Jabardasth Emmanuel: అద్దంలో ముఖం చూసుకోమన్నారు.. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ లైఫ్ స్టోరీ ఇదే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ తెలుగు 9 అట్టహాసంగా ప్రారంభమైంది. 9వ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా ఎవరు అడుగు పెట్టబోతున్నారా? అన్న ఉత్కంఠకు తెరదించుతూ ఒక్కొక్కరుగా సెలబ్రెటీలు హౌస్‌లో అడుగుపెడుతున్నారు. తాజాగా జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇమ్మాన్యుయేల్ ఎవరు? ఎలా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు? అతని బయోగ్రఫి ఒకసారి పరిశీలిస్తే..
ప్రతిభతో టాప్ ప్లేస్‌కి
ప్రతిభ ఉన్నోడికి అందం, ఆకర్షణీయమైన రూపం అక్కర్లేదని ఎంతోమంది నిరూపించారు. నల్లగా ఉన్న రజనీకాంత్ సూపర్‌స్టార్‌గా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ కోవలోకే వస్తారు జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్. తెలుగు బుల్లితెరపై డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో ఇతను కూడా ఒకరు. సినిమాల్లో వెలిగిపోవాలనే ఆశతో ప్రయత్నాలు ప్రారంభించిన ఇమ్మాన్యుయేల్ అందుకు బుల్లితెరను సాధనంగా చేసుకున్నాడు. తొలుత ఈటీవీలో ప్రసారమైన పటాస్ షోలో పాల్గొని తన పంచ్‌లతో ఆకట్టుకున్నాడు. బుల్లితెరపై తాడోపేడో తేల్చుకోవాలని భావించిన అతను ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు.

జబర్దస్త్‌లోకి ఎంట్రీ
ఇమ్మాన్యుయేల్ టైమింగ్, పంచ్‌లకు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ రావడంతో పటాస్ నిర్వాహకులు అతనిని మరింతగా ప్రోత్సహించారు. ఈ క్రమంలో తెలుగులో టాప్ కామెడీ షోగా వెలుగొందుతున్న జబర్దస్త్‌లో ఇమ్మాన్యుయేల్‌కు అవకాశం దక్కింది. తొలుత పలు టీమ్ లీడర్స్ కింద పనిచేసిన ఈ కుర్రాడు.. తన స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. జబర్దస్త్ సీనియర్ కమెడియన్లు ఒక్కొక్కరిగా నిష్క్రమించడంతో ఇమ్మాన్యుయేల్‌కు బాగా కలిసొచ్చింది. ఇక అప్పటి నుంచి మరింతగా రెచ్చిపోయాడు.
వర్ష రాకతో లైఫ్ చేంజ్
అయితే వర్ష ఎప్పుడైతే ఇమ్మాన్యుయేల్ జీవితంలో అడుగుపెట్టిందో నాటి నుంచి అతని జీవితం మారిపోయి, ప్రత్యేకంగా క్రేజ్ వచ్చింది. వర్షతో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. చివరికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. జబర్దస్త్‌లో సుధీర్ - రష్మీ లవ్ ట్రాక్ రేంజ్‌లో ఇమ్మాన్యుయేల్ - వర్ష బాండింగ్ కూడా బాగా పాపులరైంది. అలా చాక్లెట్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఇమ్మాన్యుయేల్ ఎక్కడ కనిపించినా? ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లినా వర్షతో పెళ్లెప్పుడు అని జనం గుర్తుపట్టి మరి అడిగే రేంజ్‌కి వెళ్లిపోయాడు.
సినిమాల్లోనూ బిజీ
జబర్దస్త్‌తో వచ్చిన ఫేమ్‌తో కొర్రమీను, గం గం గణేశ తదితర చిత్రాల్లో నటించాడు. ఈటీవీలో జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, స్టార్ మాలో కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ తదితర షోలలో పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇమ్మాన్యుయేల్. తన కష్టం, ప్రతిభతో విపరీతమైన పోటీని తట్టుకుని నిలబడి ఈ స్థాయికి చేరుకున్నాడు ఇమ్మాన్యుయేల్. ఒకప్పుడు అద్దంలో నీ ముఖాన్ని చూసుకున్నావా? అని హేళన చేసిన వారితోనే శెభాష్ అనిపించుకున్నాడు ఇమ్మాన్యుయేల్. ఎవరు ఎంత టార్గెట్ చేసినా, ద్వేషించినా, హేళన చేసినా నవ్వుతూ భరించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు ఇమ్మాన్యుయేల్. జీవితంలో సొంతంగా కారు కొనుక్కున్నప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిదని అతను పలుమార్లు తెలిపాడు. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు ఇమ్మాన్యుయేల్.


Click it and Unblock the Notifications











