Bigg Boss Telugu 9 voting: ఓటింగ్‌లో మరోసారి కన్నడ డామినేషన్.. టాప్‌లో ఆమె, డేంజర్ జోన్‌లో ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 తొలివారంలోనే రెండో రోజే వివాదాలు, గొడవలతో హౌస్ మొత్తం అల్లకల్లోలంగా మారింది. నామినేషన్ తంతును ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి హౌస్ రూపు రేఖలు మారిపోయాయి. తొలివారం హోరాహోరీగా నామినేషన్లు జరగ్గా.. సోషల్ మీడియాలో అప్పుడే ఓటింగ్ స్టార్టింగ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ అనధికార ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? ఈ వివరాలు పరిశీలిస్తే..
బిగ్‌బాస్‌లోకి 15 మంది కంటెస్టెంట్స్
సెప్టెంబర్ 7న జరిగిన బిగ్‌బాస్ లాంచింగ్ రోజున 9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. వారే తనూజా పుట్టస్వామి, ఫ్లోరా షైనీ, సంజన గల్రానీ, భరణి శంకర్, శ్రేష్టి వర్మ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ రీతూ చౌదరి, రాము రాథోడ్, సుమన్ శెట్టిలు సెలబ్రెటీ హోదాలు హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఇక కామనర్స్ కోటా హరిత హరీష్, దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్‌లు ఎంట్రీ ఇచ్చారు.

నామినేషన్స్‌లో హోరాహోరీ
మంగళవారం నామినేషన్స్ సెషన్స్‌కు శ్రీకారం చుట్టడంతో అప్పటి వరకు జోష్‌గా ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయారు. ఓనర్స్ ప్లేస్‌లో ఉన్న కామనర్స్‌కి ఈసారి సెలబ్రెటీలను నేరుగా నామినేట్ చేసే పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దాంతో మరో మాట లేకుండా అందరూ సంజనా గల్రానీని నామినేట్ చేశారు. దాంతో ఈ వారం సంజనా గల్రానీ, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, శ్రష్టీ వర్మ, ఇమ్మాన్యుయేల్, తనూజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమోన్ పవన్‌లతో కలిపి మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. ఈ వారం భరణి తప్పించి మిగిలిన 8 మంది సెలబ్రెటీలు నామినేషన్స్‌లో నిలవగా.. సామాన్యుల నుంచి పవన్ ఒక్కడు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు తొలి వారం హౌస్‌ను వీడతారనేది ఆసక్తిగా మారింది.
ఓటింగ్‌లో టాప్ ఎవరంటే?
ఆన్‌లైన్‌లో అధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను పరిశీలిస్తే.. కన్నడ పిల్ల తనూజ పుట్టస్వామి టాప్‌లో కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు ఏకంగా 23 శాతానికి పైగా ఓట్లు పడుతుండగా, ఆ తర్వాత జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ 20 శాతం ఓట్లతో నిలిచాడు. డిమోన్ పవన్ 17 శాతం ఓటింగ్‌తో, రీతూ చౌదరి 12 శాతం ఓట్లతో, రాము రాథోడ్ 8 శాతం ఓట్లు, శ్రష్టి వర్మకు 6 శాతం ఓట్లతో నిలిచారు. సంజన గల్రానీకి 6 శాతం, సుమన్ శెట్టికి 5 శాతం, ఫ్లోరా షైనీకి 4 శాతం ఓట్లు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
డేంజర్ జోన్‌లో ముగ్గురు
ఈ ఓటింగ్‌ను బట్టి సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, సంజన గల్రానీలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి మరో నాలుగు రోజులు ఉండటంతో వీరి ర్యాంకింగ్ మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బిగ్‌బాస్‌లో తొలి వారం ఎప్పుడూ పెద్ద వయస్కుల వారే ఎలిమినేట్ అవుతుండటం సెంటిమెంట్‌గా వస్తుండటం, తాజా ఓటింగ్‌లో వయసు పెద్ద అయినవారే డేంజర్ జోన్‌లో ఉండటంతో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేదా అన్నది త్వరలోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











