Bigg Boss Telugu 9 Nominations: అందరి టార్గెట్ సంజనా గల్రానీయే.. తొలి వారం నామినేషన్స్‌లో ఎంత మంది అంటే?
బిగ్‌బాస్ వస్తుందంటే అందరూ ఎదురుచూసేది ప్రతి సోమవారం జరిగే నామినేషన్స్ గురించే. హోరాహోరీగా జరిగే ఈ నామినేషన్స్‌లో గొడవలు, వివాదాలు, కక్షలు, ప్రతీకారాలు, ఫ్రెండ్‌షిప్, వెన్నుపోటు ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తాయి. అందుకే ప్రేక్షకులు నామినేషన్స్ ఎపిసోడ్‌ను అస్సలు మిస్ అవ్వరు. ఈ సెప్టెంబర్ 7న బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తొలి వారం నామినేషన్స్ ఎలా జరిగాయి? ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వివరాలు మీకోసం.
హరిత హరీష్ విశ్వరూపం
బిగ్‌బాస్ సీజన్ మొదలైన వెంటనే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. తానేంటో? రాబోయే రోజుల్లో తన ఆటతీరు ఎలా ఉంటుందో తొలి రోజునే కంటెస్టెంట్స్‌కు ట్రైలర్ చూపించాడు. నా ముందు మీరు పనికి రారు అన్నట్లుగా ఓవరాక్షన్ చేశాడు. హౌస్ ఓనర్స్‌గా ఉన్న సామాన్యులు.. ఔట్ హౌస్‌లో ఉంటున్న సెలబ్రెటీలకు ఓ ఆఫర్ ఇచ్చారు. మీరంతా మమ్మల్ని రకరకాలుగా ఇంప్రెస్ చేస్తే మెయిన్ హౌస్‌లోకి వచ్చి.. ఇష్టమైన ఫుడ్ తినొచ్చని చెప్పారు. ఇక బిగ్‌బాస్ లాంచింగ్ రోజున కొంతమంది సెలబ్రెటీలకు కామనర్స్ కొన్ని పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని ఎవరెవరు? ఎలా చేస్తున్నారో? వ్యక్తిగతం పరిశీలించాలని బిగ్‌బాస్ ఆదేశించారు.

దొంగగా మారిన రీతూ చౌదరి
తనూజ, భరణిలు కుకింగ్ మాత్రమే చేస్తారని.. కిచెన్‌లో ఎలాంటి క్లీనింగ్ చేయరని ప్రియ తేల్చి చెప్పడంతో హరీష్ మండిపడుతూ ఆమెతో వాదనకు దిగాడు. దాంతో కామనర్సే ఆయనకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టేశారు. సెలబ్రెటీలకు పనికి తగ్గ ఫుడ్ పెడతామని బిగ్‌బాస్ చెప్పడంతో సరిగా వర్క్ చేయని వాళ్లని హరీష్ ఒక ఆట ఆడుకున్నారు. అటు ఆకలికి తట్టుకోలేక బిస్కెట్ ప్యాకెట్లు కొట్టేసింది దమ్ము శ్రీజకు దొరికిపోయింది రీతూ చౌదరి. ఇంతలో హరీష్‌తో కామెడీ చేయాలనుకుని చీవాట్లు తిన్నాడు ఇమ్మాన్యుయేల్. గుండు అంకుల్.. గుండు అంకుల్ అని పిలవడంతో బాడీ షేమింగ్ వరకు వెళ్లొద్దని హరీష్ క్లాస్ పీకాడు.
నచ్చితే గుండెల్లో పెట్టుకుంటా
నేను బాడీ షేమింగ్ చేయలేదని ఇమ్మాన్యుయేల్ కూడా తగ్గకుండా గొడవకు దిగాడు. గుండు అంకుల్ అంటే బాగోదని ఎక్కడికైనా వెళ్దాం, చూసుకుందాం అని హరీష్ ఊగిపోవడంతో ఇమ్మాన్యుయేల్, శ్రేష్టి వర్మలు అతనిని కూల్ చేశారు. నాకు నచ్చితే ఎవరినైనా గుండెల్లో పెట్టుకుంటానని, లేదంటే తొక్కుతానని హరీష్ పంచ్ డైలాగ్ పేల్చాడు. మొత్తానికి తొలి రోజు మాత్రం ఏ కెమెరా చూసినా, ఏ ఫుటేజ్ చూసినా హరిత హరీషే కనిపించి హైలైట్ అయ్యాడు.
హరీష్‌కు గుద్దిపడేశారంతే
ఇకపోతే.. సోమవారం ఫస్ట్ ఎపిసోడ్‌లో చాలా వరకు హౌస్‌ను, ఆటను అర్ధం చేసుకోవడానికి బిగ్‌బాస్ ఛాన్స్ ఇచ్చినట్లుగా అర్ధమవుతోంది. తర్వాత నామినేషన్స్ ప్రారంభమైనట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వారం బిగ్‌బాస్ హోరాహరీగా సాగింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. హౌస్‌కి ఓనర్లుగా ఉన్న కామనర్స్‌తో సెలబ్రెటీలలో నుంచి ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. దీంతో కామనర్స్ డిస్కష్ చేసుకుని సంజన పేరు చెప్పారు. మీ వల్ల గొడవలు అవుతున్నాయని, మీరు అబద్ధాలు ఆడుతున్నారని కామనర్స్ పాయింట్ రైజ్ చేశారు.
దీంతో సంజన డిఫెండ్ చేసుకునేందుకు ట్రై చేసింది. హౌస్‌లో వాటర్ తాగాలన్నా మీ పర్మిషన్ ఎవడికి కావాలని ఆమె నిలదీసింది. చివరిలో సంజన - ఫ్లోరా షైనీ కూడా గొడవ పడ్డారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి బిగ్‌బాస్ తెలుగు 9లో తొలి వారం 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు తనూజా, ఫ్లోరా షైనీ, ఇమ్మాన్యుయేల్, శ్రేష్టీ వర్మ, రీతూ చౌదరి, డిమాన్ పవన్, సంజన గల్రానీ, రాము రాథోడ్, సుమన్ శెట్టి. మరి వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











