్‌బాస్.. టెనెంట్స్‌గా సెలబ్రెటీలను నేరుగా నామినేట్ చేసే పవర్ ఇచ్చాడు. దాంతో కామనర్స్ అంతా చర్చించుకుని సంజనా గల్రానీని నామినేట్ చేశారు. దాంతో ఈ వారం సంజనా గల్రానీ, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, శ్రష్టీ వర్మ, ఇమ్మాన్యుయేల్, తనూజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమోన్ పవన్‌లతో కలిపి మొత్తం 9 మంది కంటెస్టెంట్స్‌ నామినేషన్స్‌లో నిలిచారు. భరణి శంకర్ తప్పించి మిగిలిన 8 మంది సెలబ్రెటీలు నామినేషన్స్‌లోకి రావడం విశేషం.

సంజనదే డామినేషన్
ఇప్పటి వరకు అందరూ బాగానే ఆడుతున్నారు. సంజన గల్రానీ, హరిత హరీష్, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, భరణి, మర్యాద మనీష్‌లు ఫుటేజ్‌లో ఎక్కువగా కనిపిస్తుండగా మిగిలిన వారికి అంతగా స్పేస్ దొరకడం లేదు. తొలివారం కెప్టెన్సీ టాస్క్‌‌లో భాగంగా కెప్టెన్ కంటెండర్స్‌ని ఎంపిక చేసే బాధ్యతను సంజనకు అప్పగించారు బిగ్‌బాస్. దీంతో హరీష్, డిమోన్ పవన్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, శ్రష్టి వర్మల పేర్లు చెప్పింది సంజన.

బిగ్‌బాస్ తెలుగు 9 తొలి కెప్టెన్‌గా సంజన
గురువారం, శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ జరగగా.. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో చివరి వరకు రాము, శ్రీజలు నిలిచారు. రాము పోరాడినా సాధ్యం కాకపోగా.. శ్రీజ గెలవడంతో సంజన గల్రానీ హౌస్‌‌కు తొలి కెప్టెన్‌గా నిలిచారు. దాంతో సంజనకు అందరూ అభినందనలు తెలిపారు. కెప్టెన్ కావడంతో టెంపరరీ ఓనర్‌గా వారం రోజుల పాటు హౌస్‌లో అన్ని సౌకర్యాలు పొందొచ్చని బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చారు.

డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు
ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్ పరిశీలిస్తే.. రోజు గడిచేకొద్ది ఓటింగ్ లెక్కలు మారిపోతున్నాయి. ఒక్కోరోజు ఒక్కొక్కరు డామినేషన్ చూపిస్తున్నారు. సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి మధ్య టాప్ ప్లేస్ కోసం హోరాహోరీ పోరు జరుగుతోంది. అయినప్పటికీ తనూజ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. తర్వాత సుమన్ శెట్టి నిలిచాడు. ఇమ్మాన్యుయేల్ 3వ స్థానంలో, డిమోన్ పవన్ 4వ స్థానంలో, సంజన గల్రానీ 5వ స్థానంలో, రాము రాథోడ్ 6వ స్థానంలో, ఏడవ స్థానంలో రీతూ చౌదరి, 8వ స్థానంలో శ్రష్టి వర్మ, 9వ స్థానంలో ఫ్లోరా షైనీలు నిలిచారు. ఈ వారం కెప్టెన్ కావడంతో సంజన గల్రానీ నామినేషన్స్ నుంచి తప్పించుకోగా.. శ్రష్టి వర్మ, ఆశా షైనీలు డేంజర్ జోన్‌లో నిలిచారు. మరి వీరిలో ఎవరు తొలి వారం ఎలిమినేట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X