Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌బాస్ నుంచి టాప్ సెలబ్రిటీ అవుట్.. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 అప్పుడే తొలి వారం పూర్తి చేసుకోనుంది. గతం వారం ఈ మెగా రియాలిటీ షో గ్రాండ్ లాంచ్ కాగా.. అప్పుడే వారం రోజులు గడిచిపోయింది. బిగ్‌బాస్‌లో వీకెండ్ వస్తుందంటే అందరి చూపు ఎలిమినేషన్ మీదే ఉంటుంది. ఇక బిగ్‌బాస్ తెలుగు 9 లో ఎలిమినేట్ కానున్న తొలి కంటెస్టెంట్ ఎవరు? అనేది ఉత్కంఠగా మారింది. ఓటింగ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుండగా.. ఈ వివరాల్లోకి వెళితే..

నామినేషన్స్‌లో 9 మంది
ఈ వారం సంజనా గల్రానీ, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, శ్రష్టీ వర్మ, ఇమ్మాన్యుయేల్, తనూజ పుట్టస్వామి, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమోన్ పవన్‌లతో కలిపి మొత్తం 9 మంది కంటెస్టెంట్స్‌ నామినేషన్స్‌లో నిలిచారు. అయితే శుక్రవారం నాడు నిర్వహించిన టాస్క్‌లో గెలిచి బిగ్‌బాస్ తెలుగు 9 తొలి కెప్టెన్‌గా సంజనా గల్రానీ నిలవడంతో ఆమె నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయినట్లే. దీంతో మిగిలిన 8 మందిలో ఎవరు ఈ వారం హౌస్‌ను వీడుతారన్నది ఉత్కంఠగా మారింది.

Bigg Boss Telugu 9 First Week Elimination Shrasti Verma May Exit from BB House

తప్పించుకున్న సంజన
సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను పరిశీలిస్తే.. కంటెస్టెంట్స్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. తొలుత తనూజ పుట్టస్వామి ఓటింగ్‌లో దూసుకొచ్చారు.. అయితే ఆ వెంటనే సుమన్ శెట్టి ఆ ప్లేస్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్యా హోరా హోరీ ఫైట్ జరుగుతోంది. ఇక తర్వాతి ప్లేస్‌లో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, సంజన గల్రానీ, రాము రాథోడ్, రీతూ చౌదరి, శ్రష్టి వర్మ, ఫ్లోరా షైనీలు నిలిచారు. సంజన గల్రానీ కెప్టెన్ కావడంతో ఆమె నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు.

డేంజర్ జోన్‌లో ఇద్దరు
ఓటింగ్‌ను బట్టి శ్రష్టి వర్మ, ఆశా షైనీలు ప్రస్తుతం డేంజర్ జోన్‌లో నిలిచారు. రియల్ లైఫ్‌లో పలు ఇబ్బందుల్ని ధైర్యంగా ఎదుర్కొన్న వీరిద్దరూ బిగ్‌బాస్‌తో తామేంటో నిరూపించుకుంటామని చెప్పారు. ఎన్నో అంచనాల మధ్య బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి.. ఆటను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఫుటేజ్ విషయంలో వీరిద్దరూ వెనుకబడ్డారు. ఇద్దరూ ఉత్తరాదికి చెందిన వారు కావడంతో డిస్కషన్స్ సమయంలో మన లోకల్ కంటెస్టెంట్స్‌తో తెలుగులో పోట్లాడలేకపోతున్నారు. వచ్చి రానీ తెలుగులో డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వర్కవుట్ కావడం లేదు.

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగులో తొలుత శనివారం ఉదయం నుంచి ఆశా షైనీయే ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే బిగ్‌బాస్ లెక్కలు, వ్యూహాలు ఎవరికీ అంతుపట్టవు కదా? శనివారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా టాక్ మారిపోయింది. బిగ్‌బాస్ తెలుగు 9లో తొలి వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మయే అంటున్నారు నెటిజన్లు. ఈ మేరకు సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆమె ఎలిమినేషన్ వెనుక రకరకాల కారణాలను కూడా నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఎన్నో ఆశల మధ్య హౌస్‌లో అడుగుపెట్టిన శ్రష్టి వర్మ తొలి వారానికే ఎలిమినేట్ కాబోతుండటంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. మరి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవుతారా? లేక బిగ్‌బాస్ మనసు మార్చుకుంటాడా? అన్నది మరికొద్దిగంటల్లో తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X