భరణి, ఇమ్మాన్యుయేల్‌‌లపై నోరు జారిన హరీష్ .. ఆడింగోళ్లంటూ బూతు పురాణం

బిగ్‌బాస్ తెలుగు 9 రోజులు గడిచేకొద్ది ఉత్కంఠగా మారిపోయింది. చూస్తుండగానే ఫస్ట్ వీక్ ఎండింగ్‌కు వచ్చేసింది. ఇప్పటికే హౌస్ రణరంగంలా మారి కంటెస్టెంట్స్ కొట్టుకు చస్తున్నారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సంజన గల్రానీ ఓ ఆట ఆడుకుంటున్నారు. హౌస్ మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకుంటూ కెప్టెన్ రేసులో దూసుకెళ్తున్నారు. సెలబ్రెటీలతో పాటు కామనర్స్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా మాస్క్ మ్యాన్ హరిత హరీష్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

సంజన డేర్‌కు బిగ్‌‌బాస్ ఫిదా
నాలుగో రోజున సంజనను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచిన బిగ్‌బాస్ ఆమెను కుశల ప్రశ్నలు వేశాడు. బిగ్‌బాస్ హౌస్ ఎలా ఉంది? కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? వంటి ప్రశ్నలతో సంజన అభిప్రాయం కనుక్కోవాలని ట్రై చేశాడు. అందరికీ నేను ఫేవరెట్ నామినేషన్ అయ్యానని.. ఎంటర్‌టైనింగ్ కోసమే ఇదంతా చేస్తున్నానని చెప్పింది సంజన. కానీ అందరూ మూకుమ్మడిగా నన్ను నామినేట్ చేయడం నచ్చలేదని.. నా మైండ్‌లో ఏముందో అదే మాట్లాడతానని, ఎంతమంది కార్నర్ చేసినా నవ్వుతూనే ఉంటానని సంజన చెప్పింది.

Bigg Boss Telugu 9 Haritha Harish fires on Bharani Shankar and Jabardasth Emmanuel

సంజనకు బిగ్‌బాస్ స్పెషల్ పవర్
నేను ఏడవను, నిలబడతానని సంజన తేల్చసింది. ఆమె మాటలకు ధైర్యానికి ఫిదా అయిన బిగ్‌బాస్.. సంజనకు ఓ స్పెషల్ పవర్ ఇచ్చారు. కెప్టెన్సీకి పోటీపడతారని అర్హత ఉందని మీరు భావించిన ఐదుగురిని ఎంపిక చేయాలని .. మీరు చెప్పినవారిలో నుంచే బిగ్‌బాస్ తెలుగు 9కి ఫస్ట్ కెప్టెన్ అవుతారని చెప్పాడు. అయితే ఇక్కడే బిగ్‌బాస్ ఓ కండీషన్ పెట్టాడు.. మీరు ఎంపిక చేసే కంటెస్టెంట్స్‌లో ఇద్దరు ఓనర్లు అయ్యుండాలని చెప్పాడు. దీంతో సంజన ఏమాత్రం తడుముకోకుండా ఓనర్ల నుంచి హరీష్, డిమోన్ పవన్, జబర్దస్త్ ఇమ్యాన్యుయేల్, సంజన, శ్రష్టి వర్మల పేర్లు చెప్పింది. తర్వాత వాళ్లనే ఎందుకు సెలెక్ట్ చేశావని బిగ్‌బాస్ రీజన్ అడగ్గ.. సంజన తన ప్లాన్ చెప్పింది. బయటకు వెళ్లాక బిగ్‌బాస్ ఇచ్చిన ఆఫర్.. కన్ఫెషన్ రూమ్‌లో ఏం జరిగిందో చెప్పింది

కెప్టెన్సీ టాస్క్‌లో హోరాహోరీ
ఆ తర్వాత బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్‌కి శ్రీకారం చుట్టారు. కెప్టెన్ కావాలనుకుంటే.. సంజన ప్రకటించిన లిస్ట్‌లో వాళ్లు కాకుండా మిగిలిన వారి సపోర్ట్ కావాలని చెప్పాడు. ఆ తర్వాత వదలకు బెదరకు పేరుతో కెప్టెన్సీ టాస్క్‌లో ఉన్న వారి తరపున సపోర్ట్‌గా నిలిచిన వారు గేమ్ ఆడాలని చెప్పాడు. టాస్క్ మధ్యలో ఇమ్మాన్యుయేల్, మనీష్ మధ్య గొడవ జరిగింది. ఈ దశలో ఇమ్మూని గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తూ మనీష్ తన నిర్ణయం చెప్పడంతో అంతా షాక్ అయ్యారు.

Take a Poll

హరిత హరీష్ నోటి దురుసు
అయితే ఈ గేమ్ గురువారం పూర్తి కాకపోవడంతో శుక్రవారం కూడా కంటిన్యూ అయ్యింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. దీని ప్రకారం భరణికి, మనీష్‌కు ఈసారి పెద్ద గొడవ జరిగింది. తొక్కలా ఉందంటూ ప్రియ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కూర్చొంది. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లో భరణి, ఇమ్మాన్యుయేల్ మధ్య టాస్క్ గురించి డిస్కషన్ జరిగింది. నేను కామ్‌గా కూర్చొంటే ఇలా ఇలా చేశావని చెప్పడం కరెక్టా? మాది అన్‌ఫెయిర్ అని ఇమ్మాన్యుయేల్ ఫైర్ అయ్యాడు. ఆ వెంటనే దమ్ము శ్రీజతో హరీష్ డిస్కషన్ చేస్తూ.. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్‌లు ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు అనుకున్నాను. కానీ నాకు తెలియదు ముగ్గురు వెధవలో ఫైట్ చేశానని ఇప్పుడే అర్ధమైందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారగా.. ఇది హౌస్‌లో పెంట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X